వీరాజీయం

జంటనగరాలు ఇంకా బిచ్చగాళ్ల స్వర్గమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత సమాజం సాధ్యమేమో కానీ, చెత్త రహిత వీధులు, యాచక రహిత జన్‌క్షన్లు, గోతుల రహిత రోడ్లు సాధ్యం కాదు. ఆ మధ్య గోవా ముఖ్యమంత్రి ముష్టివాడి వాసన లేకుండా తన గోవాని చేస్తానని అసెంబ్లీలోనే మాట ఇచ్చాడు కానీ -అక్కడైనా అది సాధ్యమైనదాని? మనదాకా అట్టి శుభవార్త రాలేదు.
మావాడు ఒకడు ఉన్నాడు-వాడికి ఏ జాబు సూటబుల్ కాదు-అది మన ‘లెవల్ కాదుసార్’ అంటాడు- ‘సింహము జీర్ణ తృణంబు మేయునే’ స్థాయిలో మొహం పెట్టి- ‘మరి ఆలస్యం చేస్తే చౌరస్తాలో ముష్టి ఎత్తుకోవడానికి చోటు మిగలదు’-అని వాళ్ల మేనమామ మేళ మాడాడు. ఆ మాట అనవద్దు-‘కాదే జన్‌క్షనూ ముష్టికి అనర్హం’-చెప్పాడు యువకుడు-పోయినేడాది ఇదే జూన్ నెలలో యాంటి బెగ్గింగ్ ఉద్యమం లాంటిది కొత్త కార్పొరేషన్ హుషారుగా చేపట్టింది. ఉదార సేవ చేసే ఎన్జీవో సంస్థల సాయంతో ముష్టివాళ్ల జనాభా లెక్కలు తీయించి గుండెలు బాదుకున్నంత పని చేసింది. అందులో ‘నేను సైతం శ్రమదానమొక్కటి రెండుసార్లు చేశాను, సర్వేలు చూశాను’ అని చెప్పాడు మేనల్లుడు. ‘పాపం అనాథలు అంగ వైకల్యంతో సతమతవౌతున్న దీనులు. వంటినిండా సిగ్గు కాపాడుకోవడానికి కూడా గుడ్డకి నోచని అభాగ్య యువతులు’’-మేనమామ కొంచెం నటుడు-నటన ప్రదర్శిస్తూ బోలెడు జాలి పడిపోతున్నాడు.
పగలబడి నవ్వాడు ‘సర్వే’శ్వరరావు. నటనా? వేలాకోలమా/కూర్చోబెట్టి మేపే తల్లిదండ్రులు వుంటే, అల్లాగే నవ్వుతూ ఉంటావురా అబ్బాయి’. కోపం నిజం కోపమే అనుచుకుంటూ-‘తగు మామా తగ్గు,-సినిమా డైలాగులు వొగ్గకు-ముష్టివాళ్లు యాభై వేల మంది దాకా వున్నారు కాని అంటే ప్రతి నలుగురికి ‘ఒక బెగ్గర్ని దత్తత తీసుకోవచ్చున్’ అన్నమాట.
‘కాని-ఎవరూ దత్తతకి ముందుకి రాలేదు అంటావు? ఔనా?-క్రికెటు స్టార్లు, వెండితెర వేల్పులు ఎందరో గలరే? ఈ పవిత్ర భారతదేశంలో...నీ మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారం బాపతు లెక్చరు ఆపు మామ-జంటనగరాలను పంచుకుని-జంక్షన్లను దత్తత తీసుకుని, హాయిగా ముష్టి సామ్రాజ్యం స్థాపించి-రాత్రికి నిత్య అత్తరు దీపాలు వెలిగించగలిగిన మాఫియాలున్నాయి సిటీలో...’
ఇప్పిన నోరు మూస్తే కాని మూతబడలేదు మహానటుడు జాలిగుండె గల ఆ దీనబంధుడికి. వాళ్లంతా నిజం ముష్టివాళ్లు కారు దొంగముష్టివాళ్లు-మహానటులు-మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు యాచన కూడా ఒక వృత్తి అని. మంచి లాభసాటి వృత్తి వదులుకుని-పగటి కష్టం తీరేలాగా రాత్రికి మందు విందు పొందు, అందుకంటూ ఉండే బోగస్ యాచకులే తొంభై ఎనిమిది శాతం ఉన్నారట! మన నగరాలేవి చూసినా కొంచెం మోతాదు తేడాలో భయంకరమైన ట్రాఫిక్ కులకులలాడుతు వుంటుంది. అడుగడుగునా రెడ్ లైటుగ్రీను లయిట్ల మధ్య నలిగిపోవురా నీ జీవితం ఓ వాహన చోదకా! అని ఓ ముష్టి వాడి పాట పెట్టి కాదే చౌరస్తా ముష్టికి అనర్హం అంటూ వీడియో తీసి చూస్తే తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీసులే ఆ మధ్య అరవై అయిదు రద్దీ జంక్షన్లలో 500 వందల మంది దిక్కుమాలిన వృద్ధ మహిళలని అనాథ బాలల్ని అతి దయనీయమైన స్థితిలో అడుక్కుంటున్నట్టు చూసారు. కానీ వాళ్లంతా తాము అడుక్కున సొమ్ములు పట్టుకపోవడానికి లేదు. వీళ్లని తెలవారుతు వుండగానే భయంకర మేకప్‌తో తెచ్చి అక్కడ కూర్చోబెట్టి మాఫియాలు-అదే ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్న ముఠాలు ఎన్నో ఉన్నాయి. మా అమ్మ అనో మా నాయనమ్మ అనో చెప్పి వీళ్లు ముసిలాళ్లని క్లెయిముచేసి ఎత్తుకు తీసుకుపోతారు. మా సొంత పిల్లలు సార్ అంటారు. వీళ్లకి డిఎన్‌ఏ టెస్టులు చేయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది పోయినేడాది కాని, ఎన్ని తంటాలు పడ్డా ముష్టివాళ్ల స్వర్గం కొనసాగుతునే ఉంది. ఇదంతా, ఒక రకంగా ఫ్లాష్ బ్యాక్.
బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా -‘యాచకులకు పైసలు వేసిన వాళ్లని శిక్షిస్తామని హెచ్చరించారు అధికారులు. కానీ ఎలాగండి బాబూ-హైదరాబాదు నిండా చౌరస్తా చౌరస్తాకి, స్కూటరు, ఆటో ఏదైనా ఓ కునుకు తీసి లేవాలి కదా? కారు డోరు తట్టి మరీ డిమాండ్ చేస్తాడు లేదా చేస్తుంది- ఒక ముష్టి శాల్తీ.
పోలీసు తన కెమెరాతో హెల్మెట్టు లేని వాళ్లకి ఫోటోలు తీస్తాడు కానీ చెయ్యిజాపి ఇస్తావా? చస్తావా? అని బెదిరిస్తున్న ముష్టిబాబుని ఏమీ చెయ్యలేడు. ‘ముష్టివెధవలకి కూడా సెల్‌ఫోనే’ అందో జీన్‌గాళ్ బాధగా తన కారు అద్దం మరకలపైవు చూసి సహించలేక తలుపు దించి- ఉరిమింది. ‘ఏం పోరి? గెందీ సంగతి? నాకాడత ఆధార కార్డి వుండదీ తెలుసా? ‘ముష్టిదీ’-అని ‘బోల్రాది’ (అనకూడదు)-బెగ్గర్ లేడీ అనాలె-ఏక్ దస్ నోట్ నికాల్..’ అన్నదా యాచక యోధ. అంటే ఫైన్ వేసిందన్నమాట! తన సెన్టిమెంటు దెబ్బ తిన్నదన్న మాట...
‘వీళ్ల కోసం కార్పొరేషన్లు ‘హోం’లు కట్టి-బజట్లు కేటాయించి పోషిస్తామంటే ఎందుకు వీళ్లు అక్కడికిపోరో?- ఓ సైకాలజీ ప్రొఫెస్సరు, ఆటోలోనుంచే ఈసడించాడు- ఆటోవాలా నవ్వేడు వేదాంతిలాగా మనకి ఎన్నో తెలియని జీవనసత్యాలు చెప్పగలరు ఆటోవాలాలు..‘అరే, సాబ్-దీనికి రాత్రి అయ్యేపాటికి మందు కావలె-అర్థం గాలే?-దాని ‘దందా’ పగలొకటి రేతిరికి మరొకటి-నువ్వు షెడ్లో పెట్టి బంద్ చేస్తే ఆగుద్దా సాబ్?-
ఔనుట- ఒక కిరాయి యాచక బాలిక లేదా బాలుడు మన సిటీలో 500 రూపాయలు ‘చీకతడే’లోగా సంపాదిస్తారుట. ఇక పెద్ద బిచ్చగాళ్లకి ఎంత ఆదాయమో ఊహించండి. కాగా నిజమైన, నిర్భాగ్యులు రెండు మూడు శాతం ఉంటారు. వీళ్లకి కార్పొరేషను సాయం చేసినా బెట్టర్, ఐతే మిగతా దొంగబిచ్చగాళ్లను ఎలా అదుపు చేయాలి? అన్నదే సమస్య. దీనికి మున్సిపాలిటీ ఒక్కటేకాదు పోలీస్, రెవిన్యు వగైరా శాఖలు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా సమష్టిగా ఆలోచించాలి. బెగ్గర్స్-మాఫియా పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చి ఇక్కడ బెగ్గింగు బిజినెస్సు చేస్తోందట! అంటే ఇది జీవకారుణ్య సమస్య-పాపపుణ్యాల మీమాంస కాదు-సంఘ పీడ అన్నమాట! తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టు ‘గొలుసు తెన్పుడుగాళ్ల’ని పట్టుకుంటారా? జేబుదొంగలనే పట్టుకుంటారా? ఘరానా యాచక ముఠాలనే కంట్రోలు చేస్తారా? లేక వివిఐపి బందోబస్తుకే చస్తారా?’ సనిగాడో రిటైర్డ్ సబ్.
ఆడపిల్లల్ని-అడ్డమైన చెత్త అశ్లీల వెబ్‌సైట్లు చూసి చెలరేగి వేదిస్తున్న దుష్టులకోసం షీ టీములు పెట్టినట్టు-అడుక్కుతినే ముష్కర గాంగుల మీద కూడా ఒక ‘హీ-టీముని’ వెయ్యకూడదా? అంటోంది స్కూటర్ మీద చౌరస్తా దగ్గర ఆగి ముష్టివాళ్లు మీద పడతారేమో అన్న భయంతో బిక్కు బిక్కు చూపులతో గొణిగింది ఓ వర్కింగు లేడీ. హైదరాబాద్‌లో తార్నాక ఫ్లైవోవర్ దగ్గర సిగ్నల్స్ తీసిన కొత్తలో జనం మరో కిలోమీటరు అదనం అని దుఃఖ పడ్డారు కానీ అంతా ఇప్పుడు అంటున్నారు ముష్టివాళ్ల కబ్జా అయినా తగ్గింది అనుకుంటున్నారు కర్సారులు. దుఃఖం ఏమిటంటే యాచకులకు ‘లాస్’ వచ్చిందట. ఇక్కడ సిగ్నల్స్ పెట్టండి అని ధర్నాలు చేయలేదు అంటే మనం లక్కీ.
ఇదేదో మన జంటనగరాలకి మన బెజవాడకి వైజాగ్కి నిజామాబాదు, వరంగల్లులకి పరిమితం కాదు. ముంబయి, ఢిల్లీ కలకత్తాలకి, ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లో ప్రధాన నగరాలకి కూడా వున్న అచిత్రవిచిత్ర దొంగముష్టి రుగ్మతే ఇది. అవీ-అవీ ఎన్నోగా మనం చూసాము చూస్తున్నాము కానీ దీని మనకేమి తృప్తి? ఓదార్పు ఉంటాయి? ‘చెత్త ఫ్రీ’ సొసైటీ, నగదు ఫ్రీ సమాజంలాగా, ‘కర్రప్షన్ ఫ్రీ’ పాలన లాగే బిచ్చగాళ్ల దాష్టీకం లేని ‘ఫ్రీ’సిటీలు కావాలి. నమో నమో అంటున్నారు సిటిజెన్స్, ఔనా? కాదా?
-లెట్, బారో ఆర్ స్టీల్ బట్ నాట్ ‘ఫేక్ బెగ్గింగ్’!