వీరాజీయం

‘బుద్దూ’గా తిరిగొచ్చిన సిద్ధూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహమేరా జీవితం.. పబ్లిసిటీయేరా పరమార్థం..’అని పాడు కుంటూ- కట్టుకతలు, పిట్టకతలు చెప్పుకుంటూ పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార సమరోహానికి తగుదునమ్మా అంటూ వెళ్లి వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిర్వాకం ఏమిటంటే- తనను పాక్ వెళ్లేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వాన్ని, తనకి మంత్రి పదవి ఇచ్చిన పంజాబ్ కాంగ్రెస్ పార్టీని కూడా- శుద్ధ ఈడియట్స్‌ని చేసి వదిలిపెట్టాడు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం అర్జంట్‌గా ట్వీట్ చేశాడు. ‘నేను సిద్ధ్భూయ్యాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. తను పాకిస్తాన్ కి శాంతి రాయబారిగా వచ్చాడు .. అతనికి పాకిస్తాన్ ప్రజలు అధ్బుతమైన ప్రేమాభిమానాలు అందించారు..’ అన్నాడు ఇమ్రాన్.
మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి అయన సిద్ధూ వినోద సంచలన భరిత ఇస్లామాబాద్ పర్యటనను మెచ్చుకున్నాడు. పైగా, అతనిపై దుమ్మెత్తి పోస్తున్న ఇండియన్లంతా ఉపఖండంలో శాంతికి అన్యాయం చేస్తున్నారు... శాంతి లేకుండా మన ప్రజానీకం బ్రతకలేరు.. అని కూడా ప్రవచించాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏకపాత్రాభినయం కపిల్‌షో లో ఒక ‘పూరకం’ -లేదా కాంప్లిమెంట్ గా జనాల్ని నవ్వించిందేమో.. గాని అతని ఇస్లామా బాద్ యాత్ర - ఏ విధంగా చూసినా ‘బ్యాడ్’ గానే ఉందని జన వాక్యం.. అందర్నీ మైమరిపించేసే- జోకర్ లాగ ప్రవర్తించిన -సిద్ద్భూయ్ ప్రవర్తన - అసలే కోతి, ఆపై అది కల్లు తాగింది.. అన్నట్టుగా చెలరేగిపోయాడు. పంజాబ్ నీరు అక్కడా ఇక్కడా ఒక్కటే- రావి నది నీరు అటు సగం, ఇటు సగం అన్నాడు. మన కల్చర్ ఒకటే, మన తిండి ఒకటే మన రక్తం ఒకటే అన్నాడు. ఏమేమో ఆశుకవిత్వం చెప్పేశాడు.. కాని పంజాబ్ లో ఒక ముక్క ఇండియాలో, మరో ముక్క పాక్‌లో ఉన్నాయన్న సంగతి మరిచిపోయి - ఎర్ర సముద్రం నీళళు నీలం చేసాస్తాను-లాంటి జోకులు చెప్పి జనాల్ని నవ్వించాడు.
మాజీ క్రికెట్ నేస్తాలు సునీల్ గవాస్కర్ , కపిల్ దేవ్‌లను కూడా ఇమ్రాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మనిపిలిచాడు. గవాస్కర్, కపిల్ లెజెండ్స్. సిద్ధూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి పంజాబ్‌లో మంత్రి అయినవాడు. ఎవరైనా పాకిస్తాన్‌కి పోవాలన్నా, పైగా ప్రొటోకాల్ నిబంధనలున్న ఇటువంటి సంబరాలకి పోవాలంటే.. దేశీయ, విదేశాంగ శాఖలు తలూపాలి. అంతేకాని, గడియకోసారి- నేను వ్యక్తిగత హోదాలో వచ్చానని, ప్రజా ప్రతినిధిగా వచ్చానంటూ సిద్ధూ జోకులు పంచాడు. -‘మావాడి పెళ్ళిలో నేను - అదేదో రాజ్ కపూర్ -ప్రేమలేఖలు - సినిమాలో లాగా - డ్యాన్స్ చేస్తాను.. మోళీ వేస్తాను అంటే చెల్లదు... ‘పందిట్లో పెళ్లవుతున్నాది.. భల్ విందవుతున్నాది.. నటనమే ఆడేదనూ ...’ లాంటి ప్రదర్శనలకి తావులేదు. నువవు అక్కడికి - వినోదబృందంతో వెళ్ళ లేదు... ఇమ్రాన్ పిలిచాడు.. పాత నేస్తం గా వెళ్లావు. దోస్తీ ఎంత గొప్ప దైనా దేశం కన్నా , దేశభక్తి కన్నా గొప్పదికాదు . ఎనిమిది మాసాలలో పదకొండు వందల సార్లు అక్రమ దాడులు చేసి.. మన జవాన్లను -పౌరులను పాక్ సైన్యం చంపేసిందని నీకు తెలుసు. కశ్మీరులో ఏమి జరుగుతున్నదో తెలియని అమాయకుడివా? ఉగ్రవాద మూకల్ని -్భతల స్వర్గం అయిన కాశ్మీర్ మీదకి తోలుతున్నదెవరో నీకు తెలియదా?
సరే.. ఆలింగనం- ఈ మధ్య కరచాలనం కన్నా ప్రాచుర్యంలోకి వచ్చిందే అనుకుందాం. మోదీజీ ఈ ఆలింగన కళను ప్రాచుర్యంలోకి తెచ్చి ఉండవచ్చును . అలాగే , కాంగ్రెస్ పార్టీ బాస్ రా హుల్ గాంధీ మోదీని కౌగలించుకుని ఆనక క న్ను గీటడం కూడా చేశా డు. అందుకుని నువ్వు ఆడుతూ పాడుతూ చాటంత మొహంలో కంచమంత నవ్వులొలక బోస్తూ -నేరుగా పాక్ సైన్యాధిపతి జనరల్ బాజ్వాని-అమాంతం - మురిసి పొంగిపోతూ- ఇలా గట్టిగా వాటేసుకుంటావా? .. ముసిముసి నవవులతో మురిసిపోతా? .. అదేమిటండీ ? ముత్యం దొరికినట్లు నాకు అవకాశం దొరికింది .. దాన్ని వొదులుకుంటానా? అని కూడా అన్నాడు సిద్ధ్భూయ్యా తన చర్యని సమర్ధించుకుంటూ. ఇండియన్ జవాన్ల రక్తంతో తడిసిన హస్తాన్ని లాంఛనంగా తాకి తప్పుకోకుండా అదేదో హ్యాట్రిక్ తీసుకునట్లు.. చెలరేగిపోదాం అన్నది ఒక రాష్ట్ర మంత్రి పాటించవలసిన ప్రొటో కాలా? ఇమ్రాన్‌ని వాటేసుకున్నా సందర్భంగా ఉండేది.. ప్రధానమంత్రి పదవీ స్వీకరామహోత్సవానికి-నిన్ను ఇండియన్ డెలిగేషన్ మెంబర్‌గ కూడా పిలవలేదు. ఓ బొకేను మన గవర్నమెంటు తరఫున తీసుకుపోయి ఇవ్వు- అని చెప్పిందా? నరేంద్ర మోదీ గవర్నమెంటు? సరే.. నీ ఆలింగనోత్సాహం పిదప -సిద్ధూ మహాశయా !- పంజాబ్ మంత్రివర్యా! రా! అంటూ నిన్ను తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టారు? .. ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి (‘పీఓకే’) అధ్యక్షుడైన పెద్ద మనిషి ప్రక్కన కూర్చోబెట్టారు.. మనం ఏ జన్మోలోనో చేసుకున్న పుణ్యం ఆదుకుంది లేకపోతే- సిద్ధూ భయ్యా ఆశుకవిత్వం చెబుతూ ‘పీఓకే’ అధ్యక్షున్ని కూడా- ‘ గురువు గారూ.. ఓమారు లేవండంటూ సీట్లో నుంచి లేపి -గాఢముగా -వాటేసుకొనే వాడే.. ఇది పాకిస్తాన్ మనలను అవమానం చెయ్యడానికి పన్నిన కుట్ర. సిద్ధూ ‘్ఫల్’ అవడానికి ఒప్పుకున్నా - మనం అందుకు సిద్ధంగా లేము. సీటింగు ఏర్పాటులో - ఇటువంటి అధికారికమైన -ప్రధాన ఉత్సవాలలో - దేశ హోమ్ శాఖ, విదేశాంగ శాఖలు ఎన్నో తర్జన భర్జనల తరువాత ‘ఆసనం’ ఏర్పాట్లు చేస్తారు.
కాకతాళీయం కాదు. పాక్ ఆక్రమిత ప్రాంత అధ్యక్షుని ప్రక్కన నేను కూర్చోను అని మనవాడు లేచి పోవాలి. అదీ దేశభక్తి. నిన్నుపిలిచింది మాజీ ఫ్రెండుగా- -మాజీ క్రికట్ ప్లేయర్ గానే. అటువంటప్పుడు.. నీ వెనుక వరస లో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు వసీం అక్రం ప్రభృతులున్నారు .. ఒక దోస్త్ గా వాళ లప్రక్కన నీకు సీటు కావాలని డిమాండు చేసి వెళ్లిపోవాలి గాని - ఒక రాష్టప్రతి ప్రక్కన నన్ను కూకో పెట్టండోయ్.. అని కపిల్‌షోలోలా దండోరా వేసుకోమని కాదు .. మరో సంగతి.. ఇది నీకూ, నీ దేశానికి ఘోరమైన కుట్రపూరిత మైన అవమానం అని తెలుసుకోకుండా -పాకిస్తాన్ జనరల్- తనకి శాంతి కావాలని నీతో అన్నాడా?.. కర్తారాపూర్ - గురుద్వారాపూర్‌ల మధ్య మూసేసిన దారి తెరుస్తానని హామీ ఇచ్చాడు గనుకనే సదరు పాక్ జనరల్‌ను వాటేసుకున్నాను- లాంటి కబుర్లు చెప్పడం- తెంపరితనమే గాని - దేశభక్తి కాదు. ఇరుగు పొరుగు దేశాల మధ్య శాంతికోసం చేసే కృషి కానేకాదు. పైగా, ఇమ్రాన్ ఖాన్ ఆ మధ్య- మీరు ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు నేను వేస్తాన్నాను అన్నాడని- సిధ్ధ్భూయ్ ఇలా ముందడగు వేశాడేమో... అని అన్నాడో.. కపిల్ షో ఫ్యాన్ .. భలే - సిద్ధూని ఇమ్రాన్ అన్నట్లు శాంతి రాయబారి గా పెట్టుకుంటే - మన పరువు సిరాబుడ్డీ లో మునిగిపోతుంది అన్నాడో స్పిన్ బౌలర్. పైగా, మన అమృతసర్, పాక్‌లోని లహోర్‌లు జంటనగారాలంట. వెర్రి కుదిరింది- రోకలి తలకి చుట్టమన్నట్లుంది. అందుకే, ముజఫర్‌నగర్‌లో సిద్ధూ పట్ల గౌరవ మర్యాదలు చూపెట్టాలని జనం సిద్ధమయ్యారు. పాక్‌లో అతని చేష్టలను - దేశద్రోహం నేరం కింద పరిగణించి శిక్షవెయ్యమని ఎఫ్‌ఐఆర్ పెట్టారు.. గడ్డిబొమ్మలు సిద్ధం చేసుకున్నారు. ఎందుకో తెలుసుగా? మన వికటకవి వరేన్యునికి కాంగ్రెస్ పార్టీ తలుపు చూపెట్టాలని ఎందరో అంటున్నారు.

సిద్ధూ భయ్యా ఈజ్ అవుట్ హిట్ వికెట్..!

వీరాజీయం..... సెల్: 92900 99512