ఉత్తరాయణం

వాస్తవాలు గ్రహించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమకు అనుకూలంగా ఉండే కొన్ని అంకెలు ఉదహరించి మహాసిద్ధాంతాలు ప్రవచించేస్తాయి వామపక్షాలు. ఈమధ్య జరిగిన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన మీరాకుమార్ కన్నా గోపాలకృష్ణ గాంధీకి 9 ఓట్లు ఎక్కువ వచ్చాయి కనుక విపక్షాల బలం మెరుగుపడిందని, ఇది విపక్షాలకు శుభసూచన అని వామపక్షాలు సిద్ధాంతీకరించాయి. అయితే అవి చెప్పని అంకెలు మరో నిజాన్ని చెప్తున్నాయి. విపక్షాలకు చెందిన 21 ఓట్లు భాజపా ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్య నాయుడి ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్ ఎంపిలు 12మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈ అంకెలు వామపక్షాల సిద్ధాంతానికి తూట్లు పొడుస్తాయి కాబట్టి వాళ్లు చెప్పలేదు.
-్ధర్మతేజ, గొడారిగుంట
కల్తీ నూనెలు
కల్తీ వ్యాపారుల బాగోతాలు నిత్యం బయటపడుతునే వున్నాయి. పశువుల మాంసంతో వంట నూనెలు తయారుచేస్తూ వాటిని ప్రముఖ కంపెనీల కవర్లలో నింపి చిల్లర దుకాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు కూడా రంగంలో దిగి కల్తీ వ్యాపారుల దందాను అరికట్టకపోతే వంట నూనెలను కొనడానికి జనం వెనకాడే పరిస్థితి వస్తుంది. ఈ మధ్య ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఓ లారీ ప్రమాదానికి గురి కాగా అందులో గోమాంసం నింపిన బస్తాలు బయటపడ్డాయి. ప్రజలు ఆ లారీని దగ్ధం చేసారు. ఈ లారీ చెక్‌పోస్టును దాటుకుంటూ ఎలా వచ్చింది? ప్రమాదం జరగకపోయివుంటే ఈ గోమాంసంతో మరింతగా కల్తీ నూనెలు తయారయ్యేవి! చెక్‌పోస్టుల్లో అధికారుల విధి నిర్వహణను అనుమానించాల్సి వస్తుంది. కఠిన శిక్షలు వేయకపోతే కల్తీదారులు నిర్లక్ష్యంగా ప్రతి సరుకును కల్తీమయం చేస్తారు. దేశ రక్షణకు తీసుకునే చర్యల వలే కల్తీ వ్యాపారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
మళ్లీ అతుక్కొన్న ‘రెండాకులు’!
జయలలిత మరణం తర్వాత రెండుగా చీలిన ‘రెండాకుల’ గుర్తు పార్టీ ‘అన్నా ద్రవిడ మునే్నట్ర కజగం’ ఢిల్లీ సౌజన్యంతో మళ్లీ ఒక్కటవ్వటం ముదావహం. అయితే విడిపోయిన రెండాకులూ ఎంత పటిష్టంగా కలిసి ఉంటాయో, ఎంతకాలం పటిష్టంగా ఇమడగలవో చెప్పడం కష్టం. ఒక గ్రూపుకి నాయత్వం వహిస్తున్న ఈపిఎస్ (పళనిసామి), మరో గ్రూప్ లీడర్ ఓపిఎస్ (పన్నీర్ సెల్వం) గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళ ‘సిస్టం’ ఇప్పుడు యుపిఎస్‌మీద నడుస్తున్నదని, అది తాత్కాలికమేనని గ్రహించాలి. ఏఐఎడిఎంకె పార్టీకి అసలు ‘పవర్ సప్లై’ జయలలిత మరణంతో పోయినా, వాళ్ళు తమలోనే ప్రత్యామ్నాయం వెదుక్కోకుండా బయట ‘యుపిఎస్’మీద ఆధారపడ్డారు. ఏక వ్యక్తి అజమాయిషీలో వున్న ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి ఎదుర్కోవడం సర్వ సాధారణమే. బలమైన నేత నిష్క్రమణ తరువాత అనుచరులు తలో దిక్కు పట్టడం ఊహించతగ్గదే. అయితే ఆ తరహా సంక్షోభం తర్వాత త్వరితంగా బయటపడి పార్టీగా తమ విధులు నిర్వర్తించాలి. తమ సిద్ధాంతాలకనుగుణంగా ప్రజా మద్దతు పొందాలి. పాలకపక్షంగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజా జీవితంలో ప్రాసంగిత కోల్పోవడం ఖాయం. ఇటు ‘కమలం’ (్భజపా) నీడలోనో, అటు ‘సూర్యుడి’ (డిఎంకె) వేడిలోనో రెండాకులు వడలిపోకూడదంటే ఎఐఎడిఎంకె పూర్తిగా ప్రజా పాలనపై దృష్టి పెట్టాలి. చెప్పడం సులువే అయినా ఆచరణలో కష్టమే మరి.
-డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం