ఉత్తరాయణం

నల్లధనం నివారణ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ దేశంలో నల్లధనాన్ని అంతం చేయడం అసాధ్యమని ఇదివరకే రుజువైంది. గతంలోనూ రెండు సందర్భాల్లో పెద్దనోట్లను రద్దు చేసినా నల్లధనం సమస్య సజీవంగానే ఉంది. అప్పట్లో పెద్దనోట్లను అత్యధిక శాతం ధనికులు వాడుకొనేవారు, దాచుకునేవారు. పెద్దనోట్లను గతంలో రద్దు చేసినపుడు సామాన్య జనం ఎలాంటి కష్టాలు పడలేదు. పెద్దనోట్లను రద్దు చేసిన ప్రభుత్వం మిగతా కరెన్సీని సిద్ధంగా ఉంచకపోవడంతో ఇపుడు బ్యాంకులు, ఎటిఎంల వద్ద నగదు కోసం జనం నరకయాతన అనుభవిస్తున్నారు. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి విరుగుడుగా నగదు రహిత లావాదేవీలు జరుపుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన తక్కువ. నగదునే నిల్వ చేసుకొని తమ అవసరాలకు వినియోగిస్తూ ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గ్రామాలకు అందుబాటులో లేదు. రూ.2000 నోటుతో చిల్లర దొరక్క జనం పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం చిల్లర నోట్లను విరివిగా ముద్రించి వెంటనే విడుదల చేయాలి.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు

ఈ ప్రచారం తగునా?
మన దేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం వైద్యులు ప్రకటనలు ఇవ్వటం నేరం. కొందరు వైద్యులు ఫ్లెక్సీల ద్వారా, టీవీల్లో ప్రకటనల ద్వారా తాము అందించే సేవల గురించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకటనలను ఫ్రాన్స్ వంటి దేశాల్లో పూర్తిగా నిషేధించారు. వాణిజ్య ప్రకటనల మాదిరి డాక్టర్లు అట్టహాసంగా ప్రకటనలు ఇవ్వకూడదన్న చట్టం అమలులోకి రావాలి. ఇలాంటి చట్టాలున్నా అమలు చేసే నాథుడే లేడు. కార్పొరేట్ ఆస్పత్రులైతే పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గౌరవప్రదమైన వైద్యవృత్తిని లాభసాటి వ్యాపారంగా మార్చడం విచారకరం.
-కోవూర వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు

కళతప్పిన గ్రామీణ క్రీడలు
దేశంలో ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన గ్రామీణ క్రీడలు కనుమరుగైపోతున్నాయి. పట్టణీకరణ ప్రభావంతో పల్లెప్రాంతాల్లో ఆటలు అంతరించిపోతున్నాయి. గోటిబీళ్ళ, బార్‌కూన, కోతికొమ్మచ్చి, తుడుం పిచ్చిబంతి, స్తంభాలాట, దాడాట, బాలికలు ఆడుకునే కాళ్లా గజ్జా కంగాణమ్మ, వంగుడు దూకుడు వంటివి పూర్తిగా కనుమరుగయ్యాయి. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఇపుడు కొంత ఆదరణ లభిస్తోంది. మన జాతీయ క్రీడ హాకీ గతంలో అన్ని పాఠశాలల్లో ఆడేవారు. క్రీడా మైదానాల కొరత వల్ల వాలీబాల్, హాకీ, బాస్కెట్ బాల్ వంటివి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో స్కూల్స్‌లో డ్రిల్ పరేడ్ విధిగా వుండేది. క్రికెట్‌కు మాత్రమే వేలం వెర్రి ఏర్పడింది. ఒకప్పుడు పల్లెల్లో సైతం వ్యాయామశాలలు ఉండేవి. కాలక్రమేణా అవి కమర్షియల్ రూపు ధరించి జిమ్స్‌గా మారాయి.
-అయినా రఘురామారావు, ఖమ్మం