విశాఖ

విద్యా వ్యవస్థలకూ సింగిల్ విండో అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: పరిశ్రమలకు ఇచ్చే విధంగా విద్యా సంస్థలకి సింగిల్‌విండో అనుమతులకు సిద్ధం చేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఇక్కడి ఎన్‌ఎడి దరి ఉమయిన్ భవనంలో ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో (అవుస్మా) ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉన్నత ప్రమాణాల కోసం అనుసరించాల్సిన వివిధ అంశాలపై అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎడ్యుకేషనల్ నాలెడ్జి హబ్‌గా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారని అన్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులకు స్కిల్స్‌టెక్నాలజీ విభాగాల్లో పరీక్షలు నిర్వహించాలని భావించగా, దాన్ని ఉపాధ్యాయులు లేనిపోని అపోహలతో వ్యతిరేకించారుఅన్నారు. ప్రభుత్వం చేపట్టే దోమలపై దండయాత్ర, మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు భాగస్వామ్యం కావాలని అన్నారు. అపుస్మరా రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు సెమిస్టర్ల సిస్టమ్‌ను భవిష్యత్‌లో ఒకటిగా చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో డిఇఒ కృష్ణారెడ్డి, అపుస్మా జిల్లా సభ్యులు పాల్గొన్నారు.