విశాఖ

చంద్రన్న పెళ్ళి కానుకతో పేదలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 20: చంద్రన్న పెళ్ళికానుక పథకం గిరిజన యువతులకు వరం వంటిదని మండల ప్రత్యేకాధికారి పార్వతమ్మ సూచించారు. మండలంలోని నడింపాలెం పంచాయతీలో గురువారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీ ఓ రెహమాన్, ఇ ఓ ఆర్‌డీ వరలక్ష్మి, ఎటీడబ్ల్యు ఓ శ్రీనివాస్, ఎం ఇ ఓ బోడంనాయుడు సహా పలువురు అధికారులు గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్ళి కానుక వంటివి గిరిజనులకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు. కుటుంబ యజమానిని కోల్పోయిన వారిని చంద్రన్న బీమాలో తక్షణం సహాయం రెండు లక్షలు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా పట్ల అందరూ అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీ రెహమాన్ సూచించారు. మండలంలోని నల్లగొండ గ్రామంలో నిర్మిస్తున్న పశు వసతి గృహానికి నిర్మాణానికై ఎనిమిది లక్షలు పంచాయతీ ఖాతాలో జమ అయినా ఇ ఓ ఆర్‌డీ ఆనిధులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదని గుత్తేదారు అక్కడి ప్రజలకు సూచించారు. దీనిపై త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎంపీడీ ఓ హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలు శాఖల అదికారులు పాల్గొన్నారు.

భాగ్యలక్ష్మి తీరు మార్చుకోవాలి
కొయ్యూరు, సెప్టెంబర్ 20: పాడేరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కె.్భగ్యలక్ష్మి తన తీరు మార్చుకోవాలని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసారు. మాజీ జెడ్పీటీసీ సెగ్గే నూకరాజు, ఎంపీటీసీ చిట్టిబాబు సహా పలువురు పార్టీ కార్యకర్తలు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల భాగ్యలక్ష్మి మండలంలో మూడు రోజులు పర్యటించిందన్నారు. ఎవరికీ ఏవిధమైన సమాచారం లేకుండా ఒంటెద్దు పోకడతో ముందుకు సాగుతుందన్నారు. దీని వలన పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఆమె తీరు మార్చుకుని మండలంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కార్యకర్తలు కలుపుని ముందుకు సాగాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈసందర్భంగా పలువురు హెచ్చరించారు.

పారిశుధ్యంపై దృష్టి సారించాలి
కోటవురట్ల, సెప్టెంబర్ 20: గ్రామ స్థాయి అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్ సూచించారు. గురువారం మండలంలో రాజుపేట గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో పర్యటించిన అధికారులు పారిశుద్యాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఎంపీయుపీ స్కూల్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం క్షీణిస్తే దోమలు విజృంభిస్తాయన్నారు. దీని వలన పలు రోగాలు వ్యాపించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎడీవో కళ్యాణి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు, పీ ఆర్ జె ఇ సత్యనారాయణ, వెలుగు ఎపీ ఎం కరుణానిధి పాల్గొన్నారు.