ఉత్తరాయణం

అసహనానికి గుర్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవాంజలిస్టుల మత అసహనానికి గుర్తుగా ఇటీవల కృష్ణాజిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన దళితవాడలో రామాలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సంతర్పణ జరిగింది. దీనికి దళితవాడకు చెందిన మతం మార్చుకొని క్రైస్తవులుగా మారిన వారిని ఫాస్టర్లు, సంతర్పణను బహిష్కరించాలని ఆదేశించారు. వారు దాన్ని తూ.చ.తప్పకుండా పాటించారు. ఇది క్రైస్తవంలోని పరమత అసహనానికి ప్రతీక.
-డా.టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

చేనేతకు ఉచిత విద్యుత్ అందించాలి
తమిళనాడు తరహాలో తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల ఇళ్లకు, కార్యశాలలకు (వర్క్‌షాప్) ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. కార్మికులకు చేనేత పరిశ్రమ మూడుపూటలా అన్నం పెట్టలేని పరిస్థితి దాపురించింది. దాంతో పలువురు పల్లె వదలి ఇల్లు దాటి సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. కూలీ నాలీ చేసుకొని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు తరహాలో చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్‌ను అందించాలి. తమిళనాడులో చేనేతకు 200 యూనిట్ల వరకు పవర్‌లూమ్స్‌కి 750 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కల్పిస్తున్నారు.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

అంబేద్కర్ జిల్లా ఏర్పాటుచేయండి
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్‌గారు రచించిన ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల గురించి వివరించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారు ప్రకటించననున్న జిల్లాల్లో ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్‌గారి పేరుపెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్ల గురించి వివరించాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. కనుక అదే స్ఫూర్తితో శ్రీ కెసిఆర్‌గారు నూతన జిల్లాకు అంబేద్కర్‌గారి పేరుపెట్టి తన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లో తన స్ఫూర్తిని నింపాలని విజ్ఞప్తి
- ఈదనూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ

బాల్య వివాహాలను అరికట్టాలి
ఎస్.ఎస్.సిలోనూ, ఇంటర్ వంటి పబ్లిక్ పరీక్షలలోనూ, వివిధ పోటీ పరీక్షలలోనూ బాలురకంటే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్న వార్తలు తరచూ టి.వి.లలో, పత్రికలలో చూస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనేక పాఠశాలల్లో ఏ తరగతిలో చూసినా చదువులో బాలికలే ముందంజ వేయడం గమనార్హం. కానీ ఉద్యోగాలవరకు వచ్చేసరికి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినాసరే పురుషులే ఎక్కువమంది ఉద్యోగాలు చేయడం గమనార్హం. దీనికి కారణాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరపడం, స్ర్తి విద్య పట్ల ప్రోత్సాహం లేకపోవడం. కొంతమంది బాల్య వివాహాలు చేయకున్నా వివాహార్హత వయసురాగానే పెళ్ళి చేస్తున్నారు. ఇంకా బాలురు అనుత్తీర్ణత సాధించినా తల్లిదండ్రులు ఇంకా పరీక్షలు రాయిస్తారు. అదే బాలికలయితే వెంటనే పెళ్ళిచేస్తారు. ఆనాడు కందుకూరి వీరేశలింగం మొదలు ఎంతోమంది సంఘ సంస్కర్తలు రంగప్రవేశం చేసినా ఆ తర్వాత ఈ స్ఫూర్తితో ఎంతోమంది సంస్కరణోద్యమాలు కొనసాగించినా ఈనాటికీ పూర్తిస్థాయిలో బాల్య వివాహాలు ఆగకపోవడం దురదృష్టకరం.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

పచ్చదనం ఎక్కడ?
గత ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన ఇ.ఎఫ్.ఆర్. సందర్భంగా అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నగర పాలక సంస్థ మొక్కలను నాటింది. పచ్చదనం అభివృద్ధి చేస్తామని గ్రీన్ విశాఖ, క్లీన్ విశాఖ అని ఏవేవో పేర్లు పెట్టి నాలుగు అడుగుల ఖాళీ జాగా కనబడితే చాలు మొక్కలు నాటి పారేశారు. అయితే మూణ్ణాల్ల ముచ్చట చందాన నీటి కొరత సాకుతో ఇ.ఎఫ్.ఆర్. తర్వాత వాటికి కనీసం నీళ్ళు పొయ్యడం మానెయ్యడం వలన సగానికి పైగా మొక్కలు ఎండిపోయాయి. గతంలో హుద్‌హుద్ తుఫాను తర్వాత కూడా ఇలాంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిని జి.వి.యం.సి. యొక్క నిర్లక్ష్యం ధోరణి వలన అవి ఎండిపోయాయి. ట్రీగార్డులు ఏర్పాటుచేయక పోవడంవలన పశువులు మొక్కలను యధేచ్ఛగా తినేస్తున్నాయి. చిత్తశుద్ధి లేని పథకాలవలన కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం