ఉత్తరాయణం

మత మార్పిడులు కనపడవా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ జనాభాలో 96 శాతం మంది హిందువులున్నారని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి హిందువులు 50 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీరు 20 శాతం ఉన్నారు. కేరళ, మణిపూర్, మేఘాలయాల్లో చాలామంది తక్కువ హిందువులున్నారు. మతం మార్చుకుంటున్న హిందువులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. హిందువుల్లో నిరుపేదలు, నిరుద్యోగులు, వ్యాధిపీడితులు మతం మార్చుకొంటున్నారు. వారికి కొన్ని సదుపాయాలు కల్పిస్తూ క్రిస్టియన్ మిషనరీలు ఆకట్టుకుంటున్నాయి. ఉచిత విద్య, వైద్యం లాంటి సదుపాయాలను ఆశిస్తూ మతం మారుతున్నారు. ఇన్ని జరుగుతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు హిందూ సంస్థలు కానీ మత మార్పిడులను పట్టించుకోకపోవడం దారుణం.
- గిరిధర్, విశాఖపట్నం

పర్యాటక స్థలాలపై చిన్నచూపు
తెలంగాణలో అనేక చారిత్రక, పర్యాటక ప్రదేశాలు నిరాదరణకు గురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట, గణపురం మండలంలోని కోటగుళ్లు వంటి చారిత్రక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రకృతి రమణీయకతకు నిలయమైన పాండవుల గుట్టలో దేవతామూర్తుల విగ్రహాలు, పాండవులు వనవాస సమయంలో సేదతీరినట్లు ఉన్న చారిత్రక ఆధారాలు నిరాదరణకు గురవుతున్నాయి. ఈ ప్రాంతం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాండవుల గుట్ట వద్ద పోలీసులు నిఘా ఉంచాలి. ఇక్కడి చారిత్రక అవశేషాలను పరిరక్షించి పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

ఇది ‘మృత్యువేగం’..
రహదారులపై వాహన చోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ ప్రమాదాల్లో వాహన చోదకులే కాదు, రోడ్డుపై వెళుతున్న వారు సైతం ప్రాణాలను కోల్పోతున్నారు. కార్లు, జీపులు, బైక్‌లు, లారీలు, ఆటోల జోరుకు అదుపులేకుండా పోతోంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అప్పుడప్పుడూ మొక్కుబడి తనిఖీలు జరుపుతున్నారే తప్ప వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. మద్యం సేవించి ఎంతో మంది వాహనాలను నడుపుతున్నారు. ఫలితంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినపుడు పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది. జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని, ఓవర్‌లోడ్‌ను నిరోధించేందుకు అధికారులు చొరవ చూపాలి. లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే యువకులకు భారీ జరిమానాలు విధించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ముదిగొండకు ‘తుమ్మల’ సత్కారం
‘అభినవ తిక్కన’, ‘తెలుగులెంక’ తుమ్మల సీతారామమూర్తి చౌదరి పేరిట ఏటా ఇస్తున్న ‘తుమ్మల సాహితీ సత్కారాని’కి (2016 సంవత్సరానికి) ‘చారిత్రక నవలా చక్రవర్తి’ ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌ను ఎంపిక చేశాము. ఈనెల 15న గుంటూరులోని బృందావన్ గార్డెన్ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగే సత్కార సభలో ముదిగొండకు ఈ పురస్కారం అందజేస్తాము. ‘తుమ్మల కళాపీఠం’ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతుంది.
- డా. పులిచర్ల సాంబశివరావు,
ప్రధాన కార్యదర్శి, తుమ్మల కళాపీఠం