వీరాజీయం

ఈసారైనా... జరిగేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు’’అంటారు బామ్మలు శివుడున్నాడో, లేదో చెప్పడం కష్టం. కానీ ఓ ‘మనిషి చావు’ సంభవించడానికి మాత్రం అటువంటిది ఏదో వుండి తీరాలి. లేకపోతే, ఎప్పటి సంగతి? 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు? ఇన్నాళ్లకి, యిప్పుడు ఉరిశిక్ష అమలుచేయమని- తేదీ, సమయం కూడా నిర్ధారించింది న్యాయస్థానం. ఎవరు, అంతలేసి లాయర్లకు, ఏర్పాట్లకు పెట్టుబడి పెడుతున్నారో తెలియదుకానీ, దోషులు మాత్రం చట్టంతో దోబూచులాడుతున్నారు.
‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకూ పటియాలా కోర్టు ‘డెత్ వారెంట్’ మరోసారి జారీచేసింది. నిర్భయా కేసులోని దోషులను ‘ఉరి’తీయాలని పటియాలా కోర్టు ‘డెత్ వారెంట్’ జారీచేయడం యిది మూడోసారి. 2012 దిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులు- అంటే వీళ్లే- ముకేష్‌సింగ్, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్‌గుప్తాలు. ఈ నలుగురు దోషులకూ మార్చి 3న ఉదయం ఆరు గంటలకు ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు, కోర్టు- జనవరి 22న.. రుూ దోషుల ఉరిశిక్ష తేదీని ఖరారుచేసింది. కానీ, ఒక దోషి దయాభిక్ష పిటిషన్ ఒకటి రాష్టప్రతి దగ్గర పెండింగ్‌లో ఉండడంతో- ఉరిశిక్ష తేదీని వాయిదా వేశారు. ఆ తర్వాత కోర్టు- ఫిబ్రవరి ఒకటిన వీరికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఐతే, ఆరోజు కూడా ఉరిశిక్ష అమలుకాలేదు. దానినలా, తదుపరి ఆదేశాలవరకూ నిలిపి వేశారు.
నిర్భయా తల్లి ఆశాదేవి- కోర్టు ఆ నలుగురు దోషులకూ కొత్త డెత్ వారెంట్ జారీచేయడంపై సంతోషం వ్యక్తంచేసింది. ఈసారి నిందితులకు ఉరిశిక్ష విధిస్తారనీ, చట్టపరమైన లొసుగుల నుంచి వారికి ఎటువంటి ప్రయోజనం లభించదనీ, ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్న ఆశాదేవిగారి ఆశ ఎప్పటికైనా నెరవేరేనా?
ఐతే, దోషుల తరఫు న్యాయవాది ఏ.పి.సింగ్- పత్రికల వారితో మాట్లాడుతూ- తమ క్లయింట్లదగ్గిర ఇప్పటికీ చట్టపరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పడం చూస్తుంటే- మళ్లీ శివుడి ఆజ్ఞ అడ్డుపడుతుందా? మరో ‘మెలిక’ఉత్పన్నమవుతుందా? అన్నది సందేహమే!
ఈ నిర్భయా కేసులో, ఎప్పుడేం జరిగిందంటే? 2012 డిసెంబర్ 16న. 23 ఏళ్ల ఫిజియో థిరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థినీ, ఆమె బోయ్‌ఫ్రెండ్‌నీ తీవ్రంగా కొట్టారు- రోడ్డుప్రక్కన పారేశారు, యిద్దరినీ. ఆ తర్వాత ఆ కాలానుక్రమణిక చూస్తే యిలావుంది.
2012 డిసెంబర్ 17న ప్రధాన నిందితుడైన బస్ డ్రయివర్ రామ్‌సింగ్‌ను అరెస్ట్‌చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్‌సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్‌శర్మ, పండ్లు అమ్మే (వ్యాపారి) పవన్‌గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్ అన్నవాడు మైనర్. ఈలోగా 2012, డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు తల్లిదండ్రులు.
మళ్లీ కేసు ‘సాగటం’ మొదలైంది. ఇంతలో 2013 మార్చి పదకొండున నిందితుడు రామ్‌సింగ్ తిహారీ జైలులో-అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులు అతడు ‘ఆత్మహత్య’ చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది ‘హత్య’ అని ఆరోపించారు. 2013 ఆగస్టు 31న జువైనల్ జస్టిస్ బోర్డు- ‘‘మైనర్’’ నిందితుడు అక్షయ్‌ని దోషిగా తేల్చి, మూడేళ్లపాటు జువైనల్ హోమ్‌కు పంపింది. 2013 సెప్టెంబర్ 13న ట్రయల్ కోర్టు నలుగురు నిందితులనూ దోషులుగా ఖరారుచేస్తూ- ఉరిశిక్ష విధించింది. దిల్లీ హైకోర్టు రుూ ఉరిశిక్షను సమర్థించింది. కానీ నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేశారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై ‘స్టే’ విధించింది. 2017 మేలో- హైకోర్టు, ట్రయల్ కోర్టువారు వేసిన ఉరిశిక్షను- సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్‌నీ కట్టివేసింది.
2019 డిసెంబర్ 6న- కేంద్ర ప్రభుత్వం ఒక దోషి పెట్టుకున్న ‘క్షమాభిక్ష’ పిటిషన్‌ను రాష్టప్రతి దగ్గరకు పంపింది. మంజూరు చెయ్య‘‘వద్ద’’ని సిఫార్సుచేసింది. తలారీకోసం అనే్వషణ మొదలైంది. తలారీని పంపించమని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు ఆదేశించారు.
ఇదిలావుండగా- 2019 డిసెంబర్ 13న- ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని- నిర్భయ తల్లి తరఫున పటియాలా హవుస్‌కోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. దాంతో, నలుగురు దోషులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.
2020 జనవరి 8నాడు- డెత్ వారెంట్ జారీచేసిన పటియాలా కోర్టు- అమలుచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టువారు వినయ్‌కుమార్‌శర్మ ముకేశ్‌సింగ్‌ల క్యురేటివ్ పిటిషన్‌ని కొట్టివేసింది.
అయితే, దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు, జనవరి 22న ఉరిశిక్షను అమలుచేయలేమని చెప్పింది. కారణం-ఒక దోషి పెట్టుకున్న ‘దయాభిక్ష’ పిటిషన్- రాష్టప్రతి దగ్గర పెండింగ్‌లో ఉందని చెప్పింది. 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాష్టప్రతి వైపునుంచి - క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురిఅయిన తర్వాత కూడా నిందితులకు కనీసం 14 రోజుల గడువు యివ్వడం తప్పనిసరి అని చెప్పింది.
అట్లా కేసు మలుపులు తిరుగుతూండగా, 2020 జనవరి 17న ముకేశ్‌సింగ్ పెట్టుకున్న ‘క్షమాభిక్ష’ పిటిషన్‌ని రాష్టప్రతి తిరస్కరించారు. కొత్త, ‘ఉరి’వారెంట్ జారీచేస్తూ- ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు ‘ఉరిశిక్ష’ విధించాలని, ఆదేశాలు పంపించారు. కానీ, కథయింకా ముగియలేదు. ముకేశ్‌సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. కోర్టు ‘తీర్పు’ని రిజర్వ్‌చేసింది. 2020 జనవరి 31న దోషులకు- ఉరిశిక్షను తదుపరి ఆదేశాలవరకూ నిలుపుదల చేస్తున్నట్లు పటియాలా కోర్టు ప్రకటించింది.
దేశమంతా నివ్వెరపోయింది! పటియాలా కోర్టు ఆదేశాలను సవాల్‌చేస్తూ, కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అట్లాగా కేసు చిత్ర విచిత్రంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా - క్రింది కోర్టులతో చక్కర్లు కొట్టింది. దీంతో- మన న్యాయ చట్టాలలో ఎక్కడ లొసుగులు, లోపాలూ వున్నాయో క్షుణ్ణంగా పరిశీలించాలని పండిత, పామర జనం అంతా భావిస్తున్నారు.
నిర్భయా కేసునుంచి ‘దిశ’ కేసుదాకా- శాడిస్ట్ రేప్ కేసులు సభ్య ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.
మరొకప్రక్క దారుణ పైశాచిక, లైంగిక నేరాలు విజృంభిస్తున్నాయి. జనాల హితాన్నికోరే ప్రధాన న్యాయాలయంలోని ప్రముఖ న్యాయమూర్తులు, కేంద్ర ప్రభుత్వం- ‘‘అత్యవసరంగా ఒక కమిటీని వేసి- ‘కాల పరిమితి’విధించి, పరిశీలనా, పరిశోధనా, అనుశీలనలను కూడా చేయించడం అత్యవసరం అన్నది జనవాక్యం.
మరోప్రక్క కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ‘పౌరసత్వ చట్టసవరణ’ పోరాటం రోజురోజుకీ ముదురుతున్నది. శాంతి భద్రతలపట్ల సామాన్యుడికి ఆందోళన పెరుగుతున్నది. ‘‘అక్కడ కూడా మళ్లీ సుప్రీంకోర్టుకే ఎక్కువ పని పడేటట్లుగా వున్నదిరా, దేవుఁడా!’’ అంటూ ఓ పౌరుడు ఆక్రోశించాడు.
‘లెట్ సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్’ అండ్ యాక్ట్!

veeraji.columnist@gmail.com 92900 99512