వీరాజీయం

ఇంతలింత కౌగిలింతలు... ‘నమస్తే ట్రంప్’కి జేజేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హవ్‌డీ మోడీ!’’ సంబరానికి అమెరికా అధ్యక్షుడు నేరుగా వచ్చి- ప్రోటోకాల్‌ని కూడా ప్రక్కనబెట్టి- ముందువరసలో- మంచి బాలుడు లాగా కూర్చున్న దృశ్యం యింకా చాలామందికి గుర్తున్నది అనుకుంటాను. దానికి వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్‌దాస్ మోడీగారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌గారికి- ఉక్కిరిబిక్కిరి చేసేసినంత అద్భుతమైన సన్మాన సత్కారాలందేయి. ‘‘వాళ్లిద్దరి ‘కెమిస్ట్రీ’ అంతగా కలిసిపోయింది’’, అన్నాడో సినిమా నటుడు. అయితే, రుూ యిద్దరు నాయకులూ తమతమ ‘‘పాత్రల’’లో నటించలేదు. ‘‘జీవించారు!’’ ఇది మరపురాని యాత్ర. నా హృదయంలో ‘ఇండియా’కి ఓ ‘ముక్క’ అలా తీసేసి, అట్టేపెట్టి వుంచుతాను’’ అన్నాడు- ట్రంప్ మహాశయుడు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తీసుకురావడమే కాదు, అతిపెద్ద స్టేడియమ్ ‘మోతేరా’లో యిచ్చిన ఘన సత్కారాలకు మురిసిపోతూ- ట్రంప్ దొర లక్షా పాతికవేల మంది జనాలున్నారనుకుంటాను’’, అన్నాడు. పైగా- ‘‘నేను, ‘మోదీ’ అన్నప్పుడల్లా వాళ్లు ఎక్కువగా మురిసిపోయి- రుూలలూ, చప్పట్లూ వేసేస్తున్నారు’’ అని కూడా మురిసిపోయాడు.
‘‘ట్రంప్’’కే గిలిగింతలు ఇండియన్ పి.ఎమ్స్ హగ్గింగ్స్’’- అన్న సరదా మాట వాసికెక్కింది. ‘‘ఔనండీ! ఆ యిద్దరి ‘‘కౌగిలింత లింతలంతలు’’- అంటూ మురిసిపోయాడో అభిమాని. ‘‘మేం యిద్దరం గడిచిన ఎనిమిది మాసాల వ్యవధిలోనే- అయిదుసార్లు ఆత్మీయంగా కలుసుకున్నాం. తెలుసా?’’ అంటూ మోదీగారు- ట్రంప్‌గారి మీద ప్రశంసలు చేతిలో చెయ్యేసి, గుంజుతూ మరీ చెప్పారు. ట్రంప్ దొర ‘షోలే’ సినిమాని కోట్ చేశాడు. ‘‘ఏ దోస్‌తీ హయ్ నహీ... ఛోడేంగే! ఛోడేంగే దమ్ మగర్ దోస్‌తీ, న ఛోడేంగే’’- అన్న పాట- ధర్మేంద్ర, అమితాబ్‌బచ్చన్‌ల మీద చిత్రీకరించారు. కొంతమంది కార్టూనిస్టులు రుూ మాటల ప్రేరణతో చిత్రాలు గీశారు కూడా.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక- ‘‘్భరత్‌ను అమెరికా ప్రేమిస్తుందీ,’’ అంటూ రాసింది. అవును మరి! అంతెత్తు దూకుడు మనిషి, అమెరికన్ ప్రెసిడెంట్- మోదీని ఆలింగనం చేసుకుందికి వీలుగా- యిలా ముందుకి చాలాసార్లు వంగాడు. ఆమాటకొస్తే ఇండియా, అమెరికాను ప్రేమిస్తోంది- అంటే, మోదీగారి ‘ఉవాచ’గా చెప్పాలీ అంటే- మా యిద్దరి రుూ స్నేహం రెండు దేశాల ప్రజానీకం మధ్య పరిఢవిల్లిన అనురాగం’’- అనాలి.
చూడండి- ఎవర్నైనా మనవాళ్లని కదపండి- విద్యావంతుల యింటికొకడు- కొడుకో లేక కూతురో అమెరికాలోనే వుంటారు. ‘‘స్టేట్స్‌లో వున్నాడు, మావాడు లేదా, మా అమ్మాయి’’ అంటూంటారు ఎంతోమంది- పేరెంట్స్ హోదాలోవున్న సీనియర్ సిటిజన్‌లు. కొందరు అమెరికా యాత్రలు ఏటా చేస్తూంటారు. ట్రంప్‌గారు చమత్కారంగా- వ్యాపారం దగ్గర మీ ప్రధాని- ఫ్రెండు కాడు. గొప్ప గడసరి’’- అన్నా వాళ్లిద్దరూ- పరస్పరం నొప్పించక తానొవ్వక- రెండురోజుల అమెరికా అధ్యక్షుని సకుటుంబ పరివారం- జేగీయమానంగా ముగిసింది.
మూడు ఒప్పందాలు జరిగాయి. అవగాహన పత్రాల మీద నిశానీలు పడ్డాయి.. అయితే, ఆశించిన వాణిజ్య బృహన్ ఒప్పందం ఒకటి జరగలేదు. అని, నిరాశావాదులు, ప్రతిపక్షాలూ అంటాయి, గానీ మోదీజీ రుూ యాత్రని అతి గడుసుగా నిభాయించారు. ఇస్లామిక్ టెర్రరిజమ్‌ని అణిచివేయాలి అన్న పదప్రయోగం మనవాళ్లకి ఎంతో తృప్తినిచ్చింది. మానసిక ఆరోగ్యం- డ్రగ్స్ వాడకం నివారణలో భద్రత-వగైరాలను ప్రక్కనబెట్టింది. చాలా -‘ఎమ్.ఓ. యూ’-లు అనగా అవగాహనోప్పందాల మీద కొత్త పెన్నులతో సంతకాలు చేసి- ఆ ‘పెన్ను’ని, యిలా విరిచేస్తారు. అలాగే వాటిలో కొన్ని అటకమీదికెక్కుతాయి. కానీ, రుూ యాత్రలో ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి, దేశభద్రతా వ్యవహారాలకీ సంబంధించి మూడువందల కోట్ల డాలర్ల (త్రీబిలియన్ ఎగ్రిమెంట్) ఒప్పందం మాత్రం పక్కాగా జరిగింది. అభినందనీయం! ‘‘మూడురకాల యుద్ధ హెలికాఫ్టర్‌ల సప్లయ్ ఇండియాకి చేస్తాం’’, అని ట్రంప్‌గారు హామీ యిచ్చారు.
‘వాషింగ్‌టన్ పోస్ట్’ రుూ సత్కార సంబరం మీద రాస్తూ- రుూ మీటింగ్ రుూ యిద్దరి నాయకుల పరస్పర ‘డబ్బా’కి పనికొచ్చింది-’’ అంది. అయితే మోదీగారి గడుసుతనం మాత్రం బహుధా ప్రశంసనీయం. గుజరాత్‌కు తీసుకుపోయాడు ట్రంప్ దొరని- పైగా- గాంధీగారి ‘ఆశ్రమం’ చుట్టూ త్రిప్పాడు. మనలో మనమాట- కొంతమంది ‘్భక్తులకు’ రుూ సహస్రాబ్ధి- ‘శాంతిదూత’ అయిన మహాత్ముడంటే ‘ఎలర్జీ’ వున్న భక్తులకు తమ శిఖరాగ్ర నాయకుడు- అమెరికన్ అధ్యక్షుని చేత- నీరాజనాలు, నివాళులూ- శ్రద్ధాంజలి, పుష్పాంజలులూ గట్రా చేయించడం అన్నది మ్రింగుడు పడలేదేమో గానీ- ట్రంప్ దంపతులకు- సబర్మతీ ఆశ్రమంలో- తన్మయులై ఆశ్చర్యచకితులై కాలం గడిపారు.
వెనుకటికి అధ్యక్షుడు ‘ఒబామా’ ఇండియాకి వచ్చినప్పుడు అసలు, ‘‘గాంధీగారి బొమ్మను నేను పర్సులో పెట్టుకు తిరుగుతాను’’- అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ‘‘చెడు అనను- చెడు వినను- చెడు కనను’’ అన్న బొమ్మకి రుూ దంపతులు ముగ్ధులైపోయారు. నోబెల్ బహుమతి గ్రహీత అయిన పెరల్.ఎస్.బక్.గారు- ‘‘గాంధీజీ ఒక చెక్క చక్రం- చరఖా పట్టుకుని త్రిప్పి- రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి చరమగీతం పాడేడం’’టూ రాశారు. ఆ ‘చరఖా’ని (కాంగ్రెస్ వాళ్లు మరిచిపోయిన ఆ రాట్నాన్ని) అమెరికా అధ్యక్ష దంపతులు ‘యిలా’ త్రిప్పి- ‘‘తరించాం’’ అన్నట్లు సంతోషాన్ని వ్యక్తంచేశారు. అక్కణ్నుంచి- ‘‘వాహ్! తాజ్!’’ అంటూ ఆగ్రా వెళ్లారు. ‘‘అందరూ కొలను ఎడమ ప్రక్కనుంచి లోనికి వెళ్తారు. కానీ, మేము కుడిప్రక్కనుంచి పోయి దర్శిస్తాం’’ అంటూ చూశారు- మురిసిపోతూ...
ఢిల్లీలో రాష్టప్రతిగారిచ్చిన ఘన స్వాగతానికి ‘్ఫదా’ అయనారు. మోదీ, ట్రంప్‌లు ఛాన్సు దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకోడం- ట్రంప్ దొరగారి అందాల భార్య- పడుచు భామ- ‘మలేనియా’గారి పెదాల మధ్య- సన్నని చిరునవ్వును నిలబెట్టింది.
అంతా బాగుంది గానీ, అవతల ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని చాంద్‌నగర్, భజన్‌పురి, బ్రిజ్‌పురి, జాఫ్రాబాద్, మవుచోపుర్ లాంటి ప్రాంతాలలో భీషణ హింసాకాండ చెలరేగింది. దహనకాండ, దౌర్జన్య విధ్వంసకాండ చెలరేగాయి ఆస్తినష్టం సరే... ఒక పోలీసు ఉద్యోగి సహా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఒక్క రెండురోజులు సి.ఏ.ఏ. అనుకూల ప్రదర్శకుల్ని కట్టడిచేస్తే బాగుండేది, అమిత్‌షాగారు’’ అని అన్నారు పరిశీలకులు. సీఏఏ ప్రతికూల వర్గాలు- సీఏఏ అనుకూల జనాల మధ్య సంకుల సమరం- భయంకర దౌర్జన్యకాండ అదుపు తప్పాయి.
ఎమ్.ఐ.ఎమ్. నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ- ఈ ఘర్షణ ‘ప్రో’ సీఏఏల- పని అన్నట్లు ధ్వనిస్తూ- ‘‘సైన్యాన్ని పిలిచి అదుపు చేయరాదా?’’ అని ట్వీట్ చేస్తే భాజాపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి - ఇదంతా సీఏఏ ప్రతికూల నిరసనకారుల దాడియేనన్నట్లు మాట్లాడి, సైన్యాన్ని పిలిచి, అదుపుచేయరాదా? అని ట్వీట్ చేశాడు. అవ్వపేరే ముసలమ్మ అన్నట్లు...
‘‘ఇది కాదు పద్ధతి’’ అని హోంమంత్రిగారికి, సుప్రీంకోర్టు అయిన చెప్పరాదా?’’ అనుకున్న కొందరు శాంతి కాముకులకు దీనిమీద సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది అన్న వార్త- వూరటనిచ్చింది.
ఇటువంటి అపశ్రుతిని- ప్లే అప్ ఫ్లేర్ కాకుండా చూసిన- ఆమ్ జనతాకి నమోవాకములు’’ అంటూ ట్రంప్ దొర సుహృద్భావ పర్యటనకి జేజేలు చెప్పాడు సామాన్యుడు, ఎందుకంటే ఇది మరెక్కడికీ వ్యాప్తిచెందలేదు కాబట్టి.
‘‘లెట్ దేర్ బి లవ్ అండ్ పీస్! ఓ.. గాడ్!’’

veeraji.columnist@gmail.com 92900 99512