వీరాజీయం

ఐ.పి.ఎల్.కి కరోనా గాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కరోనా.. కరోనా..’’ దీనిమీద, ‘‘కుఛ్ కరోనా!’’ అంటే, ‘‘ఏమైనా తరుణోపాయం చూడుమీ!’’ అంటే, ఏం చెయ్యాలి? కేరళ రాష్ట్రంలో గవర్నమెంట్ మార్చ్ నెలాఖరు దాకా సినిమా హాల్స్ మూయించేసింది. ఢిల్లీ లో పిల్లకాయల స్కూల్స్ మూయించేశారు. మరో దేశం పోదాం అంటే కూడా రుూ కరోనా వైరస్- దాని పేరే కోవిడ్-19. సర్వాంతర్యామి. అంతటా వుంది, అంటున్నారు- ఒక్క అంటార్కటికాలో తప్ప. అక్కడికి పోగల వాళ్లెవ్వరు?
ఈ కరోనా కూడా స్వైన్‌ఫ్లూ లాంటిదే ఇన్‌ఫ్లుయంజా జ్వరం లాంటిదే. కాకపోతే ఫ్లూకన్నా కాస్త ముందుగానే- ఐదారు రోజుల్లో బయటపడుతుంది. ఎండలు ఎక్కువైతే, వాతావరణంలో వేడిమి ప్రబలితే ఇది దానంతటదే సమసిపోతుంది- అంటారు, ఆశావాదులు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు మాత్రం, ‘‘అటువంటి మేషాండ భ్రమలు పెట్టుకోవద్దు జాగ్రత్తలు తీసుకోండి’’, అంటున్నారు. అసలు రుూ కోవిడ్-19 వైరస్ కథా, కమామీషూ, జాతకం యింకా రీసెర్చి స్థాయిలోనే వుంది. మార్కెట్‌లో హోమియోపతీ మందులు, ఆయుర్వేదం మందులు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లిపోతున్నాయి.
‘‘సినిమాలు మానేయ్... ఊపిరి పీల్చకు’’, అంటే ఎలాగండీ? దీనికి ఎక్స్‌పర్టులు, గవర్నమెంటులు కలసి ‘‘కుఛ్ కరోనా.. అంటే.. ఏదో ఒకటి చెయ్యాలి గానీ..’’ అన్నాడు ఓ ప్రతిపక్షి! అంటే గవర్నమెంట్ జడ పదార్థమా? గవర్నమెంటులు, మంత్రులు మాత్రం దీనికో లెఖ్కా? పోలీసులంటే దీనికి భయమా?
కరోనా ఏ క్షణాన, ఎవరికి సోకుతుందో? జీ.ఓ.కే. అంటే గాడ్ ఓన్లీ నోజ్... అనగా ఆ పరమాత్మకే తెలియాలి’’ అన్నాడో సీనియర్ సిటిజన్. ‘‘అయ్యోయ్! మురిసిపోకు. ఇది వయసు మళ్లిన ‘‘శాల్తీ’’లకే, అనగా సీనియర్ సిటిజన్ల మీద మోజుపడుతున్నది’’ అన్నాడో యంగ్‌మ్యాన్. కానీ ‘‘కరోనాకి అటువంటి జాతి, మత, కుల, ఆర్థిక వ్యత్యాసాలు లేవండీ’’ అన్నదో కళాశాల విద్యార్థిని. అసలు రుూ వ్యాధి మన మొబైల్స్‌కి వచ్చేసినట్లుందండీ... ఫోన్ ‘‘నొక్కు’’ అది దగ్గుతోంది. వెంటనే చెవికి దూరంగా లాగేసుకుంటున్నదో జీన్‌ప్యాంట్ వాలీ.
‘‘మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అట్లా పేరసిటమాల్‌కి కోవిడ్- 19, అనే కరోనా రాక్షసుడు లొంగుతాడా?’’ అంటున్నాడు- ముక్కుకి మాస్కు పెట్టుకున్న గవర్నమెంట్ ఆఫీసర్. సాఫ్ట్‌వేర్ శాల్తీలకీ యిది సోకుతుంది అన్న భయం వేస్తే, వెంటనే- ‘‘కొంపల్లోనే తగలడండి. అక్కడ్నుంచే వర్క్ చెయ్యం డి’’ అంటున్నాయి కంపెనీలు కొన్ని. ఢిల్లీ, బెంగలూరు లాంటి నగరాలకే లేదు. ఇక హైదరాబాదుకీ, విజయవాడకీ దిక్కేమిటీ?’’ అంటున్నాడో ఆంధ్రుడు.
శరీరంలోకి రుూ వైరస్ ప్రవేశించగానే, ‘‘ఏటీ తెల్దు’’- ఓ అయిదారు రోజులయినాక అది- ‘‘హాచ్ఛ్’’(తుమ్ము) మంటూనో- ‘‘క్కెహ్ క్కెహ్’’ అంటూ దగ్గురూపంలోనో బయటపడుతుంది. ‘‘దేశంలో ఈ కేసులు రెండంకెలలోనే వున్నాయి గానీ, యితర ఖండాలలో, దేశాలలో రుూ సంఖ్య పది లక్షలు దాటేస్తోంది. ఇటలీ దేశంలో యిది- మహమ్మారి లాగా తగుల్కొంది’’ అంటూ ఎక్కడ చూసినా కరోనా కబుర్లే. ‘‘నీ జిమ్మడ.. నీకు కరోనా తగుల్కోనూ’’ అని కొత్తగా తిట్టుకుంటున్నారు. కరోనా కవిత్వం హైకూల దగ్గర్నుంచీ ‘‘దండకా’’ల దాకా సాగిపోతున్నది. దీన్ని రాకుండా యజ్ఞం ఏదైనా వున్నదేమో, చెయ్యరాదా?’’అంటున్నది, ‘నారీ’ అవార్డు అందుకున్న సుదతీమణి. మార్చి 8న సన్మానం అందుకున్న వో మహిళారత్నం- దీని మీద లెక్చరిచ్చింది...
‘‘యాగమా? ప్రయోగమా? ఏవైనా కంపెనీలు, సాంఘిక సంస్థలు చేయలేవు. చేస్తే, మన కె.సి.ఆర్. చెయ్యాలి. లేదా యు.పి.లో యోగీగారు చెయ్యాలి’’ అంటున్నాడు మిర్చిబజ్జీ టిఫిన్ సెంటర్‌వాలా. ‘‘రోజూ ఆండ్రాయిడ్ ఫోన్ మీద అన్నిరకాల వార్తలు- నొక్కి నొక్కి మరీ వింటాడు. అతని దగ్గర కస్టమర్‌లు నొక్కి నొక్కి మిర్చీ బజ్జీలు తింటారు- ‘‘నిర్భయు’’లు వాళ్లు. అన్నట్లు ఐ.పి. ఎల్. సీజన్ సందు మొగనుంది. ‘‘అది జరిగేనా?’’ దీనంగా, దిగులుగా మొహంపెట్టి అడుగుతున్నాడు ఒక స్టూడెంటు. ‘‘పరీక్షలు రాయవోయ్ ముం దు, తుమ్మకుండా, దగ్గకుండా’’ అంటున్నాడు వాళ్ల డాడ్! యుట్యూబ్‌లో నొక్కుకుంటూ చెరుపుకుంటూ ముక్కు నులుపుకుంటూ-
అయిందీ.. అదీ అయింది.. కరోనా రాక్షసుడుకి హోలీ మంటలు వేస్తే భయమా? ఏమిటీ? ఇదేదో సామెత చెబుతారే- ‘‘కామదహనం చేశాం కనుక మానభంగాలు తగ్గుతాయి’’ అన్నట్లుంది. మాస్క్‌లు బ్లాక్‌బజార్లో కొనుక్కుని, ధరించి వూపిరాడక చావడమే గానీ, కోవిడ్-19, ‘‘అది తాటాకు చప్పుళ్లకు కుందేళ్లకు బెదరవు అన్నట్లు- మాస్క్‌లకీ సానిటైజర్లకీ లొంగదు. అది మిరియాలు, అల్లం, కలిపి, నూరి-కసాబిసా నమలాలి. దాంతోగానీ పోదు’’, అంటున్నారొక మామ్మగారు.. బెంగలూరులో హడలి ఛస్తున్నారు. తాజా వార్త ఏమిటీ అంటే, ‘‘కరోనా కారణంబున మేము రుూసారి ఐ.పి.ఎల్. టోర్నమెంట్స్‌కి ఆతిథ్యం యివ్వలేము. క్షమించండహో’’ అని కర్నాటకా గవర్నమెంటు రాసేసిందట, ఒక ‘‘లకోటా’’, ‘‘ఈ వార్త అధికారికమా?’’ నిరాశగా అడిగాడు క్రికెట్ ప్రియుడు; నిప్పులేనిదే పొగ రాదు బ్రదర్! మరి, మహారాష్ట్ర హెల్త్ మంత్రిత్వశాఖయే ‘‘మేము ఐ.పి.ఎల్.ని ఆడనిచ్చి రిస్క్ తీసుకోము’’ అని నొక్కివక్కాణిస్తున్నారే! ఇట్లా దేశం మొత్తం- సి.ఏ.ఏ.కి ఒకటి తర్వాత ఒకటిగా- అసెంబ్లీలు వ్యతిరేకించి తీర్మానాలు చేస్తున్నట్లు- ‘‘ఐ.పి.ఎల్. పోటీలు మావల్ల కాదు- వేలాది గ్యాలరీ ప్రేక్షకులు- ఎంత మాస్కులు ధరించినా- తుమ్మకుండా, దగ్గకుండా, కేరింతలు కొట్టకుండా వుండలేరు కదా? అంటే ఏం చెయ్యాలి?
‘‘పోనీ, మరో దేశంపోయి, అక్కడ పెట్టుకుందామా? అంటే, ముందే మనవి చేశాను. అంటార్కటికాని మాత్రమే యింతవరకూ చేరకుండా వదిలేశాడు’’ కరోనా రక్కసుడు. పాపం! విరాట్ కొహ్లీ స్టారు బాగులేదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా- బంగలూరు ముందే బెంగ పెట్టేసుకుని- ‘‘గుడ్‌బై కరోనా.. సారీ, గుడ్‌బై ఐ.పి.ఎల్.’’ అంటోంది.
ప్రపంచంలో అతి కాలుష్య నగరాలు ముప్ఫయి వుంటే, అందులో యిరవై రెండు మన పవిత్ర భారతదేశంలోనే వున్నాయిట! ఔరా! ఏ ఉపద్రవం వచ్చినా ముందు దేశ రాజధాని ఢిల్లీకే తగుల్కొంటున్నది. ఇదంతా ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటున్నారు మోదీ భక్తులు. అట్లా అనుకోవటం లేదా? అన్ని మీరు అనుకుంటున్నారా? సరే, అట్లాగే కానివ్వండి కరోనా రహిత దేశంగా రుూ భారతదేశాన్ని చేసే ముందు- కాంగ్రెస్ రహిత ఆర్యావర్తనంగా చెయ్యాలండీ, అంటూ దేముణ్ని కోరుకుంటున్నాను’’ అన్నాడో భక్తుడు.. ‘‘పోయి తిరుపతిలో తల నీలాలు యిచ్చిరా!’’ అన్నాడో జర్నలిస్టు.
‘అదీ వూడింది బ్రదర్! కరోనా భయం అక్కడ ఏడు కొండలకీ ఎగబ్రాకింది,’’అన్నాడు భాజపా క్రిటిక్ ఒకడు. భయం భయంగా, అటూ, యిటూ చూసి, ‘‘జలబు చేసిందా? అయ్యా! దయచేసి తిరుమల ట్రిప్ క్యాన్సిల్ చేసుకోండి. దయచేసి, స్పెషల్ దర్శనం అయినాసరే కానీయండి’’ అన్నాడు యింకొకడు. కరోనా నిరోధంలో భాగంగా- దగ్గినా, తుమ్మినా ఎటువంటి భక్తుడినయినా తిరుగు టపాలో కొండ క్రిందికి ‘‘బంగీ’’ చేసేస్తాం. లేదా, వైరస్ తగిలిందంటే ఆ ఆసుపత్రిలో పడేస్తాం’’ అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికార గణం ఒక తీర్మానం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు.
ఔరా! ఏమి విధి! అందరూ ఏడుకొండల వాడికి ‘‘గోవిందా! గోవిందా! కోవిడ్-19ని పారద్రోలవా! పాహిమాం.. పాహిమాం..’’ అంటూ పోయి, వాడి సమక్షంలో మొరపెట్టుకుందామనుకుంటే- ఇలా ‘రావద్దు’ అని ఆంక్షలు పెట్టడం ధర్మమా?’’ అంటున్నారు- రిజర్వేషన్లు చేయించుకున్నవారు. ‘‘దగ్గు జలుబు రాకుండా చూడు- నామాలస్వామీ! అని నామాలు పెట్టేసుకుని మ్రొక్కండి ఏడుకొండలవాడికి అంటున్నాడు ఒక ట్రావెల్ ఏజెంట్.
‘‘ఎం.పి. శశిథరూర్‌గారు రుూ మధ్యనే, లిటరేచర్‌లో సాహిత్య ఎకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు.’’ అన్నాడో మిత్రుడు ఏదో చెప్పడానికి ఉటంకిస్తూ. ‘‘దానిదేముంది? ‘‘పైరవీ’’ చేసుకుంటే, సాహిత్య అకాడమీ అవార్డు తన్నుకుంటూ వస్తుంది’’ట అన్నాడు ఒక లెఫ్టిస్ట్ రైటరు.
‘‘కాదు బాబూ! ఆయనగారు మెడలో ఓ చిన్న డబ్బా తగిలించుకుని తిరుగుతున్నాడు రుూమధ్య- హేమ్మాలినీతో కబుర్లుచెబుతూ. ‘‘నీకేం కరోనా రాదు. నువ్వు కూడా మెడలో ఒకటి వేసుకుంటావా?’’ అంటున్నాడు కాబోలు.. హ్యాపీగా వున్నారు.
‘‘అయ్యో! సెల్‌ఫోన్ కాదా? అది? ఎయిర్ ప్యూరిఫైయ్యరా?’’ అంటున్నదామె! అంటూ ఓ కార్టూనిస్ట్ వ్యంగ్య చిత్రం కూడా వేశాడు. ‘‘అయితే రుూ ఎయిర్ ప్యూరిఫైయ్యర్ అనగా’’, గాలి శుద్ధియంత్రం- ‘‘కరోనా వైరస్‌ని ఆపగలదా? అయితే చెప్పండి ఎంతైనా కొనుక్కుంటాను’’ అన్నాడో వడ్డీ వ్యాపారి.
సోది ‘‘అడుగు బ్రదర్! ఎవడు చెప్పగలడు?’’ అన్నాడు అప్పులఅప్పారావు.
‘చైనావాడు అడ్డమైన పురుగుల్నీ తింటాడు వాళ్లకి రావడం సబబే! కానీ నేను బాసుందీలు, బాదం హల్వాలు, కొర్రలు, జొన్నల దోశలు మాత్రమే తింటాను. నాకూ దగ్గువస్తోంది. బాబోయ్! భయం వేస్తోంది,’’అంటున్నదో మార్నింగ్‌వాక్ ఇల్లాలు తన లావుపాటి శరీరాన్ని తాపీగా మోసుకుంటూ... ముందుకి సాగుతూ.
‘లెట్ కరోనా గో, ఓ గాడ్! అల్లా! పరమాత్మా!’..
లెట్ కోవిడ్-19- డై!

veeraji.columnist@gmail.com 92900 99512