విశాఖ

చెత్త సంపద కేంద్రం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, డిసెంబర్ 14: గ్రామంలో నిర్మిస్తున్న చెత్త సంపద తయారీ కేంద్రం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని లచ్చన్నపాలెం గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఈమేరకు శుక్రవారం ఇన్‌చార్జ్ ఇ ఓ పీ ఆర్‌డీ శివరామ్‌కు మాజీ సర్పంచ్ పోతల వెంకునాయుడు, గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ సమీపంలో ఉన్న నూకాంబికాఅమ్మవారు, పోతురాజుబాబు, పరదేశమ్మ అమ్మవారి దేవాలయాల పక్కనే చెత్త సంపద తయారీ కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించారన్నారు. ఇప్పటికే కేంద్రం నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారని ఇక్కడ కాకుండా ఆలయాలకు కుడి వైపు ఉన్న స్థలంలో నిర్మాణం చేయాలని కోరుతున్నామన్నారు. ఇదే విషయమై నర్సీపట్నం ఆర్డీవో, స్థానిక తహశీల్దార్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అధికారులు ఈనిర్ణయాన్ని విరమించుకోవాలని, ఈస్థలంలో కేంద్రాన్ని నిర్మిస్తే అడ్డుకుంటామని వారు ఈసందర్భంగా స్పష్టం చేసారు.

రేపుచాగంటి కోటేశ్వరరావుఆధ్మాత్మిక ప్రవచనాల సభ
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 14: అనునిత్యం ప్రజాసేవలో మెలుగుతూ వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్‌అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రముఖ వైద్యులు కాండ్రేగుల విష్ణుమూర్తి, సత్యవతి దంపతులు అనకాపల్లి ప్రజలకు మానవత విలువలపై మంచి సందేశాన్ని అందించాలనే లక్ష్యంలో భాగంగా ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ఆధ్మాత్మిక ప్రవచనాలు ఈనెల 16న ఏర్పాటు చేస్తున్నట్లు వివేకానంద ఛారిటబుల్‌ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శిలు, ప్రముఖ వైద్యులు కాండ్రేగుల విష్ణుమూర్తి, సత్యవతిలు తెలిపారు.స్థానిక వివేకానంద హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలోట్రస్ట్‌కార్యదర్శి వైద్యులు కె సత్యవతి మాట్లాడుతూ వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్‌వారి అధ్వర్యంలో ఈనెల 16న సాయంత్రం స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలోనిర్వహిస్తున్నట్లుతెలిపారు. ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న మానవ సంబందాలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధి దేవోభవ అనే అంశాలపై చాగంటి కోటేశ్వరరావు ఆధ్మాత్మిక ప్రవచనాలు చేస్తారని వివరించారు.ట్రస్ట్ అధ్యక్షులు కె విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డుడిప్యూటీ డిఇవో కెవి గౌరీపతి, న్యాయవాది కడిమిశెట్టి లక్ష్మి, బుద్ద రామకృష్ణ,ప్రముఖ వ్యాపారవేత్త ముప్పన సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు విల్లూరి రెడ్డిమ్మనాయుడు, శరగడం నూకరాజు, బెనార్జిలు ట్రస్ట్ అందజేస్తున్న సేవలుపై కొనియాడారు.

అభివృద్ది ముసుగులో భూ దందాచేస్తున్న అధికార పార్టీ
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
అనకాపల్లిటౌన్, డిసెంబర్ 14: రాష్ట్రం అభివృద్ది,పరిశ్రమల ఏర్పాటు ముసుగుల అధికార తెలుగుదేశం పార్టీ పేదలు నుండి భూములను స్వాదీనం చేసుకొని భూ దందా చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆరోపించారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది పేరుతో రైతులు నుండి భూ సేకరణ చేయడం చట్టవిరుద్దమన్నారు. జిల్లాలోని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు లక్షా 20వేల ఎకరాలు తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ భూములను అధికార పార్టీచెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు కనుసన్నల్లో భూ దందా దర్జాగా సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. గడిచిన నాలుగున్నరేళ్ళుగా రైతులు నుండి భూములను సేకరించడమే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా ఎకరం భూమి పేదలకు అందజేసినట్లు లేదన్నారు. ఎక్కడ నుంచోవలస వచ్చిన బడాబాబులకు పరిశ్రమల ఏర్పాటు ముసుగులో ఇక్కడి భూములను ధరాదత్తం చేసి రైతులకు, వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు. పలితంగా ఇక్కడి రైతులు, కార్మికులు జీవనోపాధి కోసం వలస పోతున్నారని ఆయన విమర్శించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా పంటలు పోయి రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయి విలవిల్లాడుతున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం చీమ కిట్టినట్లుకూడా లేదన్నారు.రాష్ట్రంలో కరువుప్రాంతాలుగా 325మండలాలను గుర్తించినట్లు ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిదన్నారు. విశాఖ జిల్లాలో 15మండలాలును గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కరూపాయ కూడా ప్రకటించకపోవడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందోఇట్టే అర్ధమవుతుందన్నారు. కురువు కాటకంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు నష్టపరిహారం ప్రకటించాలని, పాత రుణాలు రద్దుచేసి కొత్తరుణాలు మంజూరుచేసి రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ పథకంలో 200రోజులు పనిదినాలు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు కరువు భత్యం ఐదువేలు మంజూరుచేయాలని ఈ సందర్బంగా వెంకటేశ్వర్లుప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి డి వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లించవలసిన బకాయిలు 18కోట్ల రూపాయలు ఉందన్నారు. తక్షణం నిధులు మంజూరుచేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసారు. ఆలాగే ఈ పథకం పచ్చచొక్కాల ఆవినీతిలో కూరికపోయిందన్నారు.దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు.ఈ సమావేశంలోఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ బాలకృష్ణ, సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు భగవద్గీత పోటీలు
కశింకోట, డిసెంబర్ 14: స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం శ్రీ్భగవద్గీత పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మాజీ వార్డుమెంబర్ వైఎ రాజు, శ్రీకోదండసీతారామదేవస్థానం మాజీ చైర్మన్ శిష్టి అప్పారావుశుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ్భగవద్గీత ఆరవ అధ్యయనం ఖంఠస్థ పోటీలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో స్థానిక ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినివిద్యార్థులు పాల్గొంటారని అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం కూడా వెంటనే జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేసారు.

సొంత నిదులతో అగ్నిబాధితులకు సరకులు పంపిణీ
కశింకోట, డిసెంబర్ 14: ఇటీవల మండలంలోని తాళ్లపాలెం శివారు సంతలో ఇళ్లుకాలిపోయిన మూడు కుటుంబాలకు అనకాపల్లి మార్కెట్‌కమిటి చైర్మన్ కాయల మురళీధర్ తన సొంత నిధులతో నిత్యవసర వస్తువులు, సరుకులు పంపిణీ చేసారు. శుక్రవారం తాళ్లపాలెం సంతలో వాటిని పంపిణీ చేసి మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగి ఇళ్లు కాలిపోవడంతో ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అయితే స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ ప్రభుత్వ నిధులతో పక్కా గృహాలు నిర్మిస్తున్నట్లు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతోపాటు వారు తనకు తోచిన విధంగా సొంత నిధులతో వీరికి ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు మురళీధర్ స్పష్టం చేసారు.

ఘనంగా ముగిసిన మహాసౌరయాగ మహోత్సవాలు
అనకాపల్లి, డిసెంబర్ 14: స్థానిక డిసిఎంఎస్ ప్రాంగణంలో 12రోజులుగా జరిగిన మహాసౌరయాగ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిసాయి. ఉదయం నుండి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యనమస్కారాలు, విశ్వక్నేన పూజ, పుణ్యాహవాచనం, రక్షధారణ తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. మహాపూర్ణహుతి జరిపి కలస ఉద్వాసన అబప్రధ స్నానం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులోని సిమ్మింగ్‌పూల్‌లో చక్ర స్నానం నిర్వహించారు. చాయాసమేతా సూర్యనారాయణమూర్తి కళ్యాణోత్సవం కన్నులపండుగగా జరిగింది. జిల్లా రైతుసంఘం కన్వీనర్ దాడి రత్నాకర్, జివిఎంసి జోనల్ కమీషనర్ రాము దంపతులు పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త వినకోట బుచ్చిరాజు, 3,500 దేవాలయాలకు విగ్రహప్రతిష్ఠలు చేసిన శ్రీమాన్ రేజేటి రామాచార్యులు తదితరులను సత్కరించారు. బుచ్చిరాజుకు ఘన సత్కారం జరిగింది. భక్త బృందం శ్రీరామాచార్యులు, చక్రవర్తి, కన్నబాబు తదితరులకు గురుసత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేజేటి కన్నబాబు, అప్పలాచార్యులు, మారుతి వెంకటాచార్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.