విశాఖ

జోరుగా కురుస్తున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 17: ఆకాశం మేఘావృతమై గంటన్నరపాటు కురిసిన వర్షానికి పట్టణవాసులు సేదతీరారు. ఈనెల 13వ తేదీన, 15వ తేదీన కురిసిన వర్షాలకు రైతులు వేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. అలాగే సోమవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టంలోని పలు పల్లపుప్రాంతాలు జలమయం కావడంతోపాటు రోడ్లపై నీరు ప్రవహించింది. దీంతో పిఎస్ పేట రోడ్డు, ఆర్టీసి కాంప్లెక్స్ రోడ్డు, చీడికాడ రోడ్డు, గవరవరం రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతాంగానికి మేలు చేసేవిగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కొన్నిచోట్ల నాట్లు వేసినప్పటికీ వర్షాలు లేక ఆయా ప్రాంతాల్లోని పంటలు ఎండిపోతున్న తరుణంలో ఈ వారంలో మూడుమార్లు కురిసిన వర్షం వాటికి జీవం పోసింది. అలాగే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకాన్ని సేదతీర్చింది.

ఛలో అసెంబ్లీని విజయవంతం చేయాలి
చోడవరం, సెప్టెంబర్ 17: సిపిఎస్‌ను రద్దు చేసేవరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని ఎపిటిఎఫ్ పిలుపునిచ్చింది. సిపిఎస్ పించన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళనా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలను దరించి విధులకు హాజరయ్యారు. అలాగే సాయంత్రం సంఘ కార్యాలయం వద్ద సిపిఎస్ రద్దు కోరుతూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు డి. గోవిందరావు, మహాలక్ష్మినాయుడులు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ను అందజేయడం ఖజానాకు భారమైతే కార్పొరేట్ కంపెనీలకు ఏడాదికి ఐదులక్షల కోట్ల రూపాయల రాయితీలను చెల్లించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. సిపిఎస్ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలన్నారు. అలాగే ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 18న నిర్వహించనున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడు, పి. వరాహమూర్తి, కొల్లి శ్రీను, కెవి రమణ, యుఎస్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.