ఉత్తరాయణం

స్పష్టత లోపించిన గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌వారు ప్రసారం చేస్తున్నారు. అయితే ఆ పాటలు వారు (పాడేవారు) తేటగా పాడలేకపోతున్నారనిపిస్తున్నది. ఎందుకంటే ఆ గాయనీ గాయకులంతా, వారి అభ్యసనమంతా సినీ గీతాల ఆలాపనతోనే జరిగింది. అందువల్లనే స్పష్టత లోపించింది. లేదా వారికి ఈ సాహిత్య పదాలు (600 సం.నాటివి కదా) అపరిచితాలు అయి వుండవచ్చు. సినీ రాగాల తోటల్లో స్వేచ్ఛగా విహరించినవారు వారు. అంతేకాకుండా సంగీత వాద్యాల హోరు వల్ల కూడా గీతాలు ‘అ’నర్ధంగా ఉన్నాయి. పూర్వం పాడిన కీర్తనలను వింటే ఎంతో తేటగా- తేనెటీగల నాదంలా విస్పష్టంగా ఉండేవి. (ఉ: సర్వశ్రీ బాలకృష్ణప్రసాద్, పారుపల్లి రంగనాథ్, నాగేశ్వరనాయుడు, శోభారాజు, నిత్యసంతోషిణి). అయితే వముగింపు కార్యక్రమంలో బాలగాయనీ గాయకుల బృందాలు పాడుతున్నాయి. వారు పాడుతున్న గీతాలు- కీర్తనలు ఎంతో స్పష్టతగలిగి- శాస్ర్తియ రత్నాలు పలుకుతున్నాయి. ఎందుకంటే వారు శాస్ర్తియ సంగీత గాన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నారు. అందువల్ల అన్నమయ్య గీతాలను మరింత భావగర్భితంగా స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా పాడించాలని మనవి.
- ఏ.రోశయ్య, పాల్వంచ

హర్యానా ఆదర్శం
దేశంలో గోవధ నిషేధాన్ని చిత్తశుద్ధిగా అమలుచేస్తున్న అతి కొద్ది రాష్ట్రాలలో హర్యానా ప్రధమ స్థానంలో వుంది. అందుకు నిర్దేశించిన గోవంశ సంరక్షణ, గోసంకీర్తన చట్టాలు చిత్తశుద్ధితో కఠినంగా అమలుచేయడం జరుగుతోంది. ఆవులను కాపాడేందుకు పోలీస్‌శాఖలో ప్రత్యేక విభాగం తాజాగా ఏర్పాటుచేయడం శుభపరిణామం. అంతేకాకుండా గోవధ నిమిత్తం కబేళాలకు తరలించే వారికి, గోవధకు పాల్పడే వారికి శిక్షలు మరింత కఠినతరం చేసేందుకు గోవధ నిరోధక చట్టం 16కు రూపకల్పన చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గోవధ నిషేధం అమలుపై గల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వున్న మూడు లక్షల పైచిలుకు గోసంతతి సంరక్షణార్థం ప్రత్యేక గోసేవా సెస్సును ఈ సంవత్సరం నుండి అన్ని సేవలపై అదనంగా విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సముచితంగా వుంది. హిందూ ధర్మానుసారం గోమాతకు వున్న ప్రాముఖ్యం బహు విశిష్టమైనది. గోసంతతి పరిరక్షణలో హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా కర్తవ్యోన్ముఖులు కావాలి!
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ

ఇబ్బందులు సృష్టించొద్దు
విజయవాడ నగరంలోని ఏలూరురోడ్డు నిరంతరం రద్దీగా వుండే ప్రదేశంలో లోగడ డివైడర్ వుండేది. సైకిల్‌తో సహా దాటటానికి వీలుగా వుండేది. దానిని పడగొట్టి రెండు చిన్న గోడల మాదిరి కట్టారు. ఎందుకంటే మొక్క లు నాటటానికట. మొక్కలకు రోజూ నీళ్ళు పోస్తారా తర్వాత ఒక చెంప నీడ నిచ్చే చెట్లని నరికేస్తున్నారు. ఎవరి ఆలోచనో ఇది. ఒక పని భారీ ఎత్తున తలపెట్టే ముందు ప్రజలనుండి సూచనలు, సలహాలు స్వీకరించాలి. మనం నియంతృత్వ పాలనలో లేము కదా. ఇప్పుడు చూడండి.. అవతల పక్క దుకాణాలకు వెళ్ళాలంటే కిలోమీటరు చుట్టూ తిరిగి వెళ్ళాలి. అటు వైపు వున్నస్కూళ్ళు, కోచింగ్ సెంటర్‌కి పిల్లలు బ్యాగులు మోసుకుంటూ నడవాల్సిందే.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

తాగునీరా? మురికినీరా?
గుంటూరు నగరంలో కార్పొరేషన్ సరఫరాచేసే నీరు దుర్వాసన, పురుగులు, మురుగునీరు మాదిరిగా నల్లగా వుంటోంది. ఈ నీరు సేవించి నిత్యం వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కాచి చల్లార్చినా లేక నీటి శుద్ధియంత్రాలు వాడినా పెద్దగా ప్రయోజనం లేని అధమస్థాయిలో త్రాగునీరు సరఫరాకావడం నగరవాసులు చేసుకున్న దురదృష్టం. దీనికితోడు మరమ్మత్తుల పేరుతో వారానికి రెండు రోజులు సరఫరాచేయడం లేదు. నీటిసరఫరా వేళలు కూడా అస్తవ్యస్తంగా, అసౌకర్యంగా వుంటున్నాయి. రోడ్డుప్రక్కన వుండే టిఫిన్ బండ్లు, సాధారణ హోటళ్లలో ఆహార పదార్థాల తయారీకి, త్రాగడానికి ఈ కలుషిత నీటినే వాడుతుండడంవలన ప్రజలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. నీటి కాలుష్య నివారణకు ఫిల్టరేషన్, క్లోరినేషన్ వంటి పద్ధతులకు నగర పాలక సంస్థ మంగళం పాడేసింది. నీటి విడుదలకు ముందు అనేక పరీక్షలు చేయాల్సి వస్తుండగా అధికారులు ఇటువంటి అపరిశుభ్ర నీటిని ఎలా విడుదల చేస్తున్నారో అర్ధంకాని విషయం.
- ఎం.కనకదుర్గ, తెనాలి

విద్యావిధానం మారాలి
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు పూర్తవుతున్నా మనదైన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించుకోలేకపోయా ము. జాతిని నిర్వీర్యం చేసే, మెకాలే ఆంగ్ల మానసపుత్రులుగా మలిచే విద్యే కొనసాగడం దురదృష్టకరం. వ్యక్తులను శీలవంతునిగా మలిచే సాధనం విద్య. దేశ వైభవ చరిత్ర, ప్రాచీన శాస్త్ర విజ్ఞానం, మహాపురుషుల జీవితాలు, దేశభక్తిని పెంపొందించే అంశాలు విద్యావిధానంలో ప్రవేశపెట్టాలి. స్వాభిమానాన్ని జాగృతం చేసే సంఘటనలు పాఠ్యపుస్తకాల్లో రావాలి. నైతికతను, సామాజిక స్పృహను పెంపొందింపజేసే పాఠ్యప్రణాళికలుండాలి. సమూల మార్పులు చేపడితే తప్ప దేశ యువతను కాపాడుకోలేము.
- సామల కిరణ్, జూలపల్లి