విశాఖ

అక్రమార్కుల భరతం పడతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, నవంబర్ 21: సబ్బవరంలోని సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బంజరు భూమి సుమారు 21 ఎకరాలు బినామీల పేరున ఆక్రమించుకుని కోర్టులను తప్పుదారి పట్టిస్తున్న వారి భరతం పడతానని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.సోమవారం మండల పర్యటనకువచ్చిన ఆయన స్థానిక రోడ్లు ,్భవనాలశాఖ అతిధి గృహంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసి రిటైరయిన ఇద్దరు ఎమ్మార్వోల సహకారంతో కొందరు వ్యక్తులు అప్పట్లో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణల పై నిషేదం ఉన్నప్పటికీ ఓ మాజీ తహశీల్దార్ ఇచ్చిన లేఖ ఆధారంగా కోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో కోర్టు ఇచ్చిన స్టేటస్కోను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరిస్తూనే సుమారు 7 ఎకరాల విస్తీర్ణం వరకు ప్రభుత్వ బంజరు భూమిని ప్లాట్‌లుగా వేసి కొందరు అమాయకులకు విక్రయించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తులు, వారి అల్లుళ్ళు, కూతుర్లు, ఇతర బినామీల పేర్లతో సహా తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆక్రమణ భూముల్లో కూడా ఏయే పంటలతో ఉన్నాయో మొత్తం సమాచారం సేకరించానన్నారు. ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకే సాగుచేసుకునేందుకు డి-్ఫరం పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఒక తహశీల్దార్ అవినీతితో ఆర్డీవోకు ఆ కుటుంబం ఆక్రమణకు అర్హులే అని ఇచ్చిన లేఖతో నాటి అధికారులను బెదిరించేందుకు కోర్టులో స్టే తెచ్చారన్నారు.ఈ స్కామ్‌లో మొత్తం 39 మంది పేర్లు ఉన్నాయన్నారు. అయితే తెలియక కొనుగోలు చేసిన వ్యక్తుల పై తాను చర్యలు తీసుకోనని, పట్టణప్రాంతంలో ఇచ్చినట్లు ప్రభుత్వం పల్లెలకు ఇస్తున్న జీవో ప్రకారం ప్రభుత్వ మార్కెట్ ధరను కట్టించుకుని రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ, ఆక్రమణ దారుల అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని పేర్లు తెలపకుండా ఎమ్మెల్యే సవాలు చేశారు. అయితే ఈ దురాక్రమణల్లో మీ పార్టీ వారున్నా కఠిన చర్యలకు ఉపక్రమిస్తారా? అని ఓ విలేఖరి ప్రశ్నించగా పార్టీల కతీతంగా చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ,ఎస్టీ సంఘాల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని విక్రయాలు జరిపిన వారిని కూడా విడిచి పెట్టేది లేదన్నారు. ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేయిస్తానని, కోర్టు ఆదేశాలతో తీసుకున్న ఫ్రభుత్వ బంజరు భూమిని నిరుపేదల ఇళ్ళ స్థలాలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు గండి దేముడు, దొడ్డి ప్రకాశరావు, కొటాన అప్పారావు, తహశీల్దార్ సత్తినాగేశ్వరరెడ్డి, ఎంపిడివో చంద్రకళలు పాల్గొన్నారు.