విశాఖ

మాజీ మంత్రి కొణతాలకు సతీవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 26: సీనియర్ రాజకీయ వేత్త మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి (52) గుండెపోటుతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మృతిచెందారు. విశాఖపట్నం గవర కంచరపాలెంలో ఉంటున్న కొణతాల సతీమణి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఆమె పార్థివ దేహాన్ని స్థానిక గవరపాలెంలోని కొణతాల నివాసానికి ప్రజల సందర్శనార్థం తీసుకువచ్చారు. కొణతాల, పద్మావతి దంపతులకు నలుగురూ ఆడపిల్లలే. తల్లి హఠాన్మరణం చెందడంతో మృతదేహం వద్ద కొణతాల పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొణతాల సతీమణి మృతిచెందిన వార్త తెలుసుకుని జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, వైఎస్సాఆర్ సిపి తదితర అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలు, వివిధ శాఖల అధికారులు కొణతాల నివాసానికి తరలివచ్చి మృతదేహాన్ని సందర్సించి ఆయనను పరామర్శించారు. మాజీమంత్రులు బలిరెడ్డి సత్యారావు, బాలరాజు, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, పొలమరశెట్టి గణబాబు, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్లబాబూరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, వైకాపా జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, మాజీ మేయర్ పులుసు జనార్దనరావు, అనకాపల్లి డిఎస్పీ పురుషోత్తం తదితరులంతా తరలివచ్చి కొణతాలను పరామర్సించిన వారిలో ఉన్నారు. కొణతాల సతీమణి పద్మావతి అంతిమయాత్రలో జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కొణతాల అభిమానులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కొణతాల సతీమణి పద్మావతి మృతితో అనకాపల్లి పట్టణంలో విషాదచాయలు అలముకున్నాయి.