విశాఖ

నిధులున్నా... పనులు సున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చెయ్యపేట, సెప్టెంబర్ 25: పాఠశాలల్లో వంటశాలలు నిర్మాణానికి పుష్కలంగా నిధులున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల అలసత్వమైతే నేమి, స్థానిక ఉన్న సర్పంచ్‌లు, స్కూల్ కమిటీలు సహకరించకపోవటంతో వంటశాలల నిర్మాణాలు జరగక, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడరానిపాట్లు పుడుతున్నారు. మండలంలోని విజయరామరాజుపేట జెట్టి పాపయ్యమ్మ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వంటశాల నిర్మాణం నిమిత్తం లక్షా యాబైవేల రూపాయలు మంజూరు చేసి రెండేళ్లయినప్పటికీ, నేటికి ఈ వంటశాల నిర్మాణం చేపట్టకపోవటంపై ఇటీవల ఆ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులున్నా.. ఎందుకు నిర్మాణం చేపట్టలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిలదీశారు. అలా అని ఈ పాఠశాలకు వంటశాల సమస్య లేదని అనుకుంటే పొరపాటే, స్థానిక సహకారంతో వేసిన రేకుల షెడ్డు పైకప్పు గాలులకు ఎప్పుడో ఎగిరిపోయింది. ఎండకు, ఎండుతూ వానకు తడుస్తూ ఆరుబయటనే వంటలు చేయాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. గతంలో వంటశాలకు 75వేల రూపాయలు మంజూరు చేసేవారని, ఇప్పుడు దాన్ని లక్షాయాభై వేలకు పెంచామని డిఇఒనే చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో వంటశాలల నిర్మాణం ఆశాజనకంగా లేదంటే, వీటిపై గ్రామాల్లోని ప్రజా ప్రతినిధుల ఒత్తిడే కారణమనే విషయాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, పాఠశాలలకు సంబంధించిన నిర్మాణాలపై స్థానిక రాజకీయ నాయకులు అజమయిషీని తొలగించి, విద్యా కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే ఈ పనులు సకాలంలో పూర్తవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.