విశాఖ

బాక్సైట్‌ను తరలించుకుపోయేందుకే పోలీస్ అవుట్ పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 1: బాక్సైట్ ఖనిజాన్ని తరలించుకు పోయేందుకే విశాఖ ఏజన్సీలో ప్రభుత్వం పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. గిరిజనులకు సురక్షిత తాగునీటిని అందించేందుకు నిధులు లేవని చెబుతున్న పాలకులు అవుట్ పోస్టుల ఏర్పాటుకు ఎక్కడ నుండి నిధులు వస్తున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనులకు వౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సి.పి. ఐ. ఆధ్వర్యంలో గురువారం దారకొండలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి చింతపల్లి వెళ్ళిన సి.పి. ఐ. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణలను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసారు. బుధవారం రాత్రి పదిన్నర గంటలకు సి.పి. ఐ.నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు విడిచిపెట్టారు. అనంతరం సత్యనారాయణమూర్తి ఆంధ్రభూమి విలేకరితో మాట్లాడుతూ దారకొండ, సమీప గిరిజన గ్రామాల్లో రక్షిత తాగునీటిని కల్పించాలని, విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతూ గురువారం దారకొండలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. బుధవారం రాత్రి స్థానిక సి.పి. ఐ. నాయకుల ఇంటి వద్ద బస చేయగా చింతపల్లి పోలీసులు ఇంటిని చుట్టుముట్టి దౌర్జన్యంగా తమను పోలీస్ స్టేషన్‌కు తరలించుపోయారన్నారు. దారకొండ సభకు గిరిజనులను రాకుండా గత మూడు రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నిర్భంధంతో గిరిజనులను భయాందోళనకు గురి చేసారన్నారు. అయినప్పటికీ గురువారం ఉదయం 600 మందికి పైగా గిరిజనులు దారకొండ వచ్చారన్నారు. నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో సభ జరగకుండానే గిరిజనులు వెనక్కి వెళ్ళిపోయారని వివరించారు. నిర్భందంతో గిరిజనులను భయాందోళనకు గురి చేయడం సరికాదన్నారు. విశాఖ మన్యంలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే ప్రభుత్వం పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. బాక్సైట్‌ను తరలింపును అడ్డుకుంటారనే భయంతోనే గిరిజనులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏజన్సీలో పిల్లలు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేస్తున్నారని, ఆసుపత్రుల్లో డాక్టర్లు , సిబ్బంది లేని పరిస్థితి ఉందన్నారు. తాము ఆధికారంలోకి వస్తే ప్రజలకు సుజల స్రవంతి పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన ప్రాంతంలో ఒక్క వాటర్ ఫ్లాంట్‌ను పెట్టిన దాఖలాలు లేవన్నారు. కేవలం బాక్సైట్ తవ్వకాల కోసమే పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజలపై నిర్భంధం ప్రయోగిస్తే వారి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అప్రజాస్వామికంగా అరెస్ట్‌లు చేయడం తగదన్నారు. గిరిజనుల హక్కులను హరించాలని ప్రయత్నించిన అనేక ప్రభుత్వాలు కుప్పకూలాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై నిర్భంధం ప్రయోగించుకుండా వారి వౌళిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణమూర్తి డిమాండ్ చేసారు.