విశాఖ

నాతవరంలో నాయిభ్రాహ్మణ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతవరం, నవంబర్ 20: మండలంలో వందన నాయిబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసారు. మంగళవారం స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్నాడ శ్రీను అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో బస్టాండ్ నుండి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలపై వినతులు అందించారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న నాయిబ్రాహ్మణ విశాఖ జిల్లా అధ్యక్షులు హరిపాక పెంటారావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా సంఘాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని నాయిబ్రాహ్మణులకు ఇంటి స్థలాలు, జీవనోపాధితో పాటు మండలాల్లో కమ్యూనిటీ భవనాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అందించాలన్నారు. ఈకార్యక్రమంలో మండలంలోని నాయిబ్రాహ్మణులో పాటు జిల్లా నలుమూలల నుంచి నాయిబ్రాహ్మణులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి భగవత్ గీత పోటీలకు సాహితీ గ్రీస్మ ఎంపిక
అనకాపల్లి టౌన్, నవంబర్ 20: ప్రతీ ఒక్కరిలోఏదోక కళ ఉంటుంది ఆ కళను వారి తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించి చేయూతనందించినట్లు అయితే ఆ కళకు మరింత పదును పెట్టి రాణిస్తారని అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మోసూరి సాహితీ గ్రీస్మ రుజువుచేసింది. కొత్తూరు శారదానగర్ విజయాపబ్లిక్ స్కూల్‌లో సాహితీ ప్రస్తుతం 7వ తరగతి చదువుతుంది. రెండోవ తరగతి నుండి ఆ స్కూల్లో తెలుగు టీచర్ చెప్పిన భగవద్గీత గురించి విద్యార్ధులకు బోధించేవారు. ఈ క్రమంలో సాహితీ అప్పటి నుండి భగవద్గీత శ్లోకాలుపై మొక్కువ పెంచుకొని భగవద్గీత సంబందించి బుక్ ద్వారా తండ్రి కన్నబాబు ప్రోత్సహంతో శ్లోకాలను కంఠస్థ పట్టింది. ఈనెల 18న విశాఖ ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయంలో చిన్మయా మిషన్ కాంపిటేషన్ అధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న సాహితీ తమ ప్రతిభను కనబర్చి ప్రధమ స్థానం కైసవం చేసుకోవడంతోపాటు డిసెంబర్ 16న ఒంగోలులోజరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు ఏంపికైనట్లు సాహితీ గ్రీస్మ తండ్రి కన్నబాబు ఆనందంతో తెలిపారు.

లేబర్ అధికారులు యాజమాన్యాలకు వత్తాసు
అనకాపల్లి టౌన్, నవంబర్ 20: కార్మిక హక్కులను తుంగలోతొక్కి క్వారీ, క్రషర్ల యాజమాన్యంతో చేతులు కలిపిన లేబర్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోటారు ట్రాన్స్‌పోర్టువర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఎఫ్‌ఐటియు నాయుకులు రాజు మాట్లాడుతూ స్టోన్ క్రషర్లు, క్వారీ మోటారు వాహనాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలను లేబర్ అధికారులు అమలు చేయవలసి ఉండగా అధికారులు అసోసియేషన్‌తో కలిసి కార్మిక హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. అధికారులు కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. లేబర్ అధికారులు కార్మికుల పట్ల ఉన్న వ్యతిరేక విధానాన్ని విడనాడి కార్మికుల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయుకులు ఉరికిటి రమణ, రామకృష్ణ, రమేష్, సత్తిబాబు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

ఘనంగా అంబలం పూజ
కోటవురట్ల, నవంబర్ 20: మండల కేంద్రమైన కోటవురట్లలో అయ్యప్పస్వామి అంబలం పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వామి పోలిశెట్టి సత్తిబాబు ఇంటి వద్ద నిర్వహించిన ఈ అంబలం పూజలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వాములు పాల్గొన్నారు. ఈపూజలో ఐదువేల ప్రమిదలతో దీపాలంకరణ, 108 కుందులతో జ్యోతులు, అరటి డొప్పలతో ఏర్పాటు చేసిన మెట్లు, గుడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురుస్వాములు ఫ్రకాష్, చిట్టిబాబు, రమణ, సత్తిబాబు తదితరులు సాంప్రదాయ బద్దంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు.