జాతీయ వార్తలు

రెబల్ ఎమ్మెల్యేలపై 9న తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: అనర్హత వేటు పడిన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈనెల 9న తీర్పు ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. ఇటీవల 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాలు చెల్లవంటూ ఈ 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడంతో ముఖ్యమంత్రి హరీష్ రావత్ పదవీచ్యుతుడయ్యారు. హరీష్ బలపరీక్షకు ఈనెల 10 అసెంబ్లీని సమావేశ పరచాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. బలపరీక్ష జరపడానికి ఒక రోజు ముందే 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్‌పై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది.