ఉత్తరాయణం

బాబాలు దేవుళ్లు కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మిత్ రామ్హ్రీమ్ సింగ్ అనే బాబాకు ఇరవై ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి రోహ్‌తక్ లోని జైలుకు వెళ్లి తీర్పు చెప్పడం చరిత్రలో ఇదే మొదటిసారి. బాబాల పేరుతో ఆశ్రమాలు స్థాపించి, ఏవో కొన్ని మాయలు చేసి తాను దేవుడినని అమాయక ప్రజలను నమ్మించి భారీగా సొమ్మును సంపాదించి చివరకు నేరస్థులుగా నిరూపింపబడ్డ వారెందరో మన ముందు కనిపించినా ఇంకా జనం బాబాల వలలో చిక్కుకుంటునే వున్నారు. ఈ మత్తు ఎంతవరకు పాకిందంటే డేరా అరెస్టయిన తర్వాత జరిగిన అల్లర్లలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని మాయలు నేర్చినా మనిషి దేవుడు కాలేడు. నిజానికి దేవుడికి రూపమే లేదు. కానీ మనసు నిలకడకోసం ఓరూపాన్ని అంటే రాముడిగానో, కృష్ణుడిగానో, మరో రూపాన్నో ఏర్పరుచుకుని పూజిస్తున్నాం. తానే దేవుడిననిగానీ, భగవత్ స్వరూపుడని కాని చెప్పుకునేవారిని ఎవరూ నమ్మి మోసపోరాదు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
శ్రుతిమించిన పొగడ్తలు
‘మహీ’ తోడుగా ‘్భవీ’ ఆడగా టీమ్‌ఇండియా అద్భుత విజయం అంటూ మీడియా శ్రీలంక, భారత్‌ల రెండో వనే్డని పొగడడం ఉత్తర కుమార ప్రజ్ఞని జ్ఞప్తికి తెచ్చింది. భారత్ టెస్ట్‌సీరీస్‌ని క్లీన్ స్వీప్ చేయడం చారిత్రాత్మకం అంటూ ఓ పత్రిక పులకించిపోయింది. కానీ మ్యాచ్ వీక్షకుల్లో ఆ ఉత్సాహం లేనేలేదు. ఏ మ్యాచ్ అయినా ప్రేక్షకుల్ని ఎంతవరకూ అలరించింది అన్నది ముఖ్యం. వనే్డ మహిళల ప్రపంచ కప్ పైనల్లో భారత్ ఓడిపోయినా, మహిళా క్రికెటర్లు అందరి అభిమానం సంపాదించారు. ఇప్పుడు శ్రీలంకలో మనవాళ్లు గెలిచినా పట్టించుకున్నవారే లేరు! చచ్చీ చెడి గెలిచిన భారత్ అని రెండో వనే్డని అభివర్ణించడం ఎంతో సముచితం!
-కృష్ణ, కొండయ్యపాలెం
భాజపా కాస్త విభిన్నం..
తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే భాజపా తాను కూడా ‘ఆ తానులోని ముక్కేనేన’న్న విమర్శను ఎదుర్కొంటున్నది. కాస్త ఆలోచిస్తే మనలో 90 శాతం మందికి అవినీతి, లంచగొండితనం అసలు సమస్య కానే కాదు. బెయిల్‌పై విడుదల అయిన హంతకులు, అవినీతిపరులకు జైకొట్టి వారికే ఓటువేసే ప్రజలున్నారు. మంచోడో, దుర్మార్గుడో, తమ కులం వాడు లేదా మతం వాడు అయితే చాలు ఓట్లు వేసేస్తారు. ఇలాంటివాళ్లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఈ విధంగా భాజపా అదే తానులో ముక్క. అయితే పార్టీలోని అవినీతిపరుల్ని అదుపుచేసి తమకు బురద అంటకుండా పనిచేసే నేతలు కొందరైనా ఉన్నారు కాబట్టి అది విభిన్నమైన పార్టీ కూడా.
-పి.ఎస్.లక్ష్మి, కాకినాడ