ఉత్తరాయణం

ఏం చెయ్యాలి మనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని హాస్యాస్పదంగాను, విస్మయం కలిగించేవిగాను ఉంటున్నాయి. వాటిని పరిశీలిస్తే- విశాఖ బీచ్‌లో తెరలుకట్టి ప్రేమికులను ఆహ్వానిస్తుందట ప్రభుత్వం! చాలా దేశాల నుంచి ప్రేమికులు కూడా వస్తారట. అన్నిరకాల ‘ఆధానా’లకు అవకాశాలు ఉంటాయట. ఇక, విజయవాడలో కాసినోలు (జూదగృహాలు) రాబోతున్నాయట. లాస్‌వెగాస్‌లోని కాసినోల్లో జూదరులను ప్రోత్సహించే అమ్మాయిలు కూడా ఉంటారు. కనుక విజయవాడలో కూడా అలాంటి ఏర్పాట్లు చేస్తారా? రాష్ట్రంలో ఇకపై హైస్కూలు చదువంతా ఇంగ్లీషు లోనేనట. ఎపితో పాటు దేశంలోనే తెలివైన ఇంజనీర్లు లేరని సింగపూర్ వాళ్లని ప్రభుత్వం ఆహ్వానిస్తే వాళ్లు ‘ససేమిరా’ అన్నారట. అమరావతికి 70వేల మంది బౌద్ధుల్ని ఆహ్వానిస్తారట. వియత్నాం, కొరియా, జపాన్ వగైరా దేశాల నుంచి వచ్చే వీళ్లకోసం ఆంధ్ర జిల్లాల్లో కప్పలు, పాములూ, బల్లులూ, ముంగిసలూ వాళ్ల నోళ్లలోకి వెళ్లటానికై అనంతంగా పుట్టవలసి ఉంది మరి! గిరిజనుల్లోంచి 300 మంది పిల్లల్ని ‘అమెరికా పంపిస్తాం. వెళ్లి చదువుకోండి’- అని పిలిస్తే ఐదుగురు మాతమే వచ్చారు. వాళ్లు తిరిగొస్తారనే ఆశ ప్రభుత్వానికైనా ఉందా? క్రిస్టియన్లను దళితులుగా ప్రభుత్వం గుర్తిస్తుందట! పేదలకు బియ్యం, పప్పు, ఉప్పు మాత్రమే కాదు.. సెల్‌ఫోన్లు ఉచితంగా ఇస్తారట! గోమూత్రం అమ్మకంపై 5% అమ్మకం పన్ను విధిస్తారట! ఇలా ప్రభుత్వ విధానాలు అయోమయంగా ఉన్నాయే తప్ప అర్థమయ్యేట్లుగా లేవు! ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి మనం?
- గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు, ఏలూరు

ఆదుకోని 2వేల నోటు
ప్రస్తుతం వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ వంద, రెండువేలు నోట్లే. వంద నోటు మహాప్రియమైపోయింది. బ్యాంకుల్లో ఇచ్చే వందనోట్లు ఎందుకూ సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా 2వేల రూపాయల నోట్లే దర్శనమిస్తున్నాయి. రెండుమూడు వందలు ఖరీదుచేసే వెచ్చాలు కొని కిరాణా కొట్లో 2వేల నోటు ఇచ్చినా చిల్లర లేదంటున్నారు. 100, 500 నోట్లు లేక ఈ పరిస్థితి ఏర్పడింది. కొత్త 500 నోట్లను విడుదల చేసినట్టు ఆర్‌బిఐ చెబుతుండగా, తమకు ఇంకా అవి రాలేదని బ్యాంకు అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ కష్టాలకు తెరపడడానికి ఇంకెన్ని రోజులు వేచి చూడాలో..?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

చిల్లర సమస్య కొన్నాళ్లే..
పెద్దనోట్లను రద్దుచేయడంతో దేశ ఆర్థికవ్యవస్థ సమూలంగా ప్రక్షాళనమై బాగుపడుతుంది. ఇన్నాళ్లూ డబ్బు దాచుకున్న వారు కోటీశ్వరులవుతుండగా, పేదలు మరింతగా కష్టాలు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగికెగసి పోతున్నాయి. ప్రస్తుతం పేద, మధ్య తరగతి ప్రజలు నగదు లభించక, చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ పెద్దనోట్లను రద్దు చేసినందుకు ప్రధాని మోదీని వారు అభినందిస్తున్నారు. మూలమూలల్లో బడాబాబులు దాచుకున్న నల్లధనం ఇకనైనా బయటకి వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో వుంటాయి. దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా మారిన టెర్రరిజం అంతరిస్తుంది. నగదు కొరత, చిల్లర సమస్యను కొద్దిరోజులు భరించగలిగితే- మనమే దేశ భవిష్యత్తుకు మంచి పునాది వేసిన వాళ్లం అవుతాము. మోదీని అభినందించక పోయినా అభిశంసించకుండా ఉంటే చాలు.
- నిష్టల సింహాచల శాస్ర్తీ, విశాఖ