ఉత్తరాయణం

ప్రచార ఆర్భాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికేనా పుష్కరాలకు అంత హడావిడి చేశారు. గత పుష్కరాల్లో ఎటువంటి ఆర్భాటం లేకుండా కనీసం స్నాన ఘట్టాల వద్ద ఒక్క పోలీసు కూడ కాపలాగా లేడని లీలామాత్రంగా గుర్తు. ప్రజలకు పుష్కరం గురించి తెలియదా?! పుష్కరాల సందర్భంగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానించటం దేనికి? దేవుని కార్యానికి అందరూ పెద్దలే కదా! గత పదేళ్ల బాబుగారి పాలనలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఎన్ని మొక్కలు నాటించారో? వాటి స్థితిగతులు ఏమిటో తెలుసుకోవటం మం చిది. హైటెక్ ముఖ్యమంత్రిగారికి క్షణాలలో ముందుంటుంది. ఇప్పుడు మరల వనం మనం స్లోగన్‌తో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమం. ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంతులు భుజాన వేసుకుని ఒక్కరోజులో కోటి మొక్కలు నాటేయమని డబ్బులు ఖర్చుచేసి ప్రచారం చేసుకోవటం దేనికి?! ఒక్క మొక్కను నాటాలంటే గునపం, పార, నీరు సాధ్యపడితే కొద్ది పశువుల ఎరువు, ఏరుకుల్లకుండ వేప పిండి కూడ కావలసి ఉంటుంది. సామాజిక వన పెంపకం కాబట్టి.
ఒక్క రోజులో లక్ష మొక్కలు నాటడం ఊహకందని మాట. 10 సెం.మీ. ఎత్తుగల పోలితిన్ పేకెట్లలో మొక్కలు, లారీకి అతి కష్టంమీద 6వేలు మొక్కలు, ట్రాక్టరుకు 2,500/-లు ఏదో ఒకచోట దించి వెడతారు. మొక్క నాటేందుకు 2 అడుగులు లోతు గుంట తీయాలి కదా. ఇది అంతా స్కూలు పిల్లలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తుల పనా? ఏదో ఒకటి నాటి వీడియోలు తీయించుకుని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారంపొందడం కాదా? ప్రభుత్వం వారికి చిత్తశుద్ధి ఉండి ఉంటే. ఈ మొక్కలు నాటే కార్యక్రమం సామాజిక అటవీ శాఖ వారి ద్వారా వారి పర్యవేక్షణలో మొక్కలు ఉచితంగా అందజేసి, ఆయా ప్రాంతాల్లోని యువకులు, అన్ని వయస్సుల వారు, స్ర్తి, పురుషులు, గ్రూపుల వారిగా ఆ ప్రాంతంలో ఇన్ని మొక్కలు రెండు సం.లు పెంచి పోషించిన వారికి, ఇంతని నెలకు, 3 నెలలకు ఇంతని ముట్టచెబితే వన సం పద పెరుగుతుంది. నిరుద్యోగులకు కొంతవరకు వెసులుబాటు.
- నయనాల సూర్యప్రకాశరావు, కాకినాడ

కపట మేధావులు
ఆధునిక కాలంలో కనీసం పిహెచ్.డి చేసి, ఇంగ్లీషులో మాత్రమే గ్రంథాలు రాసి, ఉన్నత పదవులను నిర్వహిస్తూ, విదేశీ పర్యటనలు చేసి, ఉపన్యాసాలు ఇస్తున్నవారు మేధావులుగా పరిగణింపబడుతున్నారు. వీరు సాధారణంగా సూటు మాత్రమే వేసుకుంటారు. తెలుగు ఇంకా ఇతర భారతీయ భాషలంటే వీరికి రుచించదు. (పంచె, లాల్చి, కుండువాలను ధరించేవారు ఎంతటి మహామేధావులయినా, దేశీయ భాషలతోబాటుగా ఇంగ్లీషులో కూడా చక్కటి పాండిత్యం ఉన్నా వారిని మేధావులుగా గుర్తించటం లేదు!) హిందూ మత వ్యతిరేకత ఉన్న మేధావులు ‘‘మత వ్ఢ్యౌన్ని’’ తొలగిస్తున్నవారుగా గుర్తింపుని పొం దుతున్నారు! (ఇతర మతాల జోలికి మాత్రం పోకుండా ఉంటారు. హిందువులు ‘‘మెతక ప్రాణులు’’ కాబట్టి ప్ర మాదం ఉండదని వారికి బాగా తెలుసు.)సదరు మేధావులను కుల, వర్గ, ప్రాంతీయ, మతాల వారీగా పేర్కొంటే వారికి అభ్యంతరకరంగా తోచదు! మేధావులు అయినవారు విశాల దృక్పధం కలిగి ఉండాలి కదా. రాగద్వేషాలతో ‘రాతలు’ రాసేవారు, ‘కూతలు’ కూసేవారు మేధావులు అని ఎలా అనిపించుకోగలుగుతారు? అనైతికమైన, అవినీతి పనులు చేస్తూ, చేయిస్తూ ఉండేవారు కూడా మేధావులుగా చలామణి అవుతున్నారు. దేశంలో కపట మేధావుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది! ఎంతగా వివాదాలను సృష్టిస్తే అంతగా మేధావులుగా ప్రచారాన్ని పొం దుతున్నారు! కపట మేధావులకన్నా సత్యధర్మాలను పాటి స్తూ, అహింసాయుతంగా జీవించేవారు మిన్న. వీరికన్నా నిజమైన మేధావులు మరీమరీ మిన్న.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

ఐదురోజులు పని దినాలు
విద్యాసంస్థల్లో వారంలో ఐదురోజులు పనిదినాలుగాచేస్తే బాగుంటుంది. దీనివల్ల శని, ఆదివారాల్లో విద్యార్థులు హోమ్‌వర్కు చేసుకోడానికి, చదువుకోడానికి బాగా వీలుంటుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసం కలిగి తిరిగి విధులకు ఉత్సాహంగా హాజరవుతారు. వందల స్కూళ్ళ బస్సులు ఈ సెలవుదినాలలో నడపని కారణంగా ఇంధనం పొదుపు అవుతుంది. కొన్ని అటానమస్ కాలేజీల్లో రెండవ శనివారం సెలవును తొలగించారట. ఇది మరీ దారుణం. సామాజిక, పర్యావరణ, విద్యావేత్తలు తగురీతిగా ఆలోచనచేసి ప్రభుత్వానికి సూచనలివ్వాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్