వీరాజీయం

‘డేరా’ ఇంద్రలోకంలో హన్‌ప్రీత్ ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు వేయి ఎకరాల్లో అదో ఇంద్రలోకం.. మాయల పకీరు గుర్మీత్ రాం రహీమ్ నిర్మించిన భూమిమీదే పాతాళ మాయాలోకం చూస్తున్నాము.. ‘బాబా’ అనే పవిత్రమైన మాట.. కొన్ని కోట్ల మంది ఉపయోగించే పదాన్ని ఈ నరరూప రాక్షసునికి పేరు చివర వాడడం ఇష్టం లేదు. అందుకనే డేరా గుర్మీత్గానే వ్యవహరిద్దాము. వృకాసుర బకాసుర భస్మాసుర హిరణ్య కశిప లాంటి మాటలేవీ ఈ మాయల పకీరు దుష్ట భోగ భాగ్యాదులకు చాలవు. 2009 నుంచి డేరాసురుడు విచారణ ఎదుర్కొంటున్నా ఈ మాయలోకంలో పల-జేమ్స్ బాండ్ సృష్టికర్త ఇయాన్ ఫ్లెమింగ్ నవల డా.నో లాంటి వింతలు గుర్మీత్ మాయాలోకం ముందు బలాదూర్ అనిపిస్తాయి. ఇతిహాసాల్లో, కాశీమజలీ కథల్లో ఇటువంటి- దేవుడని చెప్పుకునే నరరూప రాక్షస లీలలు కానరావు. ఎట్టకేలకు హరియాణాలోని సిర్సాకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే మన నేలమీదే ప్రపంచంలో తొమ్మిదో వింతగా గగుర్పాటు కలిగించే ‘ఎమ్‌సిజీ’ మాయాలోకం మీదకి, అతన్ని భద్రంగా జైల్లో పెట్టి-కోర్టు ఆర్డర్‌తోనే ఇంచుమించు శత్రురాజ్యం మీద దండయాత్రకి (పరిసరాల్లో కర్ఫ్యూ పెట్టి మరీ) వెళ్లింది హర్యానా ఫ్రభుత్వం- అర్ధసైన్యాలు పోలీసు బలగాలు, పోలీసు జాగిలాలు, వీడియో గ్రాఫర్ల బృందాలు, తాళాలు పగలగొట్టగల హస్తలాఘవం వాళ్లు, కమెండోలు, బాంబ్ స్క్వాడ్స్, అంబులెన్స్‌లు ఇలా యుద్ధ రంగ అవసరాలన్నీ సమకూర్చుకుని-కూడా 70మంది సాక్ష్యులను పెట్టుకుని వెయ్యి ఎకరాల విస్తీర్ణం గల మరో మాయాలోకంలోకి విస్మయం, భయం, సంకోచం వెంటాడగా వెళ్లిన అనే్వషణా దళానికి లోపల ఒక స్వతంత్ర కుతంత్ర దౌష్ట్య సామ్రాజ్యమే ఎదురొచ్చింది. ఇంద్రలోకం, నరకలోకం రెండూ కలిపి అల్లిన ఒక-డేరా సౌదారాజ్యం లోపల పెద్ద స్టుడియోలు, స్టేడియం, ఏడు నక్షత్రాల హోటళ్లు, ఫిలిం స్టుడియో, సూపర్ స్పెషాలిటీ అంగ మార్పిడి ఆస్పత్రి, రింజిమ్లు, జలగర్భస్త రివాల్సింగ్ పానశాలలు, బజార్లు, దుకాణాలు, ఆడపిల్లల రహస్య స్కూళ్లు, కాలేజీలు.. అంతేనా? బాంబులను తయారుచేసే రహస్య ఫ్యాక్టరీ.. అదొక విశ్వామిత్ర సృష్టిలా వుంది. ఆ రాజ్యంలో ఏమ్మెస్జీ- అంటే దేవుడి దూత-(నేన్‌దే) హనీప్రీత్. అతని విడుదల కోసం జరిగిన వినాశక బీభత్సంలో 38 మంది వీర స్వర్గం చేరుకున్నారు, భస్మీపటలమైంది నగరం.
అతనిలోకంలో బాలనాగమ్మ నెత్తుకుపోయిన మాయల పకీరు మళ్లీ పుడితే? అతని స్వర్గ్ధామం ఎలావుంటుందో అల్లాంటి లోకం. అక్కడ ప్లాస్టిక్ కరెన్సీ డేరా సౌదా ముద్రలతో చెలామణి అవుతోంది. లోపల తాజ్‌మహల్, ఈఫిల్ టవర్ లాంటి భవనాలు వంటివి వున్నాయి. ఇంతటి వింత ఘోర మాయాలోకం, అధోజగత్ రాజ్యం, హత్యలు, మానభంగాలు మొదలు చివరికి శవాలతో వ్యాపారం దాకా సాగిపోతున్నా- నోబడీ నోజ్! జనం తుమ్మినా దగ్గినా పసిగట్టగల యంత్రాంగం వున్నది మళ్లీ. కానీ రెండోకంటికి తెలియదు అన్నట్టుగా ప్రవర్తించింది ప్రభుత్వ యంత్రాంగం. చివరికి, డేరాసుర గుర్మీత్‌కి ఎదురు తిరిగిన వాళ్లని చంపి శవాలను స్వయంగా సింగ్ తనే పాతిపెట్టి మొక్కలు నాటితే అవి చెట్లు ఐపోయాయి. గుహలో గుహగా రెండు స్వర్గ్ధామాలలో డేరా సౌదసింగ్-బృందావన్, ఇంద్రలోకం కట్టుకుని ఎంజాయ్ చేసాడు. రాష్ట్రంలో 117 నామ్‌చరణ్ కేంద్రాల ద్వారా అతని ఆటలు,పాటలు మూడు పూలు ఆరు కాయలుగా సాగి పోతున్నాయి. లోపల సినిమా స్టుడియోలు. అతనే హీరోగా నటించేవి ఉన్నాయి.
ది మెస్సంజర్, ది వారియర్ ఆఫ్ లయన్ హర్ట్, హింద్ కానా పాక్కో జవాబ్‌లాంటి ఎనిమిది సినిమాలు తీసాడు. అత్యంత ఆధునిక స్టుడియో-జలపాతం, హిమపాతం ఏది కావాలన్నా అందులోనే..దీనికి సూత్రధారి, దర్శకురాలు, నిర్మాత అన్నీ అతని ‘తనయ కాని తనయ’ హనీప్రీత్‌దే. ఆమె డైరీ ఒకటి దొరికింది. అందులో ఆమె విరహ కవిత్వం కూడా వున్నది. ‘హనీజీ, ఫైట్లు ఫీట్లు కూడా చేస్తుంది. ఏ పాత్రనైనా చేస్తుంది. ఇరవై ఒక్క రకాల పాత్రలు ధరించింది. జాకీచాన్ రికార్డుని హనీ ఎప్పుడో బద్దలు కొట్టేసింది అంటూ ఆమె ఊసెత్తితే చాలు చిలువలు పలువలుగా చెప్పి మురిసిపోతాడు డేరాసురసింగ్. ప్రస్తుతం నేతాజీకథ మీద ఒక బెంగాలీ చిత్రం తీద్దామని అనుకున్న హనీ జాడ తెలియడం లేదు. అసలు ఈ మాయలాడి- చిత్రాంగి- మన్‌మోహినీ ప్రస్తుతం మీడియా స్టోరీలకి హనీ (తేనె).. అతి ముఖ్య వార్తాఖని. నేపాల్, బర్మాలలో వెతుకుతున్నారు పాపం! ఇక్కడే ఎక్కడో వుంటుంది అని తెలియదా? గవర్నమెంటుకి-గుర్మీత్ని తప్పించే ప్రయత్నంలో వుందామె అన్నాడో డిటెక్టివ్ చిత్రాలు చూసే స్టూడెంటు. అసలు ఆమె దగ్గరే- మాయల పకీరు ప్రాణాలు చిలుకలో వున్నట్టు-గుర్మీత్ దేవుడి గుట్టుసహా ఎందరో హేమాహేమీల రాజకీయ బడాచోర్ల ప్రాణాలు (గుట్లు) కూడా ఉన్నాయి. రోహ్‌తక్‌లో సునేరియా బందిఖానాలో చేతులు నరికివెయబడ్డ కబంధుడి లాగ సిగ్గులేకుండా హనీ ‘హీ’ అంటు పెడ బొబ్బలుపెడుతున్న నర రూప రాక్షసుడిని ఎక్కడ తప్పించివేస్తుందో? అన్న భయంతో చస్తున్నారు. సునేరియా జైలు మీద అదేదో అతి పవిత్ర దేవాలయం శిఖర భాగం అయినట్టు- విమానాలు, హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో ఎగరకూడదు అన్నారు. అసలు రాం రహీమ్‌ల పేర్లు బద్నాం చేసేస్తూ పేరుపెట్టుకున్న ‘దొంగదేవుడు’-ఈ హనీ ప్రీత్‌కి లోగడ విశ్వాస్ గుప్తా అనే వాడ్నిచ్చి పెళ్లి చేసాడు. ఆనక వాడికి నెత్తిన టోపీ పెట్టి ప్రియాంకా తెజా అనే ఈ కిలాడీ మోహినిని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించి-హనీ ప్రీత్ పేరిట మాయాలోకంలోకి తెచ్చి వుంచుకుని అనధికార వారసురాలిగా పట్టంగట్టాడు. ప్రియాంకా డాన్సులు, పోరాటాలు, పాటలు కూడా చేయగలదు, చేయించగలదు. డేరాసురుడికి ఒక సుపుత్రుడు, ఇద్దరు కూతుళ్లు వున్నారు. అమిత్ ఫ్రీత్, చమన్ ప్రీత్ ఆ అమ్మాయిల పేర్లు. అంచేత లోకం కళ్లు కప్పడానికి (ఉత్తినే అదో సరదా) ఈమెని- హనీప్రీత్ చేసుకున్నాడు. వీడికి శిక్ష పడ్డ రోజున సైన్యం రావాల్సి వచ్చింది. అతని ‘గుహ’ అనబడే పాతాల నాగలోకానికి పోవడానికి సైన్యం రావాల్సి వచ్చింది. లోపల అతనికి రెండు గుహలు అనగా- భోగభాగ్య మందిరా సమన్విత జనానా లాంటి కాంపసులు రెండు వున్నాయి. ఒక గుహ (్భగమందిరం)లోనుంచి మరో గుహకి సొరంగ మార్గం కూడా వుంది. దూరం వున్న అమ్మాయిల కాలేజీని, అమ్మాయిల స్కూలుని కూడా ఇటీవల హనీప్రీత్ రెండో కంటికి తెలియకుండా డేరాసురుడికి మందిరం దగ్గరకు సొరంగం ద్వారా మార్చేసింది. కొన్ని వందలమంది అమ్మాయిలకి ‘ఎమేస్టి’ (దైవ దూత) సాక్షాత్తు అవతారపురుషుడే. అయినా మన గవర్నమెంటు ఇంత పిసరు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు.
చోద్యమేమిటీ అంటే, ఇంత జరిగినా కూడా, హరియాణా రాష్ట్ర క్రీడల మంత్రికి అదేదో రాసక్రీడలా అనిపిస్తోందేమో? ‘బాబా’ని లోన త్రోసేసారు కాని డేరా వున్నదిగా.. అక్కడికి వోట్లు అడగడానికి పోతాము అన్నాడు. మూయాలా? వద్దా? అటువంటి వాణ్ని. అదిసరే, అనుకున్నాంగా.. హనీప్రీతమ్మ అనే చిలుక చేతిలో ఎందరివ జాతకాలు వుండి ఉంటాయి? ప్రస్తుతం నకిలీ ఇంద్ర లోకాన్ని చూసి మూర్చపోతున్న మాజీ న్యాయమూర్తి, పోలీసులు, నాయకులు వగైరాలు అక్కడ డేరాలో వారి సొంత నాణేలుతో బాటు, కొత్త నోట్లు పాత కరెన్సీ నోట్లు కూడా చాలా పట్టుకున్నారు.
‘ఆ తెలిసెన్!’ అన్నాడు ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టు కావాలనుకున్న కుర్ర జర్నలిస్టు ఒకడు-పాత నోట్లు 99 శాతం తిరిగి బ్యాంకుకు వచ్చేసాయి కాని ఇంకా ఒక శాతం రాలేదు అన్నారుగా? ఏలినవారు.. అవి- ‘ఇక్కడ వున్నాయి’ అన్నమాట..’ అన్నాడు. ఇంత మంది ఇన్ని రకాలు స్కూపులు- ఆపరేషన్లు అవీ చేస్తున్నారే- ఒక్క జేమ్స్ బాండ్ కూడా ఇదంతా పట్టుకోలేదే? బిబిసి దగ్గర నుంచి లోకల్ చోటా బులిటన్ దాకా ఇప్పుడు ప్రత్యేకం అంటూ డేరాసురుడి లీలలు రంగురంగుల్లో పెట్టేస్తున్నారు. హనీప్రీత్‌ని జైల్లో తన బాస్-ఆమె మాటల్లో చెప్పాలీ అంటే-ఆమె సర్వస్వమూ అయిన గుర్మీత్‌సింగ్‌ను వదిలి ఇంకో దేశం పారిపోతుందంటే నమ్మలేము. దుక్కలాగ వున్నాడు పిడిరాయిలాగా-తిరిగి వస్తాననే అనుకుంటున్నాడు.
అంచేత-ఒకవేళ అతనికి విదేశీ లింకులు కూడా ఉంటే తప్ప-హనీప్రీత్ ఎక్కడికి పోదు-అఫ్కోర్స్, లోపల హెలిపాడ్ ఉన్నదేమో గానీ ఎయిర్పోర్టు లేదల్లె వుంది (ఏమో) డా.నో ల్లాంటి వాడు ఈ దగుల్బాజీ మాయల పకీరు. ఇంత జరిగాక వాడ్ని వాడు -దేవదూత అనుకున్నా-ఏదో పిచ్చోడైపోయాడు అనుకుంటాం గాని ఇంకా ఈ అవతార పురుషుడు ‘మహిమలను నమ్మే భక్తులు గలవాడు’ కనుక వీడతి చేతిలో -వోట్లు వున్నాయి అనుకునే మూఢ చిత్తులు చెత్త రాజకీయాల్లో ఉండడమే-హనీప్రీత్ పన్నాగానికి ఊతం ఇస్తాయి. ఆమె రెండు కార్లు మార్చింది. సొంత వూరు వెళ్తానని చెప్పింది. లోపల తాళాలు పగలగొట్టినా- పగలని రహస్య పేటికలు వుండవచ్చును. ప్రభుత్వం కాని ప్రభుత్వ ప్రతినిధులు కాని చోటా బడా ప్రతిపక్ష పార్టీలు గాని-ప్రకటనలు ఖండనలు గుప్పించడం లేదు. మానభంగాలకి, స్ర్తి జన అవమానానికి తిరుగుబాటు ఉద్యమం చేస్తాం అన్న శాల్తీలు ఏరీ?
డేరా లోపల భూస్థాపితమైపోయిన-గుర్మీత్ వ్యతిరేక అమాయకుల ఆత్మ శాంతికి కాని, డేరాసురుడి అరెస్టుకు బలి అయిపోయిన 38 మంది ఆత్మలకి కాని కొవ్వొత్తు యాత్రలు చేసే వాళ్లేరి? పొలిటికల్ పవర్ని రిమోట్ కంట్రోలుతో నడపగల మాఫియాలు బాబా ముసుగులో దాగిన నరభక్షకులు ఈ ధర్మభూమి మరియు కర్మ భూమిలో ఆదినుంచి ‘కీర్తనలు’ కడుతునే ఉన్నది. ఇటువంటి దుష్టులకు. డేరాసురుడి కథ అం తమైనదా? లేదా?
బివేర్ ఆఫ్ పొలిటికల్ మెనోవౌర్స్ ఈవెన్ నౌ!
*

veeraji.columnist@gmail.com