ఉత్తరాయణం

రైళ్లలో హిజ్రాల తీరు భయానకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైళ్లలో హిజ్రాలు విపరీతంగా, విచ్చలవిడిగా, రైళ్లలో భిక్షాటన చేస్తూ ప్రయాణికులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు యివ్వని వారిని అవహేళన చేయటం, లేదా తిట్టడం, వెకిలి చేష్టలతో అపహాస్యానికి దిగటంవల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు కాకినాడ ప్రాం తంలో బిహారు ప్రయాణికులను బ్లేడుతో దాడిచేసి గాయపరిచినట్లు దినపత్రికల్లో వార్త వచ్చింది. హిజ్రాల బారినుండి ప్రయాణికులకు రక్షణ కావాలి. రైల్వే పోలీసుల ఉదాసీన వైఖరివల్ల, చూచి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ప్ర యాణికులకు మనశ్శాంతి కలగాలంటే హిజ్రాలను రైళ్లలో అడుక్కోనీయకుండా నియంత్రించాలి. ప్రయాణికులు ప్ర శాంతంగా ప్రయాణం సాగించే పరిస్థితులు కేంద్ర ప్రభు త్వం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. క్షేమం గా సుఖవంతమైన ప్రయాణం చేద్దామని టిక్కెట్ కొని ప్రయాణికులకు ఈ హిజ్రాల బాధ విపరీతంగా ఉంది.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

అటకెక్కిన నదుల అనుసంధానం
పూర్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా మాంటెంగ్ అహ్లూవాలియా పనిచేసారు. కానీ ఆయన తన అనుభవంతో నదుల అనుసంధానం చేయకూడదని చెబుతూ వాతావరణంలో విపరీత మార్పులొచ్చి వినాశనం సంభవిస్తుందని వాక్రుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నదుల అనుసంధానం జరగకుండానే వినాశనం సంభవిస్తోంది. సు ప్రీం కోర్టు ఆదేశాల్ని, సలహాల్ని బేఖాతరు చేసి దేశంలో నదుల అనుసంధానాన్ని దేశంలో అటకెక్కించారు. ఇక 14వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్ ఏ విధంగా ప్రత్యేక హోదా వద్దంటున్నాయో బిజెపి ప్రస్ఫుటం చేయలేదు. తన పార్టీ కాని రాష్ట్రాలను అధికారం నుంచి దింపడంలో కాంగ్రెస్‌కు ఏం తక్కువ తినని బిజెపి మీనమేషాలు లెక్కపెట్టడంలో అందెవేసిన చేయిగానే కనపడడంలో ఆశ్చర్యం లేదు. బిజెపి అంత నిష్కళంకమైనదైతే 14వ ఆర్థిక సం ఘం నివేదికను బట్టబయలుచేయాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపులు
కర్ణాటకలో ఈమధ్య ప్రభుత్వ ఉద్యోగులు పైఅధికారుల, రాజకీయ నాయకుల వేధింపులకు గురికావడం బాధాకరం! ఒక పోలీసు డిప్యూటీ సూపరిండెంట్ గణపతి ఆత్మహత్య ఇందుకు ఉదాహరణ. మరొక ఉన్నత సా థయి అధికారిణి కూడా వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. దైవానుగ్రహంవలన ఆమెను రక్షించారు. తమిళనాడులో ఒక పోలీసు అధికారిణి ఒక హత్య కేసువిచారిస్తూండగా పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహ త్య చేసుకొన్నది. కర్ణాటకలో గతంలో హోంశాఖ నిర్వహించిన మంత్రిగారిపై కోర్టు కేసు నమోదు చెయ్యాలని ఆదేశించిన తర్వాతే ఆయన రాజీనామా చేశారు.
- కె.సుబ్రహ్మణ్యం, చెన్నయ్

హెల్మెట్‌తో చిరు వ్యాపారులకు దెబ్బ
హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని నియమ నిబంధనలను విధించటంతో ముఖ్యంగా ‘టోపీ’ (హ్యాట్) వ్యాపారులకు ఎక్కువ దెబ్బతగిలే ప్రమాదం వుంది. ఎండకు, వా నకు అన్నివేళలా హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో వారి వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. వారి జీవనానికి ఆటంకం ఏర్పడుతున్నది. ప్రత్యామ్నాయ మార్గాలు వారికి కల్పించాలి. జుట్టుకు రక్షణ కల్పించే షాం పు, సబ్బులకు గిరాకీ పెరగనుంది. హెల్మెట్ ధరించడంవల్ల చెమటవల్ల జుట్టు రక్షణార్థం ఓషధ పరమైన షాంపుల వాడకం పెరగనుందని విశే్లషకుల వాదన. విగ్గులు ధరించే వారి పరిస్థితి చెప్పనలవి కాదు. హెల్మెట్‌లవల్ల లాభాలతో పాటు స్వల్ప నష్టాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఆస్త మా వారికి ఇబ్బంది కలుగవచ్చు. వీరి ఆరోగ్యపరమైన సూచనలు అవసరం.
- అయినం రఘురామారావు, ఖమ్మం

విశ్వాసమే అర్హత
పివికి పది భాషలు రావడంవల్లనే ప్రధాని అయ్యారనడం అపోహ మాత్రమే. నెహ్రూ కుటుంబం ఆవల వ్యక్తి నోరులేని వాడు, అతి నమ్మకస్తుడు అయితేనే ప్రధాని కాగలడు. పివికి ఆ లక్షణాలున్నాయని భావించిన సోనియా ఆయన్ని ఎంపికచేసింది. అయితే ఆయన సోనియా నమ్మ కం కోల్పోయి అవమానించబడ్డాడు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తే తెలుగు చదువుతారనడమూ అపోహే. అలాం టి రిజర్వేషన్ రాజ్యంగ విరుద్ధం అవుతుంది.
- చైతన్య, వాకలపూడి