ఉత్తరాయణం

సందిగ్ధంలో బాలల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో బాల కర్మికుల వ్యవస్థ లేకుండా చేస్తామని ప్రభుత్వాలు బీరాలు పలుకుతున్నాయి. కాని ఆచరణలో దారుణంగా విఫలవౌతున్నాయని అంతర్జాతీయ బాలల ప్రాథమిక హక్కుల పరిరక్షణ సంఘం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. గత మూడేళ్లలో స్కూలు డ్రాపవుట్ల సంఖ్య 19 శాతం పెరిగింది. గ్రామీణ బాలల పరిస్థితి మ రింత దారుణంగా వుంటోంది. స్కూళ్లు మానేసి గ్యారేజీలు, క్యాంటీన్లు, ఫ్యాక్టరీలలో పనిచేయడం, బాలబిచ్చగాళ్లుగా మారడం,పనిపాటా లేని వారితో కలిసి సిగరెట్లు త్రాగడం, పేకాటలు ఆడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పల్లెల్లో 15 సంవత్సరాల వయస్సు దాటకుండా జవహర్ రోజ్‌గార్ యోజన పథకాల క్రింద దొంగ ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషను చేయించుకొని పనులు చేస్తు న్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జువెనైల్ యాక్ట్ క్రింద వివిధ నేరాలకు పాల్పడి పట్టుబడి జువైనల్ హోం లకు తరలింపబడుతున్న వారి సంఖ్య కూడా గణనీయం గా పెరుగుతోంది. రేప్‌లు, యాసిడ్లు జల్లడం,దొంగతనా లు, హత్యలకు పాల్పడే బాల నేరస్తుల సంఖ్య గత అయిదేళ్లలో 10 శాతం పెరగడం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి

వేద విద్యను పాఠ్యాంశం చేయాలి
వేద పండితులు శిష్యులను చేర్చుకుని వారికి ఆశ్రమాలలో నివాసం, ఆహారం, బట్టలు ఇచ్చి వేదశాస్త్రాలను బోధిస్తూ వుండే వాటిని గురుకులాలు అనేవారు. విద్యను క్షుణ్ణంగా నేర్చుకుని సంపాదనపరులైన తరువాత గురుదక్షిణలను సమర్పించుకునేవారు. కులాలు, మతాలు, వర్గాలుగా ప్రభుత్వమే నడిపిస్తున్న ‘గురుకులాలు’ కుల మతవర్గ తత్వాలకు నిలయంగా మారుతూ లేత మనసులను కలుషితం చేస్తున్నాయి. ముస్లింలు వారి మతబోధన కోస మే నడుపుకునేవి మదరసాలు. ఇక ఇప్పుడు ప్రభుత్వమే గురుకులాలు పేరుతో మత విద్యను కూడా బోధింప పూనుకుంది. వేద విద్యకోసం అన్ని కులాలు, వర్గాలు, మతాల వారికి కలిపి రాష్టమ్రంతా గురుకులాలను ప్రభు త్వం నడిపిస్తూంటే చాలా మంచి జరుగగలదు. ఇలా సాధ్యంకాదనుకుంటే అన్ని పాఠశాలల పాఠ్యప్రణాళికలలో వేద విద్యని ఒక అంశంగా చేర్చి బోధించాలి.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

జాతీయ భాషగా సంస్కృతం
ఎవరో ఆదిమవాసులు ఈ దేశాన్ని యేలారని తరువాత ద్రావిడులు, తదుపరి ఆర్యులు దండెత్తినారని అభూతకల్పనలతో మన చరిత్ర వక్రీకరించడం అమానుషం. హిం దువులకు ఆలంబనగావున్న భాష, దైవ భాషగా నెన్నదగినది సంస్కృతం. తొమ్మిది భాషలున్న రష్యాలో జాతీయ భాషగా వారికి అవరోధాలు లేకపోయింది. మన దేశంలోనే ఆ పరిస్థితి కొనసాగుతోంది. నిజాన్ని అంగీకరించి సంస్కృతాన్ని ఇంగ్లీషు స్థానే భాషగా చేయడం మంచి చర్య. సంస్కృత భాషకు ప్రాముఖ్యం కల్పిస్తే ఆంగ్లభాష దశలవారీగా తొలగిపోతుంది. భవిష్యత్తులో జాతీయ భాషా వివాదం తొలగే అవకాశం వస్తుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

అవినీతిని అరికట్టలేరా?
గత కొద్ది దశాబ్దాలుగా దేశంలో అవినీతి పెరిగిపోయింది. అవినీతి సొమ్ము ఏమయిపోతున్నది? అవినీతితో సంపాదించిన సొమ్మును ఏంచేస్తున్నారు? ఎక్కడ ఖర్చుపెడుతున్నారు అన్న విషయం తేలటం లేదు. దేశంలో కుం భకోణాలు అధికమయ్యాయి. విదేశీ బ్యాంకుల్లో నిల్వవున్న నల్లధనాన్ని తిరిగి రప్పించడంలో చొరవ చూప టం లేదు. ఈ కుంభకోణాల్లో ఎక్కువమంది రాజకీయ నేతలు ఉండటం ఆశ్చర్యం. వీరు ప్రజలకు న్యాయం చేయడానికి రాజకీయాల్లోకి వస్తారా లేక ప్రజల డబ్బును దోచుకొని స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి వస్తారా? ప్రజలు వీరి మాటలను నమ్మి ఎన్నికల్లో ఎన్నుకుంటే వీరు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరటంవంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతుండటం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య మానవుడు జీవించడం దుర్లభంగా మారింది. ఇటువంటి సమస్యలపై దృష్టిసారించకుండా మొసలి కన్నీరు కార్చడం ప్రజలు గమనిస్తున్నారు. బ్రతుకు భద్రతపై ముందుగా దృష్టి సారించడం మంచిది. నాయకులు ప్రజలకు సేవచేయడానికి మాత్రమే తమ పదవిని ఉపయోగించుకోవాలి. చాలామంది నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఎంత డబ్బు ఖర్చుపెడితే, ఎన్నికల తర్వాత అంతకు పదింతలు సంపాదించుకోవాలని ఆరాటం పెరిగింది. అంతేకాని తమను ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారనేది వీరికి పట్టడంలేదు. స్వీయ లాభంకోసమే తపిస్తున్నారు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు