ఉత్తరాయణం

కార్పొరేట్ ఆస్పత్రుల లీలలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్స కోసం వచ్చే రోగులను వివిధ పరీక్షల పేరుతో భయకంపితులను చేసి జలగల్లా పీడిస్తున్నాయి. చిన్నపాటి జబ్బు చేసినా ప్రైవేటు ఆస్పత్రి మెట్లెక్కితే చాలు దోపిడీ కథ ప్రారంభమవుతుంది. రోగి నుండి పూర్తి సమాచారం సేకరించకుండానే ముందుగా ఫలానా పరీక్షలు చేయించుకుంటేనే వ్యాధి నిర్థారణ చేస్తామని వైద్యులు చెబుతుంటారు. అదే ఆస్పత్రిలో లాబ్ సౌకర్యం ఉంటే పరీక్షల పేరుతో 500 నుండి 2వేల వరకూ వసూలు చేయడం, తర్వాత వైద్యుడు మందులు రాయడం, వాటి ఖరీదు కనీసం వెయ్యి రూపాయలపైగా ఉండడం సర్వసాధారణం. అవసరం లేకున్నా యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో రాయడం, ఆ మందులు వాడిన తర్వాత కొత్త వ్యాధిని కొనితెచ్చుకోవడం జరుగుతోంది. గ్రామీణ ప్రజలు తాము కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకే చెల్లిస్తున్నారు. లాబ్‌ల నుండి, మందుల షాపుల నుండి భారీగా కమీషన్లు అందడంతో వైద్యులు అనవసరమైన పరీక్షలు, మందులు రాసి ధనార్జనే ధ్యేయంగా కోట్లకు పడగలెత్తుతున్నారు. రోగుల ఆర్థిక స్థితిగతులు తెలిసి కూడా అనవసర ఆపరేషన్లు చేస్తూ కొందరు వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. ఆరోగ్యశ్రీ వంటి వైద్య బీమా పథకాల కింద చేరుతున్న రోగులపై వివక్ష చూపుతున్నారు.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

చర్చలతో పరిష్కారం
దేశంలో మావోయిస్టు సమస్యను నివారించేలా కేంద్ర ప్రభుత్వమే ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించినట్లు వార్తలొచ్చాయి. ఇది కొంతమందికి నమ్మశక్యంగా లేకున్నా, ఈ దిశగా ప్రయత్నాలు జరిగితే మంచిదే. సిద్ధాంతాల ప్రాతిపదికపై ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ గత నలభై ఏళ్లుగా మనదేశంలో ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉంది. మావోయిస్టు సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. మావోయిస్టులు అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు మావోలదే పైచేయిగా నిలిచింది. మరికొన్ని సార్లు వారి ఉద్యమానికి తీవ్ర నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో మావోల ఉనికి పూర్తిగా తగ్గితేనే ‘ప్రజాయుద్ధాని’కి తెరపడినట్లు లెక్క. మావోలు, ప్రభుత్వానికి నలభై ఏళ్లుగా జరుగుతున్న సుదీర్ఘ సమరం బహుశా మరే దేశంలోనూ కనిపించదు. సిద్ధాంతాలకు బదులు విధ్వంసానికి మావోలు మొగ్గు చూపడంతో వారికి జనంలో ఆదరణ తగ్గుతోంది. ఈ సమస్యకు స్వస్తివాక్యం పలికేలా సుప్రీం కోర్టే పరిష్కారం చూపాలి. మావోయిస్టు నాయకులతో, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు న్యాయమూర్తుల బృందాన్ని సుప్రీం కోర్టు నియమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సలహాలు పాటిస్తే మావోయిస్టు సమస్యకు శాంతియుత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
-డి.హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

నోట్లకష్టాలు ఎన్నాళ్లు..?

మధ్యతరగతివాని మనుగడెట్లు?
క్యూలో నిల్చొని ఎన్ని గంటలో గడప
మాకు దక్కేదెంత? మాన్యులారా!
ఈ జీతగాళ్ళకు ఎటనుండు బ్లాక్‌మనీ
నెల జీతమొక్కటే విలువ మాకు

ఈ దుర్భర స్థితిలో ఎన్నాళ్ళు సాగుటో
మంచిరోజులు మాకు మరల యెపుడో?
యిట్టి నిర్దయ పాలన యేలనయ్య
గట్టి యత్నాన దొంగల పట్టలేరొ?
బడుగుజీవుల తలమీద పిడుగువోలె
చచ్చు పడిపోయె రద్దయన పచ్చనోటు
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు