వీరాజీయం

పరాజయ పరాభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్జిస్తూ, గాండ్రిస్తూ అరివీర భయంకరంగా న్యూజిలాండ్ మీద- జైత్రయాత్రకోసం సాగుతున్న సైన్యంలాగా పోయిన మన కొహ్లీసేన- దేశానికి తిరిగి వచ్చాక విమానాశ్రయం నుంచి దొడ్డిదారి వెదుక్కోవలసిన దుస్థితి వచ్చింది. క్రైస్ట్ చర్చ్ మైదానం కొహ్లీసేనకి ‘వాటర్‌లూ’ అయిపోయింది.
ఇంతటి ఘోర పరాజయం లోగడ 2018లో ఇంగ్లాండ్ చేతిలో మాత్రమే లభించింది. అప్పుడు ఇండియన్ టీము నాలుగు టెస్ట్ పోటీలలో మట్టిగరిచింది. ఒకే ఒక టెస్టును గెలిచింది. అయితే న్యూజిలాండ్ టూర్‌కి మన జట్టు నెంబర్ వన్ ప్రపంచ టెస్ట్ టీముగా భుజకీర్తులు ఎగరేసుకుంటూ వెళ్లింది. మైదానంలో- ‘కరోడా’, ఆటలో ‘దూకుడు’, పరుగుల యంత్రం -లాంటి బిరుదులు సహజసిద్ధంగానే సంపాదించుకున్న విరాట్ ఖొహ్లీకి రుూ టెస్ట్ సిరీస్‌లో ‘విరాట్’ అన్న మూడు అక్షరాలు వుండి పోయినట్లయిపోయింది!
‘రెండూ-సున్నా’తో కొహ్లీసేన తాజా టెస్ట్‌సీరీస్‌ను పోగొట్టుకుంటుందని పాపం శత్రువులు కూడా అనుకోలేదు. అదేమిటో, నాయకుడు బ్యాటింగ్ మరిచిపోయాడు. అనుయాయులు కూడా బ్యాటింగ్ మరిచిపోయారు. ‘‘ఈ గాయం మానడానికి మనవాళ్లు మరో టెస్ట్ సిరీస్ ఆడి-తమ సత్తా నిరూపించుకోవాలీ అంటే, బ్రహ్మాండంగా గెలవాలి కాని, యిప్పట్లో మరో దేశంమీద ఆడే ఛాన్సు లేదు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో పోటీ వుంది.
‘అదీ, మన దేశంలో అయితే బాగుణ్ను’’, అన్నాడో, కొహ్లీ వీరాభిమాని.
మనవాళ్లు ఆస్ట్రేలియా వెళ్లాలి. అదీ ఎప్పుడో నవంబర్ నెలలో ఈలోగా జనం, కనబడ్డ దగ్గరల్లా- ‘ఏం, గురూ! ఎలా వుంది న్యూజిలాండ్ తీసిన చావుదెబ్బ? అసలు ఇంతలా, దారుణంగా బోర్లాపడ్డానికి కారణం ఏమిటీ?’’అంటూ, గాయాల్ని కెలుకుతూ వుంటారు.
మనవాళ్లకి ‘‘ఇంట్లో పులీ- బయట పిల్లీ’’లాంటి చెడ్డపేరు యిదివరకే వుంది గానీ, ధోనీ పగ్గాలు వదిలేశాకా నాయకత్వం అందుకున్న విరాట్ కొహ్లీ అంత దూకుడుగానూ, అంతకన్నా స్పీడుగానూ ఇండియన్ క్రికెట్ టీముని జేగీయమానంగా పరిగెత్తించాడు. కొహ్లీని అంత ప్రేమగా, గౌరవంగా బోర్డువారు సెలక్ట్‌చేశారు. నంబర్‌వన్ టెస్ట్ టీమ్ అన్న పేరు యిప్పటికీ మిగిలి వున్నది. అదే మనకి-‘గుడ్డిలో మెల్ల’అన్న సామెత చందాన ‘‘మిగిలివుంది’’ అన్నాడో ఆశావాది.
పదకొండు ‘ఇన్నింగ్స్’ ఆడిన తర్వాత-వెనక్కి తిరిగి చూస్తే- విరాట్ ఖాతాలో- ఒక్క అర్థశతకం మాత్రమే వుంది. అదే పనిగా అతని ‘ఆఫ్ స్టిక్’ మీద బంతులు వేయించాడు కేన్ విలియమ్స్- దొరికిపోయేవాడు మన విరాట్. అట్లా విరాట్ విఫలమైపోతూండటంతో టీము కూడా నీరుగారిపోయింది. జిడ్డు మాస్టర్‌లు పుజారా, రెహానాలుండి కూడా టెస్ట్ పోటీని నాలుగోరోజు దాకానైనా లాగలేక పోవడానికి వాళ్ల ‘‘మైండ్‌సెట్’’ దెబ్బతినడమే కారణం.
‘ట్వంటీ-ట్వంటీ’లో ప్రత్యర్థుల మీద నిప్పులుచెరిగి అద్భుతంగా గెలిచిన ఇండియన్ టీము వేరు. వన్‌డే ఇంటర్ నేషనల్-పోటీలలో చతికిలబడి-సిరీస్ వదులుకున్న టీము వేరు.
కపిల్‌దేవ్ ఇండియన్ సెలక్టర్లమీద అప్పుడే విరుచుకుపడ్డాడు.
‘‘ఒకరోజు’’ పోటీలలో చావుదెబ్బతిన్న తర్వాతనైనా- రెండేరెండు టెస్ట్ పోటీలున్నాయి అన్న సంగతి గ్రహించి- తగిన శ్రద్ధవహించాల్సింది’’- అంటారు సీనియర్‌లందరూ.
‘‘ముప్ఫయి సంవత్సరాల వయసుపైబడ్డాకా- కంటిచూపు కాస్త దెబ్బతింటుంది. కొహ్లీ ‘లెజెండే’కానీ, వయసు చెడ్డది. ఈ విషయం గ్రహించి, తిన్నగా వచ్చే బంతుల మీద అభ్యాసం చేయవలసిందే, విరాట్’’, అన్నాడు కపిల్.
వన్‌డే సిరీస్ పరాభవం ముగిసింది. ‘‘అప్పుడే -రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌లు లేని సంగతి గ్రహించి,’’ కె.ఎల్.రాహులనైనా టెస్ట్‌టీమ్‌లోకి ఎంపిక చేసుకోవలిసింది’’, అన్నాడు కపిల్ దాదా.
మనకి మూడురకాల క్రికెట్‌లున్నాయి. ‘ఇరవై-ఇరవై’ యాభై ఓవర్లు, ఆనక టెస్ట్‌మ్యాచ్‌లు. ఈ టెస్ట్‌మ్యాచ్‌లు లోగడ టెస్ట్‌మ్యాచ్‌లు అంటే, అయిదు రోజులు ఆడిన తర్వాత ‘డ్రా’అయిపోయేది. ‘‘తోమి, తోమి’’ జిడ్డాట ఆడి,-ఆడి- బాట్స్‌మన్ సెంచరీలు చేసుకోడమేగానీ, రుూ రకమైన స్పీడ్ క్రికెట్లు వచ్చాకా- కథ మారింది- సాధారణంగా టెస్ట్‌పోటీ- నాలుగురోజుల దాకానైనా సాగటం లేదు. అది గమనించి కొంతమంది అయిదురోజుల పోటీని- నాలుగురోజులకి ‘కుదిద్దామని’ అంటే- మన వాళ్లు గోలగోల చేశారు. ‘‘ఎర్ర బంతితో ఆడటం మనవాళ్లకి అంత బాగారాదు’’, అన్న సాకు చెప్పిన వాళ్లకి- అసలు, క్రికెట్ బంతి ఏదైనా ‘పిచ్’ స్వభావం ఏమైనా- దానిమీద, ఆడటమే- ‘ఆటగాడితనం’. అంతేగానీ, నీకోసం ‘పిచ్’లు, వాతావరణం టైలర్ మేడ్‌గా ఎవ్వరూ యివ్వరు- అని తెలియాలి...
నాలుగు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 38 పరుగులు మాత్రం చేయగలిగిన నాయకుడు- టీమ్‌మేట్స్‌ని మాత్రం ఏమి అనగలడు? పైగా- కొంతమంది ‘లాడ్‌లా’ అయిన ఆటగాండ్రకి ఛాన్సు యివ్వాలంటూ- బి.సి.సి. ఛైర్‌మాన్ సౌరభ్ గంగూలీ సిఫార్సు ఒకటి. అసలు రుూ ‘‘టూరు’’, ‘పంత్’కి ప్రాక్టీసు యివ్వడానికి చేశారా? లేకపోతే, ‘పంత్’నీ, ఫృధ్వీనీ- ‘నభూతో నభవిష్యతి’ టైపు ప్లేయర్స్ అనుకున్నారా? వృద్ధిమాన్ సాహా వున్నాడు. రెండో టెస్ట్‌లోనైనా, ఆడించాలి- అని చీఫ్‌కోచ్ రవిశాస్ర్తీకి తెలియదా? కొన్ని ‘‘బ్రాండ్ నేమ్స్’’వుంటాయి. క్రికెటర్లు కొందరుంటారు. వారి పేర్లు చెబితేనే, ఎదుటి టీముకి చెమటలు పడతాయి. మనకున్న ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఒక లెజెండ్. ఇన్నింగ్స్‌ని మొదటి బంతి విసిరి ప్రారంభించగల ‘‘కాన్ఫిడెన్స్’’ వున్నవాడు- కారణాలనేకం- అతణ్ని కేవలం టెస్ట్‌లకే పరిమితం చేశారు... అది అలా వుంచండి...
సరే, న్యూజిలాండ్‌లో తొలి టెస్ట్‌కి 90 పరుగులు యిచ్చి మూడే వికెట్లు తీశాడని- అతణ్ని డ్రాప్ చెయ్యడం ఎందుకు? వృద్ధిమాన్‌ని- ‘వృద్ధుడివి’ అన్నట్లు ప్రక్కన కూర్చోబెట్టి-మళ్లీ ‘‘పంత్‌బాబు’’కి ముద్దులు పోస్తూ ఆటలోకి దింపడం ఎందుకు? జడేజా, - అశ్విన్‌లు యిద్దరూ ఒకేసారి ఆడే విధంగా టెస్ట్ టీముని నిర్మించుకోడం కష్టమా? ఇషాంత్‌శర్మతో వున్న సమస్యే యిది. సుడిగాలి లాగా బౌలింగ్ చేస్తూనే- అకస్మాత్తుగా మోకాలో, అరికాలో విరిచేసుకుంటాడు. తొడ నరాలు బిగిసిపోతాయి. ఇంక, బూమ్రా చూస్తే ఉత్త ‘కాగితం పులి’ అయిపోయాడు... బూమ్ పోయింది. రా మిగిలింది!
కపిల్‌దేవ్ అన్నట్లు ముప్ఫయి దాటాకా- స్పీడ్ బ్రేకర్‌లుంటాయి. ‘’‘స్పీడు’’కి శరీర దారుఢ్యమే స్పీడ్‌బ్రేకర్లు వేస్తుంది.
న్యూజిలాండ్ బౌలర్లతో పోల్చి చూడాలి. మన బూమ్రా, షమీలను. చివరి వికెట్‌లు నొల్లేసుకుని బోర్డుమీద- నాలుగో, అయిదో లెక్క చూపెడితే చాలదు. మొదటినుంచీ టెస్ట్ పోటీలో (ఇషాంత్‌శర్మ అందుకు తగును. కానీ ఫిట్‌నెస్ ప్రాబ్లెం) ఓపెనింగ్ పెయిర్‌ని విడగొట్టడం ముఖ్యం. జస్‌ప్రీత్ విషయంలో ఒన్‌డే పోటీలకు తప్ప టెస్ట్‌లకు కొంతకాలం అతణ్ని దూరం చేయాలేమో? చాలా ఘోరంగా వుంది. పూజారా, రెహానా, కొహ్లీలు ఆడలేకపోవడం-
సీనియర్లను కూర్చోబెట్టి-బోర్డు-బాస్‌ని సంతోషపెట్టడంకోసం ‘కుర్రకారు’ని ఆడించడం- యిలాంటివి టెస్ట్‌పోటీలకు పనికిరావు. మనకున్న పేరునీ, ర్యాంకునీ కాపాడుకోవాలీ అంటే చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ, బోర్డు బాసులు,-కొత్తగా అప్పాయింట్ కాబోయే సెలక్షన్ ‘కమిటీ’లు- అంతా కలిసి, తలలు ఏకంచేసి, శ్రమించి టీముని ఎంపిక చేయాలి...
ఇండియా ఒక్క టీములాగా రాణించింది నిన్నటిదాకా. ఆ పేరు నిలబెట్టుకోవాలి. ‘ట్వంటీ-ట్వంటీ’ - ప్రపంచ టీముల ఎంపిక ముందు, చాలా యోచన చెయ్యాలి. వ్యక్తిగత ప్రతిష్ఠలు, పంతాలు ప్రక్కనబెట్టాలి...
‘‘టూ మచ్ పేంపరింగ్ స్పాయిల్స్ ది గేమ్!’

veeraji.columnist@gmail.com 92900 99512