వినదగు!

మానసిక ప్రాంగణంలో దివ్యాగ్ని రాజిల్లాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమాత్మ అంటే దివ్యత్వ లోగిలి... అద్వితీయ స్థితి... అదృశ్య ప్రాంగణం... అమృత చైతన్య వాహిని.. మాయాతీతం.. పరంజ్యోతి... జ్ఞాన స్వరూపం.. జ్ఞాన గమ్యం.. జ్ఞేయం.. ఖగోళ స్థితులకు, భౌగోళిక స్థితులకు మూలం.. సకల జీవరాశికి, ఆత్మజీవులకు పుట్టిల్లు... చరాచర హృదయ స్థితం.. అందుకే ఈ పారలౌకిక అవిభక్త స్థితిని ‘బీయింగ్’ అంటుంటాం.
సర్వేంద్రియ గుణాభాస, సర్వేంద్రియ వివర్జిత పరమాత్మ నుండి ఉద్భవించేవే కాలమైనా, పదార్థమైనా, జీవమైనా, ప్రాణమైనా, ఇతరాలేవైనా. పరమాత్మ అనే శాశ్వతత్వం నుండి కాలయవనికపై కొంతకాలం మనుగడ సాగిస్తున్న ప్రతీ అంశా ‘బికమింగ్’. ఈ బికమింగ్ బీయింగ్‌లో భాగస్వామే తప్ప తానే మూలం, సర్వం అని విర్రవీగటానికి అవకాశం లేదు.
‘అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితమ్’
నిజానికి పరమాత్మ అంటేనే ప్రమాణం.. రుజువులకు అందని ప్రమాణం.. అయినా అన్ని రుజువులకు ప్రమాణమైన ఆ పరమాత్మది ఏకత్వమే. అయితే సృష్టిమగ్నమై బహుళంగా విస్తృతవౌతోంది. ఏకతగా ఉన్నది పరాప్రకృతి అవుతుంటే బహుముఖీనంగా విస్తరింపబడుతున్నదంతా పదార్థ, పదార్థేతర సమ్మేళనం అవుతోంది. ‘ఉనికి’గా దృశ్యమానమవుతోంది. పాంచ భౌతిక ప్రపంచంలోని సర్వభూతాలు ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినవే. చరాలు, అచరాలు, జీవులు, ప్రాణులు - అన్నీ పంచభూత ప్రకృతి వశాలే. ఇలా మన మానసిక చైతన్యానికి అందేదంతా ఈ పంచభూత ప్రకృతే.
పంచభూత ప్రకృతి చరాలలోను, అచరాలలోను విభిన్న అంశలుగా వ్యక్తవౌతుంటుంది. ఈ వ్యక్తాంశలే వాటివాటి ప్రవృత్తులు. మన పరంగా ఈ వ్యక్త ప్రవృత్తే వైయక్తిక ప్రవృత్తి... ఒక విధంగా మన అస్తిత్వంగా వెల్లడవుతున్న అహానికి మరో రూపం. వొదిగిన అహం దివ్యప్రవృత్తిగా రాణిస్తుంటే విస్ఫోటనమైన అహం దానవ ప్రవృత్తిగా అధోగతి పాలవుతోంది.
సామాన్య జీవనంలో ఈ వివేకం, ఈ వివేచన జ్ఞాన విజ్ఞానాలుగా అనిపించవచ్చు. అయితే ఆత్మజ్ఞానం మాత్రం ఒక్క తృప్తాత్మకే సాధ్యం. అంతఃకరణం జ్ఞాన విజ్ఞాన సంపూర్ణం అయితేనే అంతరాత్మ తృప్తాత్మగా ప్రజ్ఞానాన్వితమవుతుంది. ఎటువంటి వికారాలకు లోనుకాకుండటం వల్ల, ఇంద్రియాలను జయించగలగటం వల్ల, చరాలను అచరాలను సమంగా సమస్థితిలో ఆదరించటం వల్ల ఆత్మజీవనం యోగ జీవనం అవుతుంది. జీవాత్మకు పరమప్రాప్తి కలుగుతుంది.
గిక సాధనతో జీవాత్మ పరవాత్మ తత్వాన్ని సంపూర్ణంగా అందుకోగలగాలి. అందుకే భగవద్గీత జీవాత్మను ‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ’గా విలసిల్లాలంటుంది. అంతేకాదు ‘జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః’ అనీ అంటుంది. అంటే ‘స్వ’ అధీనమైన ఆత్మజీవులలోని పరమాత్మ తత్వం స్థితమై ఉంటుందని. ఇలా జీవాత్మ తృప్తాత్మ కావాలి, జితాత్మ కావాలి.
ఇంకా ‘ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః’ అన్నదీ గీతా వాక్యమే. జితాత్మ కోరుకునేది ఏకాంతాన్ని.. ఇష్టపడేది నిర్జనత్వాన్ని, నిశ్శబ్దాన్ని. ఈ ఏకాంత, నిర్జన, నిశ్శబ్ద సాంగత్యం మనస్సును, ఇంద్రియాలను వశపరచుకున్న జీవాత్మకే సాధ్యం.. కాబట్టి జీవాత్మను ‘యత చిత్తాత్మా’ అంటూనే ‘ప్రశాంతాత్మా’ అనీ అనటం జరిగింది. అంటే భయకంపితం కానిది, బ్రాహ్మీ స్థితిని చేరుకున్నది ప్రశాంతాత్మ అని. ఇంతకీ బ్రాహ్మీ స్థితిని చేరుకోవటం అంటే భోగస్పృహ లేకుండటం. అదే పూర్ణ పురుషత్వం. ఈ ఆత్మస్థితి యోగయుక్తం.
గీత చెప్తున్న ఈ విషయాలను సంపుటీకరిస్తే అంతరాత్మగా ప్రకాశిస్తున్న జీవాత్మ మానవత్వంతో మనుగడ సాగిస్తున్న దివ్యాంశ సంభూతంగానే కాలంతో పోటీ పడుతోంది. ఆ కాలాన్ని జయించటానికి దివ్యత్వంతో తలమునకలవుతోంది. అయితే స్థూల దేహంలో సూక్ష్మాంశగా ఉన్న ఈ దివ్యత్వం విస్తృతం కావాలి. సృష్టి కార్యంలో భాగస్వామి కావాలి అంటే వైయక్తిక ప్రకృతి సృష్టి వికసన ప్రకృతిగా పరిణమించాలి.
ఇంతకీ మానవ ప్రకృతి, మానవ ప్రవృత్తి ఎటువంటిది? అన్నది ప్రశ్న.
పంచభూత సమాహారం మన మానవ ప్రకృతి. ఈ ప్రకృతి మన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల ద్వారా కార్యాచరణ రూపంలో వ్యక్తమవుతుంటుంది. ఫలితంగా అహంకారం, సుఖం, దుఃఖం, కోరిక, ద్వేషం, మోహం మొదలైన భావోద్వేగాలు పొటమరిస్తుంటాయి. ఇవన్నీ దైహికంగానే వ్యక్తమవుతున్నప్పటికీ మానసికాలే... కాబట్టి మానవ స్థితి మానసిక స్థితినే. ఈ భావోద్వేగాలన్నీ మానవ స్థితి మానసిక స్థితినే. ఈ భావోద్వేగాలన్నీ నెగెటవిటీగా ఊడలు దిగక పాజిటివ్‌గా కొమ్మలు, రెమ్మలతో మహావృక్షం కాగలిగితే మానవ జీవనం దివ్య జీవనం అయినట్లే! మానవత్వంలో దివ్యత్వం నెలకొన్నట్లే!
మన మానసిక స్థితిలో దివ్యాగ్ని రాజిల్లితే తప్ప ఈ వికసన పర్వం సాధ్యం కాదు. పరిపూర్ణత్వం సాధ్యం కాదు. అంటే మనస్సు అనేది హృదయస్థం అయితే తప్ప ఆధ్యాత్మిక అనుభూతులకు లైన్‌క్లియర్ కాదు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే అధ్యాత్మ జ్ఞానం అని.. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ తత్వ ఎరుక అని. ఆత్మస్పృహ చాలు అజ్ఞానం తొలగటానికి. జ్ఞానం ప్రకాశించటానికి.. అందుకే-
‘అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్త్వ జ్ఞానార్థ దర్శనమ్/ ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోన్యథా’ అని అంటుంది గీత.
అధ్యాత్మ జ్ఞానంతో నిత్యం స్థితమై ఉండటమే యోగ సాధన. సాధనా ఫలితం ఆత్మజ్ఞాన దర్శనమే. తత్వ జ్ఞానార్థ దర్శనమే. సర్వకాలాలలో సమభావంతో ఆ పరమాత్మ తత్వాన్ని ఆచరణలో పెట్టటమే గిక సాధన.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946