వినదగు!

ఆత్మది వృత్తివ్యాప్త ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మ సంస్థం మనఃకృత్వా న కించి దపి చిన్తయేత్’ - ఎటువంటి చింతనా లేకుండా మనస్సును ఆత్మలో స్థిరపరచాలి. అంటే, ఎటువంటి స్థితిలోను ‘ఆత్మ’ అంటే మనస్సు కాదు.
మనస్సు దేహంలోనిదే... కనిపించనిదే..! చైతన్యం కూడా దేహానిదే.. అదీ కనిపించనిదే..!! మనస్సు లేకున్నా దేహానికి మనుగడ సాధ్యం కానీ చైతన్యం లేనిదే దేహానికి అస్తిత్వం లేదు. కాబట్టి చైతన్యం అంటే ఆత్మచైతన్యమే. నిజానికి ఆత్మ అంటే అధిభౌతిక అంశ. అది భౌతికంగా చైతన్య స్రవంతి... అధిభౌతికంగా చైతన్య విస్ఫోటనం.
ఆత్మ భౌతిక శరీర అంశగా అనిపిస్తున్నప్పటికీ అది సూక్ష్మ అంశగానే ప్రస్థానిస్తుంటుంది. దేహం లేనప్పుడూ ఆత్మకు అస్తిత్వం ఉంది.. దేహాన్ని పొందినప్పుడూ ఆత్మకు అస్తిత్వం ఉంది. అంటే స్థిరమైంది, చిరమైంది ఆత్మ. ఆత్మ ఆంతరిక వర్తనం సాగిస్తూ భౌతిక సృష్టికి అవకాశం ఇస్తుంటుంది. అందుకే మనం దేహ పరిణామాన్ని గురించి చెప్పగలమే కానీ ఆత్మను పరిణామశీలిగా కాక ప్రస్థానశీలిగానే చెప్పుకోవాలి. అంటే దేహ పరిణామం సాధ్యమైనట్లుగా ఆత్మ పరిణామం సాధ్యం కావటంలేదు. ఆత్మది ప్రస్థానమే తప్ప పరిణామం కాదు. దేహానికే వినాశనం తప్ప ఆత్మకు కాదు.
అన్నట్టు, దేహం అన్న వెంటనే మన ముందు ఒక రూపం కదలాడుతుంది. రూపం కదలాడటం అంటే భౌతికంగా ఉన్నట్లే. కాబట్టి దేహానిది వృత్తివ్యాప్తి. అంటే దేహాన్ని మన భౌతిక నేత్రాలతో ప్రత్యక్షంగాను, స్పష్టంగాను చూడగలం... దేహం ఎదుట లేకపోయినా ఆ రూపాన్ని మనస్సు తన ముందు నిలుపుకో గలుగుతుంది. అంటే వ్యక్తరూప దేహం మనస్సుకు వ్యాప్తి చెందుతోంది. ఇలా మనసుకు చేరటం ఫలవ్యాప్తి.
మన దేహం మన కళ్లకు పోనీ ఎక్కడో ఒకచోట కనిపించటం వర్తమానం... అంటే దేహానికి వృత్తివ్యాప్తి, ఫల వ్యాప్తి ఉన్నట్లే. ఇకపోతే మన కళ్లకే కాదు ఎక్కడా రూపంగా కనిపించనిది ఆత్మ.
ఆత్మను చైతన్యంగా చిత్రించుకోగలం.. దేహం నిండా పరివ్యాప్తమైనట్లు అనుభూతించగలం. అంతే తప్ప రూపం లేదు. రూపం లేని ఆత్మను మనస్సు సైతం తన ముందు నిలుపుకోలేదు. అంటే ఆత్మ అస్తిత్వం విశ్వసనీయతలోనే దాగి ఉంది. దాన్ని అనుభూతించగలం తప్ప రూపంగా దర్శించలేం. ఇలా ఆత్మకు వృత్తివ్యాప్తి సాధ్యవౌతోందే తప్ప ఫలవ్యాప్తికి అవకాశం దొరకటం లేదు.
అన్నట్టు, దేహం మనదే అయినా దాన్ని ద్వితీయంగానే చూస్తున్నాం. అది వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కనుమరుగయ్యే తీరుతుంది. ఉంది అన్న భావనతో చెప్పగలుగుతున్నా... రూప నిరూపణకు అందలేకపోతున్నా అద్వితీయంగానే పరిగణిస్తున్నాం. ఇక వర్తమానంలో ఆత్మకు దేహం ఆలంబన అవుతోంది కదా అని ఎల్లప్పుడూ దేహం, ఆత్మ ఒకదాన్ని వదిలి మరొకటి చరించలేవన్న నిర్ధారణకు రాకూడదు.
‘సుఖ మాత్యన్తికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీన్ద్రియమ్
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః’
అని భగవద్గీత అన్నట్లు అత్మ ఇంద్రి గోచరమైంది కాదు. పైగా అనుభూతికి మాత్రమే అందేది. కాబట్టి ఆత్మ అంటే ఫలవ్యాప్తి లేనటువంటిదే! నిజానికి ఆత్మ నిరాధారమైందే అయినా మన వర్తమాన దైహిక జీవనానికి సర్వాధారం ఆత్మనే. ఆత్మకు రూపం లేదు.. అయినా ఆత్మ దర్శనం సాధ్యమే - గిక సాధనతో.
ప్రస్తతం మనం జీవిస్తున్న తీరులో ఫలవ్యాప్తి వైపే మొగ్గుతున్నాం. అంటే ఇంద్రియ వ్యవస్థపై ఉన్న ఆసక్తి, మక్కువ, మొగ్గు అతీంద్రియంపైన ఉండటం లేదు. నిజానికి ఈ విషయేంద్రియ భోగాలన్నీ దుఃఖకారకాలే... అయినా మనం కోరుకుంటోంది ఈ లోకానే్న కానీ లోకోత్తరం కావాలనుకోవటం లేదు. అంటే మనల్ని బాహ్య ప్రకృతి కట్టి పడేసినట్లుగా అతీత ప్రకృతి ఆకర్షించటం లేదు.. కారణం మనం మానసిక, శారీరక వ్యవస్థలకు కట్టుబడి ఉండటం వల్లనే! లౌకికంగా మనసును, శరీరాన్ని విశ్వసించినట్లుగా ఆత్మను విశ్వసించకపోవటం వల్లనే... అంతరంగాన్ని అందలం ఎక్కించకపోవటం వల్లనే. ఆత్మ ఉనికిని అవునంటున్నా ఆత్మను ఇంద్రియాతీత ఆధిక్యతలో చూడలేక పోతున్నాం.
మొత్తానికి ఇంద్రియాతీతం, లోకోత్తరం కాలేకపోవటం వల్లే అర్జునుడికైనా, మనకైనా ఇంతలా ప్రాపంచిక, మానసిక అగచాట్లు. మనం వస్తు సంతతికి ప్రతిబింబాలం కావటంవల్లనే ఆత్మ ఔన్నత్యాన్ని గుర్తించలేక పోతున్నాం. మన భౌతిక చైతన్యానికి, అధిభౌతిక చైతన్యానికి ఆత్మనే ‘కీ’గా ఎంపిక చేసుకోలేక పోతున్నాం. అసలు దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన ఈ అపరా ప్రకృతిపై ఉన్న శ్రద్ధ వీటన్నిటికీ మూల చైతన్యం జీవంగాను, పరాప్రకృతిగాను ఉన్న ‘ఆత్మ’ ఉండటం లేదు.. కారణం ఆత్మను ఇహానిదిగా చూడలేక పోవటంవల్లనే.
‘జ్ఞానేన తు తదజ్ఞానం మేషాం నాశిత మాత్మనః
తేషా మాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్’
జ్ఞానం ఆత్మను గురించిన అజ్ఞానాన్ని తొలగిస్తుంది.. ఆ జ్ఞానమే సూర్యుడిలా పరమాత్మ అస్తిత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ పరమాత్మనే మన స్వస్వరూపం అని తెలుసుకుని ఆత్మ నిష్ఠతో గిక జీవనం సాగించగలిగితే వరో జన్మలేని వారంఅవుతాం.
ఇంతకీ ఇక్కడ గిక జీవనం అంటే సృష్టిలోని ప్రతి అంశకూ సవ ప్రాధాన్యం ఇవ్వటం. ఈ సమత్వమే బ్రహ్మత్వం. ఈ సమత్వ సాధనతోనే మనం ఈ జీవితంలోనే, ఈ జీవనంలోనే సృష్టిని జయించినవారమవుతాం. అంటే సృష్టి రహస్యాలు మన స్వంతమై సృష్టి మనమూ బింబ ప్రతిబింబాలమవుతాం. ఇదీ గికంగా సాధ్యవయ్యే అద్వైత సిద్ధి.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946