విశాఖ

మావోల అగ్రనాయకులపై పోలీసులు గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, సెప్టెంబర్ 24: ఎ ఓబీలో గత కొన్నాళ్ళుగా మావోయిస్టులు స్తబ్దతగా ఉండి ఒక్కసారిగా విరుచుకుపడి అదికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివ్వేరి సోమలను ఆదివారం కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈసంఘటనతో ఎ ఓబీతో పాటు విశాఖ మన్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. ఈనేపధ్యంలోనే ఎ ఓబీ సరిహద్దుల్లో స్పెషల్ పార్టీ,గ్రేహౌండ్స్ బలగాలను భారీగా మోహరించి జల్లెడ పడుతున్నారు. ఎ ఓబీలో ఉన్న అగ్రనాయకులు చలపతి, అర్కే, అరుణ, ఉదయ్, గాజర్ల రవి తదితరులు వ్యూహరచన చేసి వీరు ఇద్దరిని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ పోలీసులను అప్రమత్తం చేసి జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సంఘటన అనంతరం మావోయిస్టులు సేప్టీ జోన్ అయిన ఒడిషా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నందున కటాఫ్ ఏరియాల్లో భారీగా బలగాలను మోహరించి అనువణువునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన చిత్రకొండ, చింతపల్లి, జీకేవీది, సీలేరు, డొంకరాయి పోలీస్ స్టేషన్లకు సీ ఆర్‌పీ ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. గత కొన్నాళ్ళుగా ఎ ఓబీలో మావోయిస్టులు కనుమరుగైపోయారని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ప్రకటనలు చేసారు. దీంతో మావోయిస్టులు ఇద్దరు టీడీపీ నాయకులను హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. ఈసంఘటనతో పోలీసులు తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. పోలీసుల భద్రతా వైఫల్యం వలనే ప్రజాప్రతినిధులు మావోల చేతిలో హతమయ్యారని ప్రజలు ఆగ్రహం చెందిన విషయం తెలిసిందే. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే మావోయిస్టుల రెక్కీ పసిగడితే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని మన్యంలో చర్చనీయాశంగా మారింది. ప్రజల నెలకొన్న అభధ్రతా భావం తొలగించేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యహరించి సంఘటనకు కారకులైన మావోయిస్టులను హతమార్చమే లక్ష్యంగా పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఈనేపధ్యంలో సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.