వీరాజీయం

అసామాన్య జన విజయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది మరోసారి సామాన్యుడి విజయం! పద్మవ్యూహంలో నుంచి బయటపడ్డ కేజ్రీవాల్ ఘన విజయం అన్నారు కొందరు. ‘‘యిది షహీన్‌బాగ్ విజయం-’’ అంటున్నారు. ఏదిఏమైనా యిది డెమోక్రసీకి దక్కిన గెలుపు.
‘్ఫర్ ఏక్‌బార్ ‘ఆప్’కీ సర్కార్’- అన్నారు. అంటే ‘ఆమ్‌ఆద్మీ’ పరిపాలన (పార్టీ) యింకొకమారు అన్నారు భారతదేశ రాజధాని పౌరులు.. ఇది షాహీన్‌బాగ్ గెలుపు. ఇది అమానుతుల్లా విజయం. ఇది హిందూ ముస్లిం సయోధ్యకి సాక్ష్యం’’ అంటూ కొందరు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏది ఎలావున్నా విద్యావికాసం కోసం పాటుపడుతూ, రకరకాలుగా ఢిల్లీలో ప్రబలిపోతున్న ‘కాలుష్య విషం’లాటి వాటిని ఏకోన్ముఖంగా పోరాడే ఒక చిన్న ప్రాంతీయ పార్టీ- ఒక చిన్న ‘చీపురుకట్ట’ను- ‘జెండాపై కపిరాజు’-అన్న చందాన పెట్టుకుని కేంద్రంలో అత్యధిక మెజారిటీతో ‘నిరంకుశ’పాలన సాగిస్తున్న పార్టీకి ఎదురు నిలిచి పోరాడి, గెలిచింది! ఒక గొఱ్ఱె కొండను ‘్ఢ’కొన్నట్లు ఈ పోటీని ఎంతోమంది అభివర్ణించారు.
హనుమంతుడి ముందా కుప్పిగెంతులు? అన్నారు. మోదీషాలు ఏకమై అక్కడ శిబిరం వేసుకుని బైఠాయించి, వ్యూహరచన చేస్తూ గడిచిన అయిదారు వారాలపాటు సాగించిన పోరాటం- నిజంగా ఒక ‘వాల్’లాగా నిలబడ్డ కేజ్రీవాల్‌ను పడగొట్ట లేకపోయింది. పోయినసారి 2015లో 70 స్థానాలకి గాను 67 స్థానాలు గెలిచి- మూడే మూడు సీట్లు భారతీయ జనతాపార్టీకి వదిలిపెట్టి- ‘ఆమ్‌ఆద్మీ’ని రుూసారి కూడా సుమారు యాభై మూడు పైచిలుకు వోట్ల శాతం యిచ్చి గెలిపించారు ఢిల్లీ వాసులు. 62 సీట్లు యించక్కా అందించారు.
అరవై సీట్లా? అరవై రెండు సీట్లా? లాంటి ప్రశ్నలేదక్కడ ఇది ఘన విజయం. నిస్సందేహంగా భాజపా రెండు వందల మంది పార్లమెంటు సభ్యులను, మంత్రులను ఎన్నికల కురుక్షేత్రంలోకి అతిరథులుగా దింపింది. పదహారు అతిపెద్ద ర్యాలీలకు నేరుగా ప్రధానమంత్రి, హోంమంత్రి సారథ్యం వహించి- తమ సకల శక్తియుక్తులను ఉపయోగించారు. షహీన్‌బాగ్ ఉదంతం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. అందుకే, నిన్నటి దాకా కూడా అదేపనిగా ఏడు వ్యవస్థల ఎగ్జిట్ పోల్స్- కేజ్రీవాల్ గెలుపుని అంచనా వేసినా భాజపా కార్యకర్తలు ఎందరో- ‘హోపింగ్ అగ్నెస్ట్ హోప్’- అన్నట్లు భారతీయ జనతాపార్టీ చివరి క్షణంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందేమో అంటూ సందిగ్ధావస్థలో కూర్చున్నారు... (పాపం!)
కలకత్తా నుంచి ‘దీదీ’ మాత్రం, రుూ గెలుపు సి.ఏ.ఏ.కి వ్యతిరేకంగా వచ్చిన గెలుపు వోట్లుగానే నమ్ముతూ- ‘‘అబద్ధాల చెత్తని ప్రచార రంగంలో క్రుమ్మరించిన భాజపాకిది గుణపాఠం’’- అంటూ ఎలుగెత్తి చాటింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలను కూడా కలుపుకుని, అందరినీ కలుపుకుని చర్చించి నిర్ణయాలు మార్చుకోమంటూ- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి- పెడబొబ్బల స్థాయిలో హర్షిస్తూ ‘ఆప్’ నాయకుడికి అభినందనలు తెల్పింది...
ఇక, కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఎన్నికలలోనూ ‘సున్న’ స్కోరు చేసింది. ఈసారి కూడా తన స్కోరుమీద నిలకడగా వుండిపోయింది గానీ కేజ్రీవాల్ విజయాన్ని లోపల్లోపల బాగా హర్షించిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా- షాహీన్‌బాగ్ ఉదంతం వేడి పుట్టించింది. కరోనా వైరస్,- ఇండియన్ క్రికెట్‌ల తర్వాత జనాలు ఈ ఢిల్లీమీదే తమ దృష్టిని సారించారు. ‘‘గోలీమార్’’అన్న నినాదం- బూమ్‌రాంగ్ అయిందీ అంటే- పరిశీలకులు మా ‘‘అంచనాలు కరెక్ట్’’- అన్నారు.
ఇది ఘాటుగా యింత పట్టుదలతో అమిత్‌షాగారు దేశ పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా పోరాడలేదు. దేశ హోంమంత్రి తన మందీ, మార్బలం అంతా చేర్చి, సన్నాహపరిచి, అక్కడ మకాంవేసి పోరాటాన్ని నడిపిస్తే, స్కోరు ముడల్లా ఎనిమిది అయింది.
పరిశీలకుడు ఒకరన్నారు- షహీన్‌బాగ్ రెండువైపులా వాడిగల కత్తి లాగా- ఎవరికి గ్రుచ్చుకుంటుందో- ఏ పార్టీని పొడుస్తుందోనన్న అనుమానం కూడా కలిగింది. మహానాయకులయ్యుండిన్నీ- అధర్మ యుద్ధానికి రెడీ అయ్యారు. కెజ్రీవాల్‌ని ‘టెర్రరిస్టు’ అనడానికి కూడా వెనుకంజ వెయ్యలేదు. అందుకే మా పార్టీకి స్కోరు పెరిగింది. నలభై శాతం వోట్లు పోలయ్యాయి. జనాలు కేవలం మొత్తం దేశంలో వికాసానికి మాత్రం- మోదీజీ కావాలని అనుకున్నారు! అంటూ యిప్పటికీ భాజపావారు అంటున్నారు.
‘‘ఒక ప్రాంతం ఢిల్లీకి అంత సీను లేదు. ప్రాంతీయ పార్టీ చాలు అని ఆమ్‌ఆద్మీ పార్టీకి వదిలేశారు’’ జనం అంటున్నారు భాజపా వీరభక్తుడొకడు.
‘‘డెమోక్రసీని గౌరవించే వాళ్లు రుూ ఫలితాన్ని వోటమిగా అంగీకరించాలి’’, అంటూ, ‘‘రిక్త హస్తాలను వూపుతూ’’, కాంగ్రెస్ పండిట్స్ వ్యాఖ్యానించారు.
‘‘ఎన్ని చెప్పండి’’, యిది పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా యిచ్చిన వోటు ఇది’’ అంటూ- దేశంలో ప్రొటెస్ట్ చేస్తున్న ఉద్యమకారులు బృందగానం చేశారు..
ఈలోగా, యిదే టైము అన్నట్లు సి.ఏ.ఏ.కి వ్యతిరేకంగా మరో రాష్ట్రం రంగంలోకి దూకింది. కాకపోతే కాంగ్రెస్ ఖాతా ఎందుకు తెరవలేకపోయింది? అంటే, దీనికో థియరీ చెబుతారు. ‘‘ఆమ్ ఆద్‌మీ ‘చీపురు’ భాజపాని ఊడ్చివేయాలి. ఆ పని మనం ఎలాగూ చేయలేం కనుక లోపాయకారీగా ఆమ్‌ఆద్‌మీకే జయం పలుకుదాం’’, అనుకున్నారట కా.పా.వారు.
కాంగ్రెస్ పార్టీలో వున్న ముస్లిములంతా, ‘‘‘ఆప్’, అయితే’’- అంటూ, అరవింద్ కేజ్రీవాల్‌కి ‘బటన్’ నొక్కేశారు. అట్లాగే కాంగ్రెస్‌లో వున్న హిందువులంతా- ‘‘మనం ఎలాగో నెత్తిన కొంగేసుకుని పోవాల్సిందే కనుక- హిందూ మతోద్ధరణకి కంకణం కట్టుకున్న భారతీయ జనతాపార్టీకి- కాషాయ రంగుకి వోట్లు గ్రుద్దేద్దాం,’’ అనుకుని, యిటు వేశారుట.’’
70 సీట్లకి 672 మంది- అందులో 79 మంది స్ర్తి అభ్యర్థులు అహర్నిశలూ నిద్రాహారాలకి దూరమై విషవాయు కాలుష్యానికి దగ్గరై ఎన్నికల సంకుల సమరంలో నిమగ్నమైనారు. నిర్ద్వంద్వంగా ఢిల్లీ వోటరు-అంటే, ‘నేషనల్ క్యాపిటల్’లోని- వోటరు యించుమించు అష్టదిక్కులలోగల స్థానాలలోనూ కూడా తన తీర్పుని- జన సంక్షేమం కోసం- నిత్యావసరాల మెరుగుదల కోసం- మరోసారి సామాన్యుడి పార్టీని అంటే ఆమ్‌ఆద్మీ పార్టీని సింహాసనం మీద కూర్చోబెట్టింది... కేజ్రీవాల్‌ను జైకొట్టింది!
ఢిల్లీ దేశ రాజధాని- అంతేనా, దేశ పరిపాలన సాగించే పార్లమెంటు వున్న మహానగరం- అక్కడ జీవితం దినదిన గండంగా వుంటున్నది. దాన్ని మెరుగుపర్చడానికి కేంద్రం కేజ్రీకి సహాయం చెయ్యడం తక్షణ కర్తవ్యం. కక్ష సాధింపు అన్నది ఉభయులకూ మంచిది కాదు- అని మాత్రం చెప్పాలి. పార్టీల కతీతంగా కేంద్రం ఢిల్లీని ఆదుకోడం సముచితమైన పని. సుస్థిరత్వానికీ, శాంతికీ సర్దుబాటుకీ, మత సామరస్యానికీ మరోసారి ‘జై’కొట్టిన ‘ఢిల్లీ పౌరుడు’- అసలు నిజమైన భారతీయుడు. అభినందనీయుడు.
‘లెట్’ దేర్ బి డెవలెప్‌మెంట్ గ్రూప్ ఫ్రమ్ నౌ ఆన్!’

veeraji.columnist@gmail.com 92900 99512