విశాఖ

ముసురు వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 20: అల్పపీడనం ప్రభావం మూలంగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాల మూలంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం తెల్లవారుజాము నుండి ఏకధాటిగా ఉదయం 12గంటల వరకు ఆకాశం మబ్బుపట్టి వాన కురుస్తూనే ఉంది. దీనివలన రహదారులన్నీ చిత్తడిచిత్తడిగా మారాయి. గతుకులలో నీరు చేరి వాహనాల రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. తోపుడుబళ్ల వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులు ముసురు వర్షం మూలంగా తమతమ దుకాణాలు మూసివేసారు. ఉద్యోగులు, విద్యార్థులు తదితర ప్రయాణీకులు తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి గొడుగులు దరించి మరీ ప్రయాణించారు. తెల్లవారుజాము నుండే వర్షం ప్రారంభం కావడంతో చెత్తాచెదారాలు తొలగించడానికి వీలులేక ఆయా ప్రాంతాలన్నీ దుర్గంధబరితంగా దర్శనమిచ్చాయి. అయితే వ్యవసాయ పనులకు మాత్రం అవకాశం లభించింది. రైతులు చీకటితోనే తమతమ పంటపొలాలకు చేరి నాట్లు వేసుకోవడం, పాలుతీసుకోవడం వంటి పనులు చేపట్టారు.

స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
చోడవరం, సెప్టెంబర్ 20: చరిత్ర ప్రసిద్ధి కలిగిన స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో గురువారం ప్రత్యేక అర్చనలు, విశిష్ట పూజలు జరిగాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం విఘ్నేశ్వర స్వామికి అభిషేక పూజలు నిర్వహించి కుంకుమతో అలంకరించారు. అలాగే హోమశాలలో లక్ష్మీగణపతి హోమం వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. గురువారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించి ప్రత్యేక అర్చనలు చేసారు. వివిధ పుష్పాలతో అలంకరించి భజనలు చేసారు. సాయంత్రం స్వామివారికి నీరాజన మంత్రపుష్ప పూజలు చేసారు. ఐదు గంటలకు గణపతి మహత్యం, పురాణప్రవచనం, పండితులచే వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు.

పాలకవర్గం సేవలు శ్లాఘనీయం
చోడవరం, సెప్టెంబర్ 20: సభ్యులందరికీ అన్నివిధాలా సేవలందించడమే కాకుండా సంఘాన్ని లాభాల బాటలో నడిపించడానికి చోవడరం పిఎసిఎస్ పాలకవర్గం, సిబ్బంది ఎంతగానో కృషిచేసారని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. గురువారం చోడవరం పిఎసిఎస్‌లో 31మంది సభ్యులకు నాలుగులక్షల రూపాయలు డెత్ రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చోడవరం పిఎసిఎస్‌లో 2015-16 సంవత్సరంలో రుణాలు తీసుకున్న సభ్యరైతులు సకాలంలో రుణాలు తీర్మానం చేసి వడ్డీ రాయితీ పొందాలని ఆయన అన్నారు. గడువులోగా రుణాలను 1104మంది చెల్లించగా సుమారు 14లక్షల 53వేల 908 వడ్డి రాయితీ లభించిందన్నారు. అలాగే 1243మంది సభ్యరైతులకు రెండుకోట్ల 59లక్షల 21వేల 309 రూపాయలు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతాంగానికి 46లక్షల వరకు రుణాలను అందజేయగా డిసిసిబి అందజేసిన మరో 30లక్షలను కూడా రుణ సహాయం అందజేయనున్నట్లు పాలకవర్గం తెలియజేసిందన్నారు. అధ్యక్షులు బొడ్డపాటి లక్ష్మణరావు మాట్లాడుతూ తమ పాలకవర్గ సభ్యులు అందజేసిన సహకారం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు సూచనలు మూలంగా ఇంత ప్రగతిని సాధించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు గూనూరు లక్ష్మీనారాయణ, గుమ్మిడి శ్రీనివాసరావు, బొబ్బిలి రాంబాబు, వెంకటప్పారావు, కార్యదర్శి సింహాచలం, బి. లోకేష్, సకలా సూరిబాబు తదితర పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.