ఉత్తరాయణం

ప్రభుత్వం పునరాలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక కష్టాలతో మునుగుతూ-తేలుతూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థకి జంటనగరాల ఆర్టీసీ బస్సుల నిర్వహణ అప్పజెప్పడం పారిపాలనా పరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా భారం కాగలదు. ‘గ్రేటర్’ నిర్వహించినంత మాత్రాన లాభసాటి అయ్యే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న ఉదయంచకమానదు. చెత్త లారీలలోని డీజిల్ దొంగతనాలను, ఖజనాకు ఇతరత్రా కలుగుతున్న నష్టాన్ని నివారించుకోలేని ‘గ్రేటర్’ సిటీ బస్సులను అవినీతి రహితంగా నిర్వహించగలదా?
అసలు ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయ? ఉద్యో గులు, విద్యార్ధులు మున్నగువారికి రాయత పాసులను ఇస్తున్నందువల్ల. అసలు వారికి రాయతీ లివ్వాల్సిన అవసరం ఆర్టీసీకి లేదు. ఈ రాయతీల వల్ల సం వత్స రానికి ఆర్టీసీపై కొన్ని వందల కోట్ల భారం పడు తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉండగా, ‘ఎగ వేస్తూ’ ఉండటం ప్రధాన కారణం. పోనీ రోడ్డు ట్రాన్స్ పోర్టు లైసెన్సు ఫీజులనుంచి మినహాయంపు నిస్తుందా అంటే అదీ లేదు. ఇలా చేస్తే రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీకి కొన్ని వందలకోట్లు ఆదాయం తగ్గిపోతుంది. అందువల్ల ఆ శాఖ, ప్రభుత్వం సుముఖంగా లేవు.
మెట్రో రైలు రాబోతుండటం వల్ల ఎంతో కొంత మేర సిటీబస్సుల ఆదాయం తగ్గుతుంది. అంటే ‘గ్రేటర్’ నిర్వహిస్తే కొత్తగా కలిగే ఆదాయపు లోటుని కూడా భరించక తప్పదు. ధరలు, అమ్మకాలు అనేవి మార్కెట్ తీరుతెన్నులను బట్టి ఉంటాయ. కాబట్టి పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు టికెట్ ధరలను ఆర్టీసీ వారు పెంచుతూ ఉండటమే మంచిది. దీనికి కొన్ని రోజుల పాటు విపక్షాల వారు గగ్గోలు పెడతారు. కానీ తర్వాత వాస్తవ పరిస్థితితో రాజీ పడతారు. అయనా అర్థంపర్థం లేని వాటికి, తాగుడికి, ఎడాపెడా ఖర్చు చేసేవారు కూడా బస్సు, కరెంటు చార్జీలు పెంచితే గొడవ చేయడం ఏమిటో మరి!
గ్రేటర్ చేత ఆర్టీసీకి ఇప్పుడు నిధులు ఇప్పిస్తున్నట్టుగానే వీలువెంట ఎప్పటికప్పుడు పెంచుతూ ఇప్పిస్తుంటే గ్రేటర్‌కి పాలనా భారం, వ్యయం తగ్గుతాయ. పాసులకు సంబంధించిన వందలకోట్లని ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే ఆర్టీఏకి కట్టాల్సిన లైసెన్స్ ఫీజులను పూర్తిగా కాకపోయనా కొంత మేరకి మినహాయంపునిస్తే, లాభాలు లేకపోయనా నష్టాలు రాకుండా ఆర్టీసీ మనుగడ సాగగలదు.
-ఎన్. మధుసూదనరావు, హైదరాబాద్

విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం
నల్గొండ జిల్లాలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్లు శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు, ఎప్పుడు నేలకొరుగుతాయో తెలీని వైర్లతో కాలం గడుపుకొచ్చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికార్లు. భారీ వర్షాల మాట దేవుడెరుగు, చిన్న చినుకులకే విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. ఈమధ్యకాలంలో వర్షాలకు దాదాపుగా నలభై స్తంభాలు విరిగిపడిపోయనా ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. పట్టణాలకు, ప్రత్యేక ఫీడర్ లేకపోవడం వల్ల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అనేక పంట పొలాల్లో కర్రలతో స్తంభాలు ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుత్ సరఫరా ఇచ్చే క్రమంలో రాత్రి వేళల్లో అనేక మంది కరెంట్ షాక్‌కు గురవు తున్నారు. నెలయ్యేసరికి టంచనుగా విద్యుత్ బిల్లుల ను వసూలు చేస్తూ చెల్లింపు ఒక్క రోజు ఆలస్యమైనా ఫీజులు వూడబెరికే విద్యుత్ శాఖ అధికార్లు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం చర్యలు చేపట్టక పోవడం బాధాకరం.
-సి.హెచ్. సాయఋత్విక్, నల్గొండ

పెంచిన డి.ఎ.లను వెంటనే చెల్లించాలి
పెంచిన రెండు డీఎలను ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వలేదు. ఎందుకో అర్థం కాదు. ఆ రెండు డిఎలు ఒకేసారి ఇవ్వాలి. ప్రజా ప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం వేతనాలు పెంచుకుంటారు. కానీ ఉద్యోగులను పట్టించుకోరు. త్వరలోనే మరో డిఎ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విషయాన్ని అర్థం చేసుకొని రెండు డిఎలను విడుదల చేయాలి. పింఛనుపై ఆధారపడి జీవించే విశ్రాంతి ఉద్యోగులకు వెసులుబాటు కాగలదు.
- ఎం.సి. గుర్రప్ప, తాడిపత్రి

అంతంత వేతనాలా?
ప్రజలకు సేవచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు నెలకు లక్షల కొలది వేతనాలు తీసుకుంటూ వైభోగం అనుభవిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సుఖవంతమైన జీవితాల్ని గడుపతున్న వారికే ఇంతటి జీతాలిస్తే, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ప్రజల సంగతి ఏమిటి? రాష్ట్రంలో ఒక ప్రక్క కరువు విలయతాండవం చేస్తుంగా, మరొక ప్రక్క పశువులకు గడ్డి లేక తెగనమ్ముకుని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూలీలు వలస పోతున్నారు. చేతి వృత్తులు దెబ్బతిన్నా యి. సామాన్య ప్రజలు, శ్రామికులు పనులు లభించక అ ర్ధాకలితో అలమటిస్తున్నారు. అష్టకష్టాలతో ప్రజలు ఉం టే, రాజభోగం అనుభవిస్తున్న ప్రజానాయకులకు లక్షల కొలదీ జీతాలా? ఒక్కసారి ఆలోచించండి??
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

అత్యాశతో ప్రమాదాలు
హైవేలపైనా మామూలు రోడ్లపైనా ప్రైవేట్ వాహనదారులు అత్యాశతో పరిమితికి మించిన జనాన్ని ఎక్కించుకొని వెళ్తున్నారు. అసలే ఇది ప్రమాద కారణమైతే ఇంత మందిని ఎక్కించుకొని మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాద హేతువులవుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి ఇలాంటి అత్యాశాపరులకు బుద్ధిచెప్పాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్