ఉత్తరాయణం

యువనేతల తీరు ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర భారతంలో రాహుల్ గాంధీ, దక్షిణ భారతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఒకే తరహా రాజకీయ వ్యక్తులు. ఇద్దరూ రాజకీయంగా ఎదగనివారే. రాహుల్ తల్లి చాటు బిడ్డడు. జగన్ తండ్రి పేరును వాడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి పదవి వంశ పారంపర్యమని భావించిన జగన్ ఇపుడు చంద్రబాబును తిట్టడం మినహా వేరే పనేం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఇక, తల్లి ఎంతగా చెబుతున్నా రాజకీయంగా ఎదగలేకపోతున్నాడు రాహుల్. జగన్ తనకు అన్నీ తెలుసుననే అహంభావం కలవాడు. వాస్తవానికి రాజకీయంగా పసివాడు జగన్. వైఎస్‌ఆర్ సిపిలో వున్న వారంతా వందమాగధులే. ఎదుగుతున్న షర్మిలను పక్కకు నెట్టేసి అంతా తానై పార్టీని నడుపుతున్నాడు జగన్. అవినీతిపై జగన్ మాట్లాడడం విడ్డూరం. పోనుపోను మన ప్రజాస్వామ్యం బక్కచిక్కిపోతోంది. రాజకీయ పార్టీలు విమర్శ ప్రతివిమర్శలతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ. జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకోవడంలో బహు నేర్పరి. చంద్రబాబుపై జగన్‌కు అంత అక్కసు ఎందుకో?
-కె.వి.రమణమూర్తి, కాకినాడ
సంక్షేమమే ఎజెండా
ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా పన్నులను ముక్కుపిండి వసూలు చేయడం మినహా కనీస సౌకర్యాల కల్పన, నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు, సామాన్యుల జీవనవిధానంపై దృష్టి సారించిన జాడ లేదు. విలువ ఆధారిత పన్ను, వస్తు సేవా పన్ను వంటివి వినియోగదారుని పళ్లు రాలగొట్టడమే అంతిమ లక్ష్యంగా ఉన్నాయి. హోటల్‌కు వెళ్లి అల్పాహారం తీసుకుంటే ప్రస్తుతం భోజనానికి చెల్లించే ధర చెల్లించాల్సి వస్తోంది. బట్టల దుకాణంలోనూ జేబుకు చిల్లు పడుతోంది. నేత కార్మికుడికి అవసరమైన చిలప నూలుపై పన్ను రాబడుతుంటే- ఇసుక నుండి తైలం తీయవచ్చన్న సామెత నేటి కేంద్ర పాలకులకు అతికినట్టు సరిపోతుంది. పెట్రో ఉత్పత్తులపై రోజువారీ బాదుడు తప్పడం లేదు. కొద్దిమంది అధికారులపై, ప్రతిపక్ష నేతలపై అవినీతి నిరోధక శాఖచే దాడులు చేయించి దేశంలో అవినీతిని అంతమొందించామంటూ ప్రధాని పదే పదే ప్రకటిస్తున్నారు. గానీ అవినీతికి పాల్పడుతున్నవారిలో మార్పు తీసుకువచ్చి ఇతరులు ఆ దారిలో పయనించకుండా చేసిన సంఘటనలు లేవు. ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య ఇటీవల రెట్టింపు అయిందంటున్నారు. మరి ఈ ఆదాయమంతా ఏ భోషాణానికి చేరుతుంది? గత పాలకులు ఆంధ్రప్రదేశ్‌ని అడ్డంగా విడదీసి అన్యాయం చేసారనుకుంటే, అప్పటి హామీలు నెరవేర్చకుండా కొందరు అడ్డు తగులుతున్నారు. మిత్రపక్షమైన టిడిపి అధికారంలో ఉన్న ఏపికి నిధులు ఇవ్వడానికి కేంద్ర పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేంద్రంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం నైరాశ్యం వీడి ప్రజల పక్షాన పోరాడకుంటే మరిన్ని చేదు ఫలితాలు తప్పవు. అధికారంలో ఉన్నా లేకున్నా నేతలకు ప్రజాక్షేమమే ఏకైక ఎజెండా కావాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
‘గోప్యత’పై వ్యాఖ్యలు సరికాదు
వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు తీర్పు కేంద్రానికి ఎదురుదెబ్బ అని సోనియా చెప్పడం కేవలం నయవంచనే. వ్యక్తి స్వేచ్ఛనే కాదు, గతంలో న్యాయమూర్తుల స్వేచ్ఛనూ ఎమర్జెన్సీ పేరిట హరించిన కాంగ్రెస్ ఇప్పుడు జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదం. మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ వ్యాఖ్య సమంజసంగా వుంది. ఇప్పటివరకు రాజ్యాంగాన్ని సుప్రీం సవరింన దాఖలా ఒక్కటీ లేదు. కోర్టులో గోప్యత గురించి పిటిషన్‌దారుల వాదనను కేంద్రం ఇదివరకే అంగీకరించినప్పుడు అసలు ప్రాధాన్యం లేని అంశాన్ని ఇంత పెద్దది చేయడం అనవసరం అని ఆయన అనడం గమనార్హం.
-గిరిధర్, కాకినాడ