వినదగు!

ఆత్మత్యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జునుడి శక్తియుక్తుల్ని ఆజ్ఞా ప్రాంగణానికి చేర్చితే తప్ప విశ్వజ్ఞత్వం అంది రాదు. విశ్వజ్ఞత్వంతో తప్ప ప్రతీ భౌతిక, అధిభౌతిక అంశా విశ్వాంస సమానం కాదు. అంటే విశ్వాసం లేనిదంటూ ఇటు భౌతికంలోనైనా, అటు అధిభౌతికంలోనైనా లేదు. ఆజ్ఞా ప్రాంగణంలో అందుకునే విషయాలన్నీ ప్రామాణికాలే! కాబట్టే అవి సత్యాలుగాను, పరమ ధర్మాలుగాను పరగణింప బడుతుంటాయి.
ఇహానికే పరిమితమైనంత వరకు మనం దేన్నీ వదులుకోవాలన్నా వదలుకోలేం. అంతటి ఐహిక వాంఛలో తలమునకలై ఉంటాం. కొంత త్యాగనిరతి ఏర్పడితే తప్ప ఈ ఇంద్రియ భోగాల నుండి విడివడలేం. దీనే్న ఆత్మత్యాగం అంటుంటాం. అంటే ఆత్మికమైన దాన్ని త్యజించటం. ఇక్కడ ‘సెల్ఫ్ గివింగ్’ అనేదే ‘సెల్ఫ్ శాక్రిఫైజ్’ అవుతుంది. ఇలా త్యాగనిరతి దిశగా ఏర్పడినవే మానవ విలువలు, మానవ ధర్మాలు. వీటన్నిటి సమాహారంగా మనం చెప్పుకునేదే ‘రుజువర్తనం’.. రైట్, లివింగ్. ఈ రుజువర్తనంతోనే మనం భవిష్యత్తుకు వారధులం అవుతామే తప్ప గతానికి వారసులం కాము... పైగా సంకుచితం కాక విస్తృతం అవుతుంటాం.
సెల్ఫ్ సర్వీస్ నుండి సెల్ఫ్‌లెస్ పెర్ఫామెన్స్‌తో ప్రస్తావించటమే విశ్వయోగం. అందుకే మానవ తత్వంలో విశ్వతత్వాన్ని నింపుతుంటుంది గీత. నిజానికి మనం మానవ తత్వంతో వున్నామంటే త్రిగుణ సంపన్నంగా ఉన్నట్లే! త్రిగుణాతీతం కాగలిగితేనే విశ్వజ్ఞత్వం.
అర్జునుడు కురుక్షేత్రంలో రెండు సేనల మధ్యన తమ రథాన్ని నిలపమని కృష్ణుడిని కోరటం ఒక విధంగా యుద్ధ తంత్రమే! ఇంకొక విధంగా ఆత్మవిశ్వాసమే! మరొక విధంగా అహంకరించటం కూడా!!
గెలవాలంటే ప్రత్యర్థుల సంసిద్ధతను బేరీజు వేయాలి.. అబ్జర్వేషన్ లేకుంటే విజయం సాధ్యం కాదు.. ఇది గెలుపు సూత్రం.. ‘విజయ’ రహస్యం. ఇక రెండవ అంశ ఆత్మవిశ్వాసం... ఎంతటి వారినైనా తుదముట్టించగలనన్న ధీమా... తాను నేర్చిన విద్యపై, తన పట్టుపై అచంచల విశ్వాసం. కాబట్టే ఈ చర్యతో అర్జునుడు ధీరోదాత్తుడిగా మనల్ని ఆకట్టుకుంటాడు. అయితే ఆత్మవిశ్వాసమే ఒక్కోసారి అహంకారంగా ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. అహంకారం విజృంభించకుండా ఉడిగిపోవాలంటే ఆత్మీయత పరచుకోవాలి. నిజానికి ఆత్మీయుల మధ్య ఎంతటి అహంకారమైనా నీరుకారిపోతుంది. వైరి వర్గంలోని ఆత్మీయుల్ని చూడటంతో అర్జునుడి ఇన్నర్ లెవల్స్‌లో గూడుకట్టుకుని ఉన్న అహంకారం నీరసపడింది.
కురుక్షేత్రం ఒక విధంగా అంతర్యుద్ధమే! అయిన వారితోను, ఆత్మీయులతోను పోరు అంటే అంతర్యుద్ధమే! మొదట్లో అర్జునుడి విషయంలో పైకి అంతర్యుద్ధమే కానీ అందర్నీ చూసిన తర్వాత అది అర్జునుడిలో అంతరంగ పోరు అయింది. ఇంటి పోరు అంతరంగ హోరుగా సాక్షాత్కరించింది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946