ఉత్తరాయణం

రేషనలైజేషన్‌తో తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లు విద్యారంగం లో చేపడుతున్న మార్పులు సరైన పద్ధతిలో లేకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలల్లో బడుగు, పేద విద్యార్థులకు విద్య గగనకుసుమం అవుతోంది. ముఖ్య కారణం విద్యారంగంలో ప్రస్తుతం వున్న మూడంచెల వ్యవస్థను రెండంచెల వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం కసరత్తు చేయడమే. ఇది అమలుచేస్తే అన్ని జిల్లాల్లోని వందలాది పాఠశాలలు సమీపంలోని పాఠశాలల్లో విలీనమవుతాయ. దీనివల్ల గ్రామాల్లోని ఆడ పిల్లలు చదువుకు దూరం అవుతారని జ నాలు గగ్గోలు పెడుతున్నారు. నూతన విధానం రేషనలైజేషన్‌వల్ల అనేక పాఠశాలలు ఎత్తివేయవలసి వస్తుంది. గత విద్యా సంవత్సరంలో ఒక జిల్లాలో విద్యార్థులు లేరని 83 పాఠశాలలన్ని మూసివేశారు. తద్వారా టీచర్ల కౌన్సిలింగ్‌లో ఆ పోస్టులు ఖాళీగా చూపించడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగిస్తే అన్ని జిల్లాల్లో వేలాది పాఠశాలలకు తాళాలు వేయాల్సి వస్తుంది. టీచర్ల బదిలీలు తప్పనిసరి. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి విద్యావ్యవస్థను క్షాళన చేసి క్రొత్త పుంతల్లోకి తీసుకువెళ్ళాలనే యోచిస్తోంది. వేసవి సెలవుల్లో బడి విద్యార్థులకు పుష్టికరమైన ఆహారం ఇమ్మని టీచర్లను ఆదేశించింది. అయనప్పటికీ రేషనలైజేషన్‌పై పునర్విమర్శ చేసి, సరైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి.
- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి (బందరు)

తికమక పెడుతున్న ప్రయోగాలు
హత్య అనేదే దారుణమైనది. దారుణంగా హత్య చేశా రు అన్న వాక్యాలు పత్రికల్లో కనిపిస్తుంటాయి. హత్యకి, దారుణ హత్యకి తేడా ఏమిటి? కత్తితో పొడిచి, కర్రతో కొట్టి, తుపాకీతో కాల్చి చంపటం వంటివి అయితే ‘హత్య’ అని, ‘్భయంకరంగా హింసలు చిత్రహింసలు’ పెట్టి చంపితే అది ‘దారుణ హత్య’ అని అనుకోవచ్చునేమో మరి! కాని కర్రతో కొట్టడం వంటి వాటితో చంపినా దారుణహత్య అన్న ప్రయోగమే చేస్తున్నారు. ఇంకా ‘మరణం- దుర్మరణం, మానభంగం- దారుణ మానభంగం వంటి అనేక పద ప్రయోగాలు సాధారణ పాఠకులను తికమక పెడుతున్నాయ.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

దెబ్బతింటున్న భాష
ఒకప్పటి నలంద, తక్షశిల, విక్రమోర్వశీల విశ్వవిద్యాలయాలకేం ప్రచారం జరిగిందని దేశ విదేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించారు? ఆ కోవలోనిదే కాశీ హిందూ విశ్వవిద్యాలయం. వాటిని మహారాజులు పోషించారు. ఈనాటి భవనాలు ఆనాడు లేవు. కేవలం చెట్ల క్రిందే బోధన జరిగింది. ఆనాటి విద్యావైభవం ఈనాడు లేదు గాని, కేవలం పేరు మిగిలిందంతే. ఈనాడు చిన్న విద్యాసంస్థను ప్రారంభించి, అద్భుత పదజాలంతో ఊరు, వాడ ప్రచారం మోతెక్కించేస్తున్నారు. దానికి కానె్వంట్ అని పేరు. ఆనాడు గురుకులాలు. వినడమే గాని ఎప్పుడు చూ డలేదు. దరిమిలా పాఠశాలల పేరు విన్నాం. గతంలో ఉన్న పాఠశాలల పేర్లుపోయి కాలేజీలు, హైస్కూళ్ళు, కానె్వంట్లు పేర్లు వింటున్నాం. ఇప్పుడు కొత్తగా స్పోకెన్ ఇంగ్లీష్ అని వింటున్నాం. దాంట్లో కర్తకర్మ క్రియలుండవు. పూర్వం గ్రాంథికం, తరువాత వ్యావహారిక భాష వుం డేవి. ఇప్పుడు గ్రాంథికం పోయింది. కేవలం వ్యావహారిక భాష మాత్రమే మిగిలింది. మరి ఆనాటి మహామహా భాషా వాక్యాలు ఇప్పుడు వస్తాయా! అనుమానమే. మజ్జి గ పల్చనైనట్లు భాష కూడా పల్చబడిపోయింది.
- కె.వి.రమణమూర్తి, కాకినాడ

ఒంటెద్దు పోకడలు
ఒంటెద్దుపోకడలతో ఇష్టానుసారంగా కెసిఆర్ ప్రభు త్వం కొన్ని విషయాల్లో వ్యవహరిస్తోంది. కొన్ని సంక్షేమ పథకాల ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనవలసి వస్తోం ది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచటం, బస్సు ఛార్జీలు ఇతర పన్నుల రూపేణా పెంచి ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తాయి.
- అయినం రఘురామారావు, ఖమ్మం