విశాఖ

క్యూలో నిలబడలేక... పింఛను రాక.. పండుటాకుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసి గురువారం నాటికి సరిగ్గా నెల రోజులయినప్పటికీ నగదుకోసం ఖాతాదారులు తిప్పలు తప్పలేదు. దీంతో ప్రతీరోజూ బ్యాంక్‌ల చుట్టూతిరగటంతోనే తమ పని సరిపోతోందని, రోజుకు 2వేల చొప్పున నగదుకోసం క్యూలో ఉంటే ముందున్నవారికే దక్కుతోందని పలువురు వాపోతుండగా,తాము సంపాదించి బ్యాంకులో దాచుకున్న సొమ్మును అవసరానికి తీసుకునేందుకు ఇన్నితిప్పలా అంటూ పలువురు ఆసహనం, ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్థాప్య పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తున్న వారికైతే ఆ సొమ్మును తీసుకునేందుకు నరకం చూస్తున్నామని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
గురువారం వారు ఆంధ్రభూమి తోమాట్లాడుతూ నాలుగైదు రోజులుగా తాము క్యూలోనిలబడలేకపోతున్నామని, బ్యాంకులోఅధికారులు తాము కష్టపడి వెళ్లేటప్పటికీ క్యాష్ అయిపోందంటున్నారని తెలిపారు. దీంతోబ్యాంక్‌ల వద్ద నిలుచోలేక తమ ప్రాణాలమీదికివస్తోందని,దీనికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఎస్‌బిఐ మేనేజర్ ప్రకాశ్‌రాజ్‌ను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ వృద్థులు వికలాంగులకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని,కానీ ఖాతాదారులు బయట క్యూలోనుంచి వారిని లోనికి రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. మరో సమస్యకూడా ఇక్కడ తలెత్తుతోంది. పింఛను వెయ్యిరూపాయలకు 100 నోట్లుకావాల్సి రావటం. అయినప్పటికీ బ్యాంక్ సిబ్బంది సాయంతో పింఛన్ దారులకు న్యాయం చేసేందుకు చూస్తున్నామన్నారు. ఇక పంచాయతీల ద్వారా పంపిణీ చేసే 1.24 లక్షల సొమ్ముకూడా వంద నోట్లరూపంలో ఇవ్వాల్సిరావటం కూడా పెద్ద సమస్యగానే చెబుతున్నారు.