విశాఖ

అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయి స్వాదీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట, నవంబర్ 20: కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని, నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్సై రమేష్ తెలిపారు. ఈమేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కేడీపేట, చింతపల్లి రూట్‌లో గంజాయిని తరలిస్తున్నట్లుగా ముందస్తు సమాచారం అందిందన్నారు. ఈమేరకు మంగళవారం ఉదయం ఆరూట్‌లో వాహనాల తనిఖీ చేయగా అల్లూరి పార్కు వద్ద తనిఖీ చేస్తున్న తమకు చింతపల్లి నుండి కారులో నలుగురు వ్యక్తులు నాలుగు మూటల్లో 100 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గంజాయిని తరలిస్తున్న చింతపల్లిమండలం కాట్రపల్లికి చెందిన గెమ్మిలి రామకృష్ణ(38), గెమ్మిలి రమేష్(28), డౌనూరుకు చెందిన కొండమ్మ లోవరాజు (20), ఒడిషాకు చెందిన చండా జైరామ్(28)లు పట్టుబడ్డారన్నారు. వీరి వద్ద నుండి నాలుగు సెల్‌పోన్లు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితో పాటు ఫైలెట్‌గా వ్యవహరించిన వ్యక్తి పరారయ్యాడన్నారు. బైక్, కారును సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులను నర్సీపట్నం కోర్టుకు తరలించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. తనిఖీల్లో ఎ ఎస్సై రమణ, హెచ్‌సీ మత్స్యరాజు, రాము, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

ముమ్మరంగా పోలీసులు వాహన తనిఖీలు
కృష్ణాదేవిపేట, నవంబర్ 20: మావోయిస్టులు మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో మంగళవారం చింతపల్లి, చోద్యం, పాకలపాడు రహదారిలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేసారు. సీ ఐ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎపీ ఎస్పీ, ఎ ఆర్ పోలీసులు అన్ని రహదారుల్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. మావోల బంద్ నేపధ్యంలో సోమవారం ఉదయం నుంచి అన్ని రూట్లలో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. జీపులు, వ్యాన్లు, ఆటోల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల విచారించి వదిలిపెట్టారు. ఈతనిఖీల్లో ఎ ఎస్సై రమణ, మత్స్యరాజు, సింహాద్రి, ఎస్సై రమేష్‌లు పాల్గొన్నారు.

కోటవురట్లను కరవు మండలంగా ప్రకటించాలి
* మండల సర్వసభ్య సమావేశం డిమాండ్
కోటవురట్ల, నవంబర్ 20: కోటవురట్లను కరవు మండలంగా ప్రకటించాలని మండల సర్వసభ్య సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీపీ వరహాలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కె.వెంకటాపురం ఎంపీటీసీ పైల రమేష్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మెట్ట ప్రాంతాల్లో వరి పంటకు నష్టం జరిగిందన్నారు. దీంతో అందరూ కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఈమేరకు కరవు మండలంగా ప్రకటించాలని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అటవీ శాఖ అధికారులు వడ్రంగి పని వారిపై నెలవారీ మామూళ్ళకు వత్తిడి చేస్తున్నారని పైల రమేష్ ఆరోపించారు. మామూళ్ళు ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తామని వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. దీనిని అరికట్టాలని అధికారులను కోరారు. దీనిపై డీ ఎస్ ఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. జెడ్పీటీసీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ అధికారులు తమకు ఏవిషయం తెలిజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు. డప్పు కళాకారుల ఫించన్లకు సంబందించి తనకు అధికారులు తెలియజేయలేదన్నారు. ఈకార్యక్రమంలో ఎడీవో కళ్యాణి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి
కోటవురట్ల, నవంబర్ 20: విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలని ఎంపీపీ వరహాలమ్మ సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారంతో ముగిసాయి. స్ధానిక శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్యఅతిధిగా పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రజలకు విజ్ఞానాన్ని అందించేందుకు దోహదపడుతున్నాయన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీ రోజూ గ్రంథాలయానికి వెళ్ళి పుస్తక పఠనం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎం ఇ ఓ దాస్, వెలుగు ఎపీ ఎం కరుణానిధి, స్థానిక గ్రంథాలయాధికారి ఎన్.రాజుబాబు, ఉపాధ్యాయులు ఫ్రసాద్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.