ఉత్తరాయణం

నిరాశ పరుస్తున్న ఎస్‌విబి చానల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఇది జగత్‌సత్యం. మొత్తం భారతదేశంలో వున్న భక్తులకు కూడ ఆయన ఆరాధ్యుడే. టి.టి.డి. వారు ఎస్‌విబిసి పేరుతో పది సంవత్సరాల క్రితం భక్తి టి.వి.చానల్ ప్రవేశపెట్టారు. అనేక మంది సంతోషించారు. శ్రీవారి సుప్రభాతం ఇతర సేవా కార్యక్రమాలు మీ ఎస్‌విబిసి చానల్‌లో చూసి, విని ఆనందిస్తారని అనుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి సుప్రభాత సేవను విని ఆనందించాలనుకున్నారు. కాని మా ఆశను నిరాశపరిచారు. చానల్ ప్రారంభ దశలో ప్రతిరోజు ఉ.5.30 గంటలకు శ్రీవారి సుప్రభాతం, ఇతర సేవలు ప్రసారం చేసేవారు.
కాని కొంతమంది దురాశపరుల ఆలోచనవలన కార్యక్రమం నాలుగు సంవత్సరాలనుండి నిలుపువేసారు. కొన్ని పనికిరాని కార్యక్రమాలు (దైవము, భక్తి సంబంధము లేనివి) కార్యక్రమాలకోసం శ్రీవారి సుప్రభాతం, ఇతర సేవలు ప్రసారాలు నిలిపివేసారు. కొండమీద రాత్రి 2.30 గంటలకు శ్రీవారి సుప్రభాతం ఇతర సేవలు టి.వి.చానల్‌లు ప్రసారం చేస్తున్నారు. మరల ఎందుకు ఉదయం అవి ప్రసారం చేయాలి. అవి ఎందుకు ప్రసారం చేయాలి అని నిలిపివేసారు. కొంతమంది దురాలోచనా పరుల సలహాలతో పై కార్యక్రమం ప్రసారం మానేసారు. ఎవరైనా మీ టి.టి.డి. ఉద్యోగులు గాని, తిరుమల తిరుపతి వాసులు గాని ప్రతిరోజు రాత్రి 2.00 గంటలకు లేచి ఎస్‌విబిసి చానల్ చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? సాధారణంగా ఎవరైనా రోజు ఉదయం 5.30 గంటలకు లేస్తారు. తరువాత టి.వి. కార్యక్రమాలు చూస్తారు. ఎవరు ఎక్కడ కూడా రాత్రి 2.30గంటలకి టి.వి. చానల్ రోజు చూడలేరు. ఆంధ్రుల గతి అలాగ తయారు అయింది. మన రాష్ట్రంలో ఉన్న దైవాన్ని మనం గౌరవించలేకపోతున్నాం. ఇతర రాష్ట్ర టి.వి.చానల్‌వారు మన దైవాన్ని గౌరవించి వారి టి.వి.చానల్‌లో ప్రతిరోజు లేక శనివారం శ్రీవారి సుప్రభాతం ప్రసా రం చేస్తున్నారు. టి.వి.జయ, శంకర, శ్రీ శంకర, భక్తి, వాసంతి, భారత్ టూడే, శివసాయి చానల్స్‌లో రోజు లేక వారానికైనా శ్రీవారి సుప్రభాతం ప్రసారం చేస్తున్నారు. మీ ఎస్‌విబిసి వారు పై రాష్ట్ర చానల్ చూసి తెలుసుకుంటే మం చిది. మా ఆంధ్రుల దౌర్భాగ్యం ఇతర రాష్ట్ర టి.వి. చానల్‌లో సుప్రభాతం చూసి ఆనందిస్తున్నాం. మీ ఛానల్లో 50% పనికిరాని కార్యక్రమాలు (దైవము, భక్తిసంబంధము లేనివి) ప్రసారం చేస్తున్నారు. ఇక టి.టి.డి.వారు వేదాలను కాపాడండి, రక్షించండి, సహాయం చేయండి ప్రచారం చేస్తున్నారు.ఎస్‌విబిసిలో ఇదివరలో రోజు ఉ.5.30 గంట లకు వేద పఠనం ప్రసారం చేసేవారు. కాని మీరు అదికూడా ప్రసారం మానివేసి, కేవలం 5నిమిషాలు మాత్రమే ఉదయం, సాయంత్రం ప్రసారం చేస్తున్నారు. మీ నిర్ణయాలు మార్చుకోవాలని కోరుతున్నాను.
- వి.బాపిరాజు, సికిందరాబాద్

కాంగ్రెస్‌కు తీసిపోని భాజపా
కేంద్రంలో భాజపా అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అయినా అయోధ్య రామమందిరం ఊసేలేదు! కాంగ్రెస్ హయాంకంటే ఎక్కువగా దేశంలో మత మార్పిడులు, హిందూ ఆలయాలలో అన్యమత ప్రచారాలు జరిగిపోతున్నా మత మార్పిడి నిషేధ బిల్లు తేలేదు! మైనారిటీ ప్రార్థనా మందిరాల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండానే వారి పవిత్ర యాత్రలకు సబ్సిడీలు, హిందువుల పవిత్ర స్థలం కైలాస మానస సరోవర యాత్రకు సబ్సిడీ లేదు! ఇదెక్కడి న్యాయం? ఇవన్నీ చేస్తామని చెప్పిన బిజెపినే చేయకపోతే కుహనా లౌకికవాద కాంగ్రెస్ చేస్తుందా? లౌకికవాద ముసుగులో హిందువులకు కాంగ్రెస్ అన్యా యం చేస్తే హిందూత్వ ముసుగులోనే బిజెపి అన్యాయం చేస్తోంది! మొత్తంగా బిజెపి ఆంధ్రులను, హిందువులను దగాచేసి కాంగ్రెస్‌కి ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంది!
- చర్ల మల్లేశ్వరరావు, కాకరపర్రు

చేవలేని చట్టాలు
పశువులకన్నా హీనంగా, మానవత్వం మచ్చుకైనా కనపడని మానవ మృగాలను ఎంతమందిని శిక్షించినా వారి సంఖ్య తగ్గడం లేదు. ఇంటిలోని వారు బయటకు రాకుండా గొళ్ళెంవేసి పదకొండేళ్ళ బాలికను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసిన రాక్షసులకు మరణదండనే సరైన శిక్ష. ఆనాడు యజ్ఞాలు భంగం చేసిన రాక్షసులనెందరినో సంహరించాడు రాముడు. రామరాజ్యం కావాలని, తేవాలని తపించే నాయకులు రాముడు చేసిన పనినే చేయాలి. ఈ మృగాలను వేటాడి చంపకపోతే మృగాల మధ్య మనుషులు భయంభయంగా బ్రతకవలసి వస్తుం ది. ప్రభుత్వాలు తక్షణం స్పందించకపోతే తన చాతకాని తనాన్ని ఒప్పుకోవలసి వస్తుంది. అలాగే చట్టాలు కఠినం కాకపోతే నిందితులకవి చుట్టాలయిపోతాయి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

హోదా ఏది బాబూ?
ఘోరాతి ఘోరంగా విచక్షణా రహితంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు కాంగ్రెస్‌వారు, బి.జె.పి.వారు. విభజన సందర్భంగా ప్రసంగించిన వక్తలలో కొందరు ఈ బిల్లు చెల్లదు. కోర్టుకెక్కితామన్నామన్నారు. వెంకయ్యనాయుడుగారు ఆంధ్రకు ప్రత్యేక హోదా 5 ఏళ్ళుకాదు పదేళ్ళు అని చాలా బాగా సెలవిచ్చారు. ఇవి నీటిలో రాసిన మాటలయ్యాయి. ఇకపోతే బాబుగారు ఋణాల మాఫీలు, సబ్సిడీలు అంటున్నారు. ఇవి అన్నీ వారి పార్టీ కార్యకర్తలకే ప్రధానం అని చెప్పకనే చెబుతున్నారు. ఈ దుస్థితి పోవాలంటే భగవంతుడైనా శేషాంధ్రను కరుణించాలి లేక ఒక ఖచ్చితమైన న్యాయవాది కోర్టుకెక్కాలి. విభజనే అన్యా యంగా జరగడం ఆంధ్రులు చేసుకున్న పాపం. విభజ నకు ముందు హోదా ఇస్తామని చెప్పి పూర్తిగా విస్మరించడం అన్యాయం.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం