ఉత్తరాయణం

అసోంలో కాంగ్రెస్‌కు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోంలో ఈమధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకు ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు గుణపాఠం చెప్పారు. ఆ రాష్ట్రంలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం దీనికి రుజువు. ఇంతకాలం మైనారిటీలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపిన కాంగ్రెస్ ఎత్తులను వారు చిత్తు చేశారు. స్థానిక ముస్లింల హక్కులను కాపాడటం బిజెపివల్లనే సాధ్యమని వారు విశ్వసించబట్టే ఆ పార్టీకి మంచి విజయం దక్కింది.
వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం.

జల జగడాలు వద్దు
నిన్నటివరకు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి, కృష్ణా నదుల నీటికోసం వివాదాలు ఉండేవి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఈ జలవివాదాలు రావడం దురదృష్టకరం. ఈ నాలుగు రాష్ట్రాల్లోను నాలుగు విభిన్న రాజకీయపక్షాలు అధికారంలో ఉండటంవల్ల వివాదం రాజుకుంటోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ వివాదాలు ముదురుపాకాన పడి కోర్టులను ఆశ్రయించడం బాధాకరం. సముద్రం పాలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆయా రాష్ట్రాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి ముందడుగు వేయాలి. జాతీయభావనతో వ్యవహరిస్తే ఈ జల వివాదాలు సమసిపోవడం కష్టంకాదు.
శోభనాచలం, గరికపర్రు

ధరల దరువు
రాష్ట్రంలో మూడు నాలుగు సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య ప్రజలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిపెట్టి పేదలను ఆదుకోవలసిన సమయం ఇది.
జి.వి.రత్నాకర్ రావు, హనుమకొండ

ఆ రోడ్డు బాగు చేయండి
కర్నూలు జిల్లాలోని గూడురునుంచి కొత్తకోటకు రోడ్డు చాలా అద్వానంగా ఉంది. ఈ రోడ్డుమార్గం గోతులమయం కావడంతో ప్రయాణం ప్రయాసతో కూడుకున్నది. ఈ మార్గంలో ప్రయాణిస్తే ఒళ్ళు హూనం అవటంతో పాటు వాహనాలు పాడైపోతున్నాయి. తెలంగాణకు చెందిన అనేక గ్రామాల ప్రజలకు ఈ మార్గం అవసరమే. స్థానిక ఎంపి బుట్ట రేణుక ఈ రోడ్డు మరమ్మతులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. మిగతా రాజకీయ నాయకుల్లాగా నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వేగంగా ఆ హామీని నిలబెట్టుకుంటే ప్రజలకు మేలు చేసినవారవుతారు.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్