ఉత్తరాయణం

అద్భుతాలు హిందూ సన్యాసి చేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మదర్’ని సెయింట్‌గా ప్రకటించడానికి రెండు అద్భుతాలు అవసరం. ఆ అద్భుతాలేమిటో పత్రికల్లో వచ్చాయి. మాకూ ఒక ఆలోచన వచ్చింది. ఆవిధమైన అద్భుతాలు ఏ హిందూ సన్యాసి అయినా ప్రదర్శిస్తే మన సోదర వామపక్ష మేధావులు, హేతువాద కార్యశూరులూ ఎంత ఎద్దేవా చేసేవారో? ఇంక డాక్టర్లెందుకు? ఆస్పత్రులు మూసేసి ఆశ్రమాలు ప్రారంభించండి అంటూ ఎంత హేళన చేసేవారో. చానళ్లలో నిరంతరాయంగా ఎన్ని వెటకార చర్చలు జరిగేవో. కాని ‘మదర్’ అదృష్టం. ఇప్పుడు మాత్రం మన సోదరుల నోళ్లు మూతపడ్డాయి. హేతువాదులు పెదవి విప్పితే ఒట్టు! చానల్స్ కిక్కురుమనలేదు.
- జ్ఞానబుద్ధ, సిద్దార్థనగర్, తూ.గో.జిల్లా

పాకిస్తాన్‌ను ఏకాకిస్తాన్ చేయాలి
కశ్మీరు సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పద్ధెనిమిది మంది భారత జవానులు అమరులవడం అత్యంత బాధాకరం. ఇందులో పాకిస్తాన్ హస్తం ఉందనడం నిర్వివాదాంశం. ప్రపంచ దేశాలనుండి ఆ దేశ నిర్వాకాల్ని బహిరంగ పరచడంలో భారత్ శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. పైగా భారత్ పట్ల ఇతర దేశాల గౌరవం పెరుగుతున్న నేపథ్యంలో కన్ను కుట్టిన పొరుగుదేశం నిస్పృహతో ఈ రకమైన హేయ చర్యలకు తెగబడుతోంది. వీలయినంత తక్కువ శ్రమతో భారత్‌కి వీలయినంత ఎక్కువ నష్టం, మానసిక వేదన కల్పించడమే పాక్ ప్రధాన లక్ష్యం. తద్వారా భారత్‌కి తలనొప్పులు తెప్పించాలన్న చావుతెలివి, అందుకు తీవ్రవాదుల్ని ఉసిగొల్పడమే దానికి తెలిసిన విద్య. పుట్టగొడుగుల మాదిరిగా తీవ్రవాద శిబిరాలను నిర్వహిస్తూ, మనదేశానికి ఎగుమతి చేస్తున్న పాక్ పైశాచికత్వానికి అడ్డుకట్ట పడాల్సిందే. అందుకు ముందుగా చెయ్యాల్సింది ఆ దేశాన్ని ఇతర దేశాలముం దు దోషిగా నిలబెట్టడం. దౌత్యపరంగా ఏకాకిని చెయ్య డం. దావూద్ తరహా మాఫియా శక్తులకు ఆసరా కల్పించడం. ముంబై పఠాన్‌కోట్ దాడుల్లో ప్రత్యక్ష పాత్రకి స్పష్టమైన ఆధారాలుండడం ద్వారా పాక్ నగ్నస్వరూపం బట్టబయలైంది. అయినా ఆశించిన స్థాయిలో అగ్రదేశాల మద్దతు భారత్‌కు లభించడంలేదు. ఆ దిశగా దేశం కృషి చెయ్యాలి. ఎంతో సున్నితమైన సైనిక స్థావరాలపై దాడులు అలవోకగా జరగడమంటే అది వెంటనే దిద్దుకోవాల్సిన లోపమే. ఇది బహుముఖంగా జరగాల్సిన పరోక్ష యుద్ధం.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

బస్సు సర్వీసు లేక ఇక్కట్లు
శ్రీకాకుళం నుండి కింతలి, తళ్లవలస, రాపాక, పొందూరు, సిరిపురం మీదుగా సంతకవిటికి నడిపే డే అవుట్ బస్ శ్రీకాకులం డిపో-1 నుంచి వచ్చేది. గత ఏడాదికాలంగా ఈ బస్సు నడపడంలేదు. ఫలితంగా వేలాది మంది ప్రజలు రవాణా సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల పరిస్థితి అంతే. ఈ బస్సుని రోజూ చిలకపాలెం, సిరిపురం మీదుగా పొందురుకు నడపాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మంచి ఆదాయం లభించే ఈ బస్సు సర్వీసును ప్రారంభించాలి.
- మూల శ్రీనివాసరావు, మల్లయ్యపేట, శ్రీకాకుళం జిల్లా

అన్ని చట్టాలు హిందూమతానికేనా?
భార్యకు మూడుసార్లు తలాక్ చెబితే ఆమెకంటె ఉన్నత స్థానంలో ఉన్న భర్త ఆమెనుంచి విడాకులు తీసుకునే పద్ధతి చెల్లుబాటు కాదు అని నిర్ణయించవలసింది సుప్రీంకోర్టు కాదని ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. ఇస్లాం మతం మాత్రం ఈ విడాకుల్ని ఆమోదిస్తుందని కూడా పేర్కొంది. సరే..మరి శబరిమలై ఆలయంలోకి స్ర్తిల ప్రవేశాన్ని ఆమోదించాలని, గోకులాష్టమిరోజు ఉట్టి కొట్టే పండుగలో 14 ఏళ్లకన్నా చిన్నవాళ్లకు అనుమతించకూడదని, ఎడ్లతో జల్లికట్టును నిర్వహించకూడదని, హిందూదేశంలో బాలికలకూ స్ర్తిలకూ అన్యాయాలు జరిగిపోతున్నాయని-కోర్టులు ఇస్తున్న లేక ఇవ్వబోతున్న- తీర్పులు హిందూత్వం ధర్మంలో చెల్లుబాటు అవుతాయా? ఇవి నిర్ణయించవలసింది మాత్రం హిందూ పీఠాధిపతులు, ధర్మవేత్తలు కాక కోర్టులా? మరి ఒక మతం వారికి ఒక న్యా యం, మరో మతం వారికి మరోన్యాయం ఉండటం ఎంతవరకు సబబు? సెక్యులర్ రాజ్యంలో అంతా సమానమే కదా. మరి ఈ వైపరీత్యం ఏమిటి?
- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు

ఖమ్మం జిల్లాకు తీరని అన్యాయం!
ఖమ్మం జిల్లా రెండుగా చీలిపోయి భద్రాద్రి (కొత్తగూడెం) ఖమ్మం ఏర్పడ్డాయి. కాని ఖమ్మంలో పారిశ్రామిక ప్రగతి గాని పరిశ్రమలు గాని మైన్స్ కాని లేవు. విశ్వవిద్యాలయాలు లేవు. అన్నీ కొత్తగూడెం జిల్లాకే పరిమితమయ్యాయి. ఒక సత్తుపల్లి బొగ్గుగనులు మినహా ఇక్కడ ఏ మీ లేదు. గ్రానైట్ పరిశ్రమలు ఉన్న గనులు తరిగిపోయాయి. కొత్తగూడెంలో మైన్స్, హెవీవాటర్ ప్లాంట్, స్పాంచ్ ఐరన్, బొగ్గు గనులతోపాటు భవిష్యత్తులో ఖనిజ సంపద నిక్షిప్తాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఖమ్మం అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంతో ప్రాచుర్యం ఉన్న జిల్లా విభజనవల్ల ఖమ్మంకు తీరని నష్టం వాటిల్లింది.

- అయినం రఘురామారావు, ఖమ్మం

ప్యాకేజీతో సరి
ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజి వైపే కేంద్రం మొగ్గుచూపింది. ప్రతిపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా ఆంధ్రుల హ క్కు అంటున్నాయ. హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఇష్టమున్నా ఆంధ్ర కంటే వెనుకబడిన రాష్ట్రాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి. వాళ్ళకు ఇవ్వకుండా ఆంధ్రకు ఇవ్వడానికి ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అంతేకాని బొత్తిగా ఇవ్వకూడదని కాదు. పవన్‌కళ్యాణ్ మాత్రం హోదాకోసం పోరాడుతామని అంటున్నాడు. కేంద్రం మాత్రం ప్యాకేజీతో సరిపెట్టింది.
- కె.నారాయణ, నంద్యాల