విశాఖ

గరళ కంఠుడికి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, నవంబర్ 21: కార్తీకమాస నాల్గవ సోమవారం సందర్భంగా మండలంలోని పలు దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి.ప్రధానంగా ముద్దుర్తి సంగమేశ్వరాలయం, చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం, జుత్తాడ, గవరవరం, వెంకన్నపాలెం, గోవాడ, భోగాపురం తదితర కాశీవిశే్వశ్వరాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. ఆలయా ల ప్రాంగణంలోని ధ్వజస్తంభాలు, ఉసిరి చెట్లు, నందీశ్వరుని వద్ద మహిళా భక్తులు దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ముద్దుర్తి సంగమేశ్వరాలయంలో ఉదయం పది గంటలకు పార్వతీదేవి, సంగమేశ్వరుల కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. అలాగే మధ్యాహ్నం భక్తులకు భారీ అన్న సంతర్పణ, స్వామివారికి మహానివేదన నిర్వహించారు. జుత్తాడ గ్రామంలోని కాశీవిశే్వశ్వర స్వామి ఆలయం వద్ద మహిళలు తెల్లవారుజాము మూడు గంటలకే అన్నపూర్ణా దేవికి కుంకుమ పూజలు చేసి ఓం నమఃశివాయ అంటూ మంత్రోచ్చారణలు చేసారు. అలాగే వెంకన్నపాలెం తదితర ప్రాంతాల్లోని మామిడితోటలు కార్తీక సమారాదకులతో కిటకిటలాడాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.