విశాఖ

80 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవుటర్ల, డిసెంబర్ 9: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై స్థానిక పోలీసులు శుక్రవారం దాడి చేసి లక్షా 60 వేల రూపాయల విలువైన 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై తారకేశ్వరరావు పోలీసు సిబ్బందితో మండలంలో పాములవాక పట్టాలమ్మ గుడి వద్ద కాపు కాసారు. శుక్రవారం ఉదయం ఏజన్సీ అన్నవరం నుంచి ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈసంఘటనలో 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఆటో, ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. రోలుగుంట మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన సూరెడ్డి కొండబాబు ఏజన్సీలో గంజాయి కొనుగోలు చేసి తునిలో విక్రయించేందుకు కోటవురట్ల మీదుగా తరలిస్తున్నాడు. కొండబాబును ఎస్కార్ట్‌గా నర్సీపట్నంకు చెందిన కంటిపాము శ్యామలరావు, రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన చేపూరి నాగేశ్వరరావు ముందు బైక్‌పై వెళ్తుండగా వెనుక ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వీరిని నర్సీపట్నం కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
పింఛన్ల కోసం లబ్దిదారుల ఇక్కట్లు
సీలేరు, డిసెంబర్ 9: మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఫించన్‌దారులు ఒక్కసారిగా స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే బ్యాంకు వద్ద వందలాది మంది ఫించన్‌దారులు ఫించన్ సొమ్ము కోసం క్యూ కట్టారు.
జి.కె.వీధి మండలంలోని పలు పంచాయతీల పరిధిలో గిరిజన గ్రామాల్లో ఫించన్ లబ్దిదారులందరూ అధిక సంఖ్యలో రావడంతో బ్యాంకు వద్ద గందరగోళం నెలకొంది. ఒక్కొక్కరికి ఫించన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కొంత మందికి మాత్రమే బ్యాంకు సిబ్బంది ఫించన్ ఇవ్వగలిగారు. సుమారు 100 మందికిపైగానే లబ్దిదారులు బ్యాంకు సమయం అయిపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
టీచర్స్ సర్వీస్ రూల్స్ విడుదలపై హర్షం
యలమంచిలి, డిశంబరు 9: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ టీచర్స్ సర్వీస్ రూల్స్‌ను ప్రభుత్వం ఎట్టికేలకు విడుదల చేసింది. గురువారం రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడంతో యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు జి. యల్లయ్యబాబు, ఎ. మల్లీకార్జనలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మున్సిపల్, కార్పోరేష్‌న్ పరిధిలో ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు నూతన పాఠశాలను నిర్మించి విద్యాభివృద్ధికి కృచేయాలని కోరారు. అలాగే విద్యాహక్కు చట్టం పఠిష్టంగా అమలు చేయాలని వీరు అన్నారు.