ఉత్తరాయణం

ఇదా మన సంస్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు, తెలుగునాట పుట్టి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి భారతదేశానికి సంగీత సామ్రాట్టుగా ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టిన మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉండవలసింది. కనీసం తమిళనాడు ప్రభుత్వం కాని, రెండు తెలుగురాష్ట్రాలు గాని, వారి తరఫున మంత్రులు గాని హాజరై ఉంటే ఎంతో గౌరవంగా, హుందాగా వుండి వుండేది. ఇది ఆయన ఆత్మను అగౌరవపరచినట్లయింది. బాలమురళీ కాంస్య విగ్రహం పెడతారట ఎక్కడో. ఇది కూడా రాజకీయ లాభంకోసమేనని అర్ధమవుతున్నది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

నల్లబాబులకే శిక్ష పడాలి
జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతాలలో రూ.50,000/- మించి ధనాన్ని డిపాజిట్టుచేస్తే వారికి పేదలకు లభించే రాయితీలు రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటించినట్లుగా పత్రికల్లో వచ్చింది. రూ.50,000/- కన్నా ఎక్కువ సొమ్మును వేసిన వారి వివరాలను ఖాతాదార్లవద్ద స్వీకరించి- ఆ డబ్బు స్వంతదార్లను నల్లధనం చట్టం క్రింద శిక్షిస్తే బాగుంటుంది. అంతేగాక- ఆ ధనాన్ని మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకొనడం దేశానికి శ్రేయోదాయకవౌతుంది. ఒకవేళ రూ.50,000కు మించిన డబ్బు ఖాతాదారుకు చెందినదైనా లేక తనది కాకపోయినా డబ్బు స్వంతదారు వివరాలు చెప్పడానికి నిరాకరించినా అతనికి పేదలకు ప్రభుత్వ పథకాల క్రింద లభించే సదుపాయాలను నిరాకరించడం సమంజసవౌతుంది.
- వరిగొండ కాంతారావు, హన్మకొండ

ప్రమాదాల ప్రయాణం
హైవేలపై మోతాదుకుమించి జనాలతో నడుస్తున్న వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తుపానులు, మ్యాజిక్, మాక్సిమోలు, ఆటోలు సామర్థ్యానికి మించి జనాన్ని కుక్కిస్తూ ప్రమాదాలు పెంచుతున్నారు. ఈ లోడ్‌కు తోడు అతివేగం కలగలసి ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇవి చాలవన్నట్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. మామూలు రోడ్లు, హైవేలతోపాటు జంటనగరాలలోని పలు ప్రాంతాలలోనూ ఇలాంటివి కనిపిస్తున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యాన్ని విడనాడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

నేతలవల్లే అవినీతి
దేశంలో అవినీతి బలపడటానికి రాజకీయ నాయకులు పోషిస్తున్న పాత్రే ప్రధాన కారణం. అవినీతితో సంపాదించిన నల్లధనాన్ని నిర్మూలించడానికి ఇటీవల నరేంద్రమోడీ తీసుకున్న చర్యలు కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. ఇదే విధంగా నకిలీ నోట్ల బెడదను వదిలించడానికి రిజర్వ్‌బ్యాంక్ అధికారులు ఆలోచించాలి. అవినీతిని నిరోధించడానికి న్యాయస్థానాల సంఖ్యను పెంచుతామని అంటున్నారు. కోర్టుల సంఖ్యను పెంచడం అవసరమే. సామాన్య ప్రజలను ఇక్కట్లనుంచి బయటపడేయాలంటే పాలకులు ముందుగా అవినీతి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్