ఉత్తరాయణం

ప్రభుత్వ బడుల్లో చదివేవారికే ఉపకారవేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తూ భోజనం పెడుతున్నది. పాఠ్యపుస్తకాలు ఇ స్తోంది. ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వపరమైనవే వద్దని వేల రూపాయల డొనేషన్లు కట్టి, ప్రతి ఏటా వేలాది రూపాయల వార్షిక ఫీజులు ఒకేసారి చెల్లించడానికి వెనుకాడని పేద, మధ్యతరగతి వర్గాల వారికి, ప్రైవేటును ఆశ్రయించే వారికి ప్రభుత్వపరంగా ఉపకార వే తనాలు ఎందుకు ఇవ్వాలి? ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఎందుకు ఇవ్వాలి. ఇవ్వకూడదు. వారు ఎస్‌సి, ఎస్‌టి, బిసి లు ఎవరైనాసరే ప్రభుత్వ బడులలో చదివేవారికి మాత్రమే వాటిని వర్తింపచేయాలని ప్రభుత్వానికి మనవి.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్

ఫోన్‌కాల్‌తో క్యాబ్‌లు రావాలి
గతంలో ఫోన్‌కాల్ చేస్తే క్యాబ్‌లు ఇంటికి వచ్చేవి. ఇప్పు డు ఒలా, ఉబర్ క్యాబ్‌లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తేనే కానీ రా వటం లేదు. అందరకు స్మార్ట్ ఫోన్లుండవు. ఉన్నా చాలామందికి బుక్‌చేయడం రాదు. స్మార్ట్ఫోను ఉపయోగం తెలియని వృద్ధులకు మరీ ఇబ్బందిగా వుంటోంది. డ్రైవరు పేరు, ఫోన్ నెంబరు బుక్ చేసినవారి మొబైల్ ఫోనుకు పంపితే చాలు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

స్ర్తీలను గౌరవించాలి
ఏ వూరు, పట్టణాలు చూసినా ఏముంది గర్వకారణం. అర్ధరాత్రి స్ర్తి ఒంటరిగా ఎప్పుడు సంచరిస్తుందో అప్పుడే మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్ముడు చెప్పాడు. కానీ అర్ధరాత్రికాదు కదా రోజు మొత్తంమీద 24 గంటలూ స్ర్తి ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. భర్తతో జంటగా లేక ఒంటరిగా సినిమాకు మోటార్ సైకిలుమీద వెళితే రిటర్న్‌జర్నీలో గ్రహపాటు బాగా లేకపోతే భర్తను బంధించి ఆమెను అవమానం చేసి వాళ్ళ బండిమీద పారిపోయే ఘనాపాఠీలు ఉన్న లోకంలో ఏ స్ర్తికి తన శరీరం మీద హక్కులేకపోవడం మన దేశానికి పట్టిన గ్రహచారం. ఎందెందు వెదకిచూచినా అందందే స్ర్తికి అవమానం పొంచి వుండడం మన దేశ దౌర్భాగ్యమే. ప్రతి స్ర్తికి తన శరీరం మీద సంపూర్ణ హక్కు ఉంది. స్వాతంత్రం ఉంది. ఇది గుర్తెరగక స్ర్తికి అడుగడుగునా అవమానాలు ఎదురు కాకూడదంటే సమాజంలో మార్పురావాలి. స్ర్తిని గౌరవించడానికి సమాజం కంకణం కట్టుకోవాలి. అంతా ఆమెకు అండగా నిలవాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

గోసంరక్షణపై నిర్లక్ష్యం
రాజస్థాన్ జైపూర్‌లో గోరక్షణశాల వున్నది. కాని వాటి సంరక్షణ పట్టించుకోకపోవడంవల్ల అవి ప్లాస్టిక్ కాగితాలు వగైరా తిని మృత్యువాత పడుతున్నాయి. అధిక సంఖ్యలో అవి చనిపోతున్నాయి. వాటి సంరక్షణ చూస్తున్న కాం ట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచకుండా ఉన్నందున విధిలేక వాళ్ళు సమ్మెకు దిగారు. ఆ సమయంలో వాటి ఆలనా పాలనా చూసేవారు లేక అక్కడ అవి విసర్జించిన పేడ మూత్రం అలాగే ఉండిపోతున్నాయ. గోవులకు ఆహారం కూడా కరువే. దీని విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పత్రికలు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దుకుంటే అంత మం చిది. వసుంధర రాష్ట్ర ప్రభుత్వంపై ఇది తీరని మచ్చ.
- కె.నారాయణ, నంద్యాల

తెలుగు రచయితలకు ప్రోత్సాహం కరవు
కనీసం వంద కవితలు రాసిన తెలుగు రచయితలకు పుస్తక ప్రచురణకు ఆర్థిక సాయం కల్పిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ నెరవేరలేదు. రెండేళ్లు గడిచినా ఈ హామీ నెరవేరకపోవడం అత్యంత విచారకరం. దీంతో రచయితలు తాము రాసిన పుస్తకాలను తామే ముద్రించుకోవలసిన దయనీయ స్థితి కొనసాగుతోంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గతంలో ఈ 5వేల మేరకు పుస్తక ప్రచురణకు లేశమాత్రంగా నైనా ఆర్థిక సాయం అందించేది. అయితే నిధుల కొరతతో ఆ విశ్వవిద్యాల యం ఆ సాయం కూడా అందించలేని పరిస్థితిలో ఉంది. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుస్తక రచయితలను ప్రో త్సహించే విధంగా చర్యలు చేపట్టాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

తీరు మారాలి
ఉపాధ్యాయ దినోత్సవం రాబోతున్నది. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, అవార్డులు ప్రదానం చేయడం, వారిని సన్మానించడం ఏటా జరుగుతున్నది. అయితే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించడంలో వారి పనితీరు, నైతిక ప్రవర్తన, విద్యార్థులతో ఆత్మీయ సంబంధం, విద్యార్థులను నైతికంగా తీర్చిదిద్దడం, అంకితభావం, సమయపాలన తదితర ఉత్తమ లక్షణాల ఆధారంగా గుర్తించాలి. ఎలాంటి పైరవీలకు తావివ్వకూడదు. నేను ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి అంటూ దరఖాస్తు చేసుకునే విధానంవల్ల నిజమైన ఉత్తమ ఉపాధ్యాయులు చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. అటువంటి వారిని గుర్తించినప్పుడే ఉపాధ్యాయ దినోత్సవానికి సార్థకత.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్