ఉత్తరాయణం

చిల్లర సమస్య తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ననోట్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలపై ఉంది. ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను తగినన్ని ముద్రించి విడుదల చేస్తే చిల్లర సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారస్థులు గతంలో తమకు వచ్చిన చిల్లర నోట్లను ఏరోజుకారోజు బ్యాంక్‌లలో డిపాజిట్ చేసుకునే వారు. అప్పుడు చిల్లర కొరత ఉండేది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2,000 రూపాయల నోటు తేవడంతో చిల్లర సమస్య ఇపుడు తీవ్రమైంది. వంద, అయిదు వందల నోట్లను అన్ని ప్రాంతాలకూ పంపిణీ చేయాలి. నోట్లను దాచేస్తూ చిల్లర కొరతను సృష్టించేవారిపై కఠినంగా శిక్షలు వేయాలి.
-అయినం రఘురామారావు గౌడ్, ఖమ్మం

తల్లిదండ్రులకు వినతి..
10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. పిల్లల చదువుపై తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంది. పేరెంట్స్ తాము రోజూ చానెళ్లలో చూసే సీరియళ్లను త్యాగం చేస్తూ టీవీలను కట్టెయ్యాలి. వీలైతే పరీక్షలు ముగిసేవరకూ కేబుల్ కనెక్షన్ తొలగించాలి. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే తొలగించడం మేలు. మొబైల్, వీడియో గేమ్స్‌కు పిల్లలను దూరంగా వుంచాలి. మార్కుల పేరుతో ఒత్తిడిలేకుండా పిల్లలను స్వేచ్ఛగా చదవనివ్వాలి. మధ్యమధ్యన విరామం ఇస్తుండాలి. విద్యార్థులకు సరైన పౌష్టికాహారాన్ని అందివ్వాలి. జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉంచాలి. పరీక్షల పట్ల భయం పోగొట్టి పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

నోట్ల రద్దుపై రాజకీయమా?
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో ప్రతిపక్షాల వాదన కేవలం రాజకీయమే. పెద్దనోట్ల రద్దువల్ల భారీగా నల్లధనం దాచుకున్న వ్యక్తులే బాధపడుతున్నారు. దొంగనోట్లు ముద్రించటం, అవి విపరీతంగా దేశంలో చెలామణిలో వుండటం, పాకిస్థాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను దొంగనోట్లు ముద్రించి భారత్‌లోకి ప్రవేశపెట్టడం, బీదలను ప్రలోభపెట్టి దొంగనోట్లు ఇవ్వటం కొనే్నళ్లుగా నిరాటంకంగా జరుగుతున్నది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే గాదు, ప్రతిపక్షాలది కూడాను. ప్రతిపక్షాలు ప్రజల పేరుచెప్పుకుంటూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలు బాధపడుతున్నారని విపక్ష నేతలు వాపోతున్నారు. పెద్దనోట్ల రద్దువల్ల బాధపడేది ప్రజలు కాదు, ఢిల్లీలోని రాజకీయ నాయకులే! పెద్దనోట్ల రద్దువల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి రుగ్మతలకు అడ్డుకట్టపడినట్లేగదా! ముందుజాగ్రత్త తీసుకోకుండా పెద్దనోట్లను రద్దు చేస్తారా? అని విపక్ష నేతలు అంటున్నారు. ముందు జాగ్రత్తలంటే- రాజకీయవేత్తలకు, బడా బాబులకు తెలియజేయలేదనా? అందుకేనా ప్రతిపక్షాలు పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నాయి?
- జి.శ్రీనివాసులు, అనంతపురం