విశాఖ

నాయకులను హతమార్చడం ఏ సిద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 24: సిద్ధాంతాల కోసం మాట్లాడే మావోయిస్టులు ఏ సిద్ధాంతం ప్రకారం నాయకులను హతమార్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ ప్రశ్నించారు. ప్రభుత్వ విప్, అరకులోయ ఎమ్మెల కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పాడేరులో కిడారి భౌతికకాయానికి ఆయన సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇద్దరు నేతలను మావోయిస్టులు హత్య చేయడం దురదృష్టకరమని, దుర్మార్గమైనదని అన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న గిరిజన నాయకులను మావోలు ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆయన నిలదీసారు. నాయకులు తప్పు చేస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తిరస్కరిస్తారని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు నాయకులను నిర్మూలించాలనుకోవడం సరికాదని ఆయన చెప్పారు. మావోయిస్టులు చేసిన ఈ ఘాతుకంపై పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాల ఎందుకు మాట్లాడవని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు చేస్తున్న ఇటువంటి హత్యాకాండల వలన గిరిజనాభివృద్ధికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. నాయకులే కాకుండా ఈ ప్రాంతంలో పనిచేసేందుకు అధికారులు కూడా భయపడాల్సి వస్తోందని, ఇటువంటి పరిస్థితిలో గిరిజనులకు అభివృద్ధి ఏలా జరుగుతుందని ఆయన అన్నారు. మావోయిస్టులు ఇటువంటి ఘాతుకాలను విడనాడి జన జీవన స్రవంతిలో కలవాలని మంత్రి జవహార్ కోరారు.