వీరాజీయం

కెజి నుంచి కాలేజి దాకా భోజన పథకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నమెంటు కాలేజీల్లో అటెండెన్సు బాగుంటే ముందు, ఆ తర్వాత అన్నీ వాటికవే బాగుపడతాయ్- అన్న విశ్వాసం ఒకటి చాలాకాలంగా వుంది. ఖాళీ పొట్టలతో పోలేక విద్యార్థులు మధ్యాహ్నం క్లాసులకి ఎగనామం పెడుతున్నారన్నది ఒక పరిశీలన. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంటు చాలా తీవ్రంగా యోచిస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఈ సంగతి వెల్లడి అయింది. నిజానికి సిఎం కెసిఆర్ ధ్యేయమే కె.జి. నుంచి పి.జీ.దాకా ఉచిత విద్యాబోధన. కానీ, ఎన్ని తంటాలు పడ్డా కళాశాలల్లో ముఖ్యంగా జూనియర్ కళాశాలల్లో అటెండెన్స్ అంతంత మాత్రమే. ఆమాట కొస్తే చాలా ప్రయివేటు జూనియర్ కళాశాలల్లో కూడా పై ‘‘పొర’’లో వున్న ‘ర్యాంకుల పిచ్చి’ పిల్లకాయలు తప్ప- తతిమ్మా వాళ్లు బలాదూర్‌లోనే వుంటున్నారన్న ఆరోపణ వున్నది.
‘దీన్ని గవర్నమెంటు జూనియర్ కళాశాలల్లో- మేము మెరుగు పరచటానికి- ఎంతో వ్యయప్రయాసలకి ఓర్చుతున్నాం’- అని అసెంబ్లీలో విద్యాశాఖకి కూడా బాస్ అయిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నొక్కివక్కాణించారు.
‘దీన్ని ఒక ‘డ్రయివ్’గా చేస్తాం. ఇప్పుడున్న నూట యిరవై వేల విద్యార్థుల సంఖ్యని రానున్న విద్యా సంవత్సరంలో రెండు లక్షల దాకా పెంచాలన్నదే దృఢ సంకల్పం’- అన్నారు మంత్రివర్యులు. గ్రేట్!
‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి ఇమీడియట్ లక్ష్యాలలో యిది కూడా వున్నది. ఈ ఉద్యమంలో భాగంగానే- జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తే- మధ్యాహ్నం క్లాసుల ఎగవేత తగ్గుతుంది అనీ, నిజానికి ఉచిత విద్య- అంటే నోట్‌బుక్స్, పాఠ్యగ్రంథాలు కూడా పంపిణీ చేశాకా పిల్లకాయలు కాలేజీలలో చేరడం బాగా పెరిగింద’ని మంత్రిగారన్నారు.
‘తిండి కలిగితే కండ గలదోయ్, కండ లేనిదే చదువులకి కావల్సినంత బలం రాదోయ్’- అన్నది ఇటీవల బాగా రుజువవుతోంది. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. కొన్ని అవకతవకలున్నాయి అంటే, అవి పథకాలలో లేవు- వాటి అమలులోనే వుంటాయని అంటున్నారు విజ్ఞులు. ‘విద్య యొసగు వినయము.. వినయము వలన ‘పాత్రత’. ‘పాత్రత’కీ వంట పాత్రలకీ అవినాభావ సంబంధం వుంది కాబోలు. ఉచిత భోజన పథకాల వలన - ‘డ్రాపవుట్స్’, ‘అబ్‌స్కాండింగ్’లు తగ్గుతున్నాయట.
‘‘కంప్యూటర్ సిస్టమ్‌కైనా, హ్యూమన్ సిస్టమ్‌కైనా మా స్టారూ.. లోడింగ్ అండ్ అన్ లోడింగ్ సదుపాయాలుండాలి సార్! లేకపోతే బండి నడవదుండ్రి!’’ అన్నాడో విద్యార్థి.
‘‘విద్యాలయాల్లో ‘ప్రసా దం’ అంటే విద్య ప్రధానంగా వుండాలి గానీ, దానితోపాటు ‘సాదం’ అంటే భోజనం కూడా వుండాలి. వెనుకటికో మంత్రిగారు- ‘‘దేవాలయం కన్నా శౌచాలయం మిన్న’’ అన్నాడో లేదో- పవిత్ర దేవాలయాన్ని టాయ్‌లెట్స్‌తో పోల్చుతా వా? అంటూ ఆయన మీద కలియబడిపోయారు గానీ, ఇవాళ ఒక కొత్త త్రికోణం వచ్చింది. ‘విద్యాలయ్, దేవాలయ్, శౌచాలయ్’. ఈ మూడూ ఇంపార్టెంట్ ఆ న్సర్లే! ఈ విషయంలో కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు- వేసవి సెలవులకు ముందు చల్లని వార్తగా- కొన్ని విషయాలు అసెంబ్లీ ముఖంగా ప్రకటించారు. ‘మళ్లీ జూన్ పనె్నండున స్కూళ్లు తెరిచేసరికి 25వేల స్కూళ్లల్లోనూ- స్కూలుకి ఒక్కటైనా మరుగుదొడ్డి సదుపాయం వుండి తీరుతుంది’- అని చెప్పారు. రాష్ట్రంలో అన్నిరకాల స్కూళ్లూ కలిపి 25,926 వున్నాయి నిజమే. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కాలంలో మరుగుదొడ్లు ఎన్ని వున్నాయ్? ఎన్ని కట్టిస్తారు? మధ్యాహ్న భోజన పథకాలకి వడ్డనశాలలు ఎన్ని వున్నాయ్? వంటకాల సంగతులేమిటి? అన్న ప్రశ్నలు సంధించడమే ప నిగా పెట్టుకోకుండా- ‘‘మీ ప్రాంతాల స్కూళ్ల ఆరాలు తీసి, వివరాలతో పాటు మాకో నివేదిక లాంటిదివ్వండి’’ అంటూ కూడా విద్యాశాఖామంత్రిగారన డం ఒక గొప్ప సంగతి!- అడిగేవాడు కాదు, ఆచరించేవాడు కావాలి అన్నది కొత్త స్లోగన్. ‘బైఠ్‌నే న దేవ్’’! ‘‘బైఠో నహీఁ’’- అన్నది మరో నినాదం. ప్రస్తుతం మార్కెట్‌లో బా గా పేలుతోంది. ‘కూ ర్చోకు, కూర్చోనివ్వకు’ అదే కానీ, స్థిరంగా పిల్లకాయలు కూర్చోవాలి. అధ్యాపకులు కూడా కూర్చోకుండా పనిచెయ్యాలి. అంటే మెదడుకి ‘మేత’తోపాటు ‘పొట్టకి కూడా కాస్త మిడ్ డే మీల్ ప్యాకెట్ పథకం’ అమలు కావాలన్నది- ఆశ మాత్రమేకాదు, ఒక ఆశయం కూడా కావాలి’ అన్న విషయంలో, ఈ మధ్యనే కదలిక వచ్చింది. ‘‘తెలంగాణ ఏజెన్సీ ప్రాంతం నుంచి ‘నడక’ శ్రమకి ఓర్చి ఉన్నత విద్యకోసం సిటీలకి వచ్చే విద్యార్థులకు భద్రాచలం గవర్నమెంటు డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ కాలేజీ ఒకటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది’- అన్న వార్త నిజంగా స్ఫూర్తిదాయకంగా వుందని పేపర్ రిపోర్టులు చెబుతున్నాయి. ఎవరో వస్తారని- ఏమేమో వండి వడ్డిస్తారని ఆశించకుండా, ఒక కళాశాలకు చెందిన అధ్యాపకులు పూనుకుని, వాళ్ల జేబులలో నుంచి, చందాల తీసి ఒక లక్ష రూపాయలు ‘ప్రోది’ చేశారు. ఈ ఫండ్‌తో, బి.ఏ, బి.కామ్,బిఎస్సీ విద్యార్థులు రెండువందల మందికి ఉచిత లంచ్ ఏర్పాటుచేశారు. ఈ పథకాన్ని భద్రాచలం, కొత్తగూడెం జాయింట్ కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ పూనిక మీద, ఈ ఏడాది జనవరి నెలాఖరున ప్రారంభించారు.
రోజుకి అయిదువేల రూపాయల ఖర్చుతో విద్యార్థులు మిడ్ డే క్లాసులకి కూడా మార్నింగ్ క్లాసుల్లాగే అటెండ్ అవుతున్నారుట. ఈ పథకం గడువుఅయినాక కూడా కొనసాగించాలన్నదే ధ్యేయంట. తథాస్తు! కాగా- తెలంగాణలో మరికొన్ని డిగ్రీ కాలేజీలు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం సాయంతో, ‘లంచ్’ టైమ్‌కు విద్యార్థులు బయటకు వెళ్లిపోకుండా- భోజనశాలకి వచ్చేలోగా పథకాలను ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారుట! దీనికోసం విద్యార్థుల నుండి తలకో ఐదేసి రూపాయలు ఐచ్ఛికంగా ఇస్తేనే తీసుకుంటున్నారుట. ఇటువంటి పథకాలు ఎన్ని అమలు జరిగితే - అంతే తిండి పుష్టితోపాటు విద్యాపుష్టి కూడా సాధ్యమవుతుంది?
ఏది ఏమయినా- ‘మండుటెండలో’అని బెదిరిస్తున్నారు విజ్ఞులు. సెలవులకి ముందు సెలవుల తరువాతా కూడా యిటువంటి పథకాలుంటాయంటేనే ఎంతో ‘చల్లగా ’వుంటుంది- అంటే ‘అర్ధం’ వున్నది కదా!
గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ సచ్ స్కీమ్స్! *