ఉత్తరాయణం

పెద్దనోట్లు వద్దే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

500, 1,000 రూపాయల కారణంగానే దేశంలో కొంతమంది నల్లధనాన్ని విపరీతంగా పోగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసంతో కూడినది. పెద్దనోట్లను పేదలు ఎప్పుడూ దాచుకోలేరు. వారి వద్ద నల్లధనం ఉండే అవకాశం లేనే లేదు. పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది గనుక భయాలు అనవసరం. భారీగా నోట్లను నిల్వ చేసుకునే వారికే ఆందోళన ఎక్కువ. ఈ పరిస్థితులన్నీ సర్దుకున్నాక ఇకముందు వంద నోటుకు మించి పెద్దనోట్లు లేకుండా చేయాలి. 1000, 2000 రూపాయల నోట్ల వల్ల కొంతమంది నగదును నిల్వ చేసుకునే అవకాశం ఉంది. చెలామణిలో అన్నీ చిన్ననోట్లే ఉంటే చిల్లర సమస్యే ఉండదు.
- ఇఎస్ జగదీశ్వర్, నెల్లూరు

ప్రకృతి సేద్యం మేలు
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వేప పిండి, వేప రసాయనంతో పాటు ఆవుపేడ, ఆవు మూత్రం, ఇతర జంతువుల వ్యర్థ పదార్థాలను పొలాల్లో ఎరువుగా వాడడం ఉత్తమం. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఖరీదైన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడడం వల్ల పంటల ఉత్పత్తి మాటేమోగానీ, ఆ ఆహారోత్పత్తులు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. ఎండిపోయిన చెట్ల ఆకులు, వానపాములతో తయారు చేసిన కంపోస్టు ఎరువులు వాడితే పంట దిగుబడులు పెరుగుతాయి. వరి వంటి ఆహార ధాన్యాలు, కూరగాయల సాగులో సహజసిద్ధమైన ఎరువులు వాడితే ఖర్చులు కలసివస్తాయి. ఈ రకంగా పండించే పంటలు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. రుచికరంగానూ ఉంటాయి. వ్యవసాయ శాఖ అధికారులు కూడా కంపోస్టు ఎరువులను పంటలకు విరివిగా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్

ఆస్పత్రుల తీరు ఇంతేనా?
నిరుపేదలకు, మధ్య తరగతి వారికి వైద్యం చేయించుకోవాలంటే ప్రభుత్వాసుపత్రులే శరణ్యం. ప్రైవేట్ డాక్టర్లకన్నా ఎక్కువ అనుభవం ప్రభుత్వ డాక్టర్లకే ఉంటుంది. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రులలో చూపించుకోవడానికి జనం పోటీ పడాలి. కానీ జరుగుతుందేమిటి? ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిలో నిర్లక్ష్యం వైఖరి దారుణంగా ఉంటోంది. దీంతో రోగులకు కలుగుతున్న ఇబ్బందులు తరచూ వార్తలకెక్కుతున్నాయి. డాక్టర్లే కాదు, ఇతర సిబ్బందీ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. ప్రాణదాతలైన డాక్టర్లు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలి. అన్నిరకాల వ్యాధులకు మందులను అందుబాటులో ఉంచాలి. వైద్యులు తాము పనిచేసేచోటే నివాసం ఉంటూ ప్రజలకు అండగా నిలవాలి. ఇతర సిబ్బంది కూడా అంకితభావంతో పనిచేసేటట్లు చూడాలి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ నుండి ప్రజలను కాపాడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం